Rules Violations
-
అంబానీ సోదరులకు శాట్‌లో ఊరట
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ టేకోవర్ నిబంధనలు ఉల్లంఘన కేసులో ప్రముఖ పారిశ్రామికవేత్తలు ముకేశ్ అంబానీ, అనిల్ అంబానీ తదితరులపై సెబీ విధించిన రూ.25 కోట్ల జరిమానా ఆదేశాలను సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (శాట్) కొట్టివేసింది. సెబీ ఆదేశాలను అంబానీ సోదరులు అప్పీల్ చేయడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. షేర్లను గణనీయంగా కొనుగోలు చేయడం, స్వా«దీనం చేసుకోవడం (ఎస్‌ఏఎస్‌టీ) నిబంధనలను అప్పీలుదారు ఉల్లంఘించలేదని నిర్ధారిస్తూ, దీంతో సెబీ విధించిన జరిమానా ఆదేశాలు చెల్లుబాటు కావని శాట్ తేల్చింది. సెబీ ఆదేశాల మేరకు ఇప్పటికే అంబానీ సోదరులు, ఇతర సంస్థలు రూ.25 కోట్లను డిపాజిట్ చేయగా, వాటిని తిరిగి ఇచ్చేయాలని శాట్ ఆదేశించింది. 2000కు ముందు కేసు.. 2000కు ముందు రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు సంబంధించిన కేసు ఇది. కంపెనీలో 5 శాతానికి పైగా వాటాలను (మొత్తం 6.83 శాతం) ప్రమోటర్లు, పర్సన్స్ యాక్టింగ్ ఇన్ కన్సర్ట్ (పీఏసీలు)లతో కొనుగోలు చేసినా కానీ, ఆ సమాచారాన్ని వెల్లడించలేదంటూ సెబీ తప్పుబట్టింది. ఈ కేసులో ముకేశ్ అంబానీ ఆయన భార్య నీతా అంబానీ, అనిల్ అంబానీ, ఆయన భార్య టీనా అంబానీ, ఇతర సంస్థలు నిబంధనలు పాటించలేదని 2021 ఏప్రిల్‌లో జరిమానా విధిస్తూ, ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. సెబీ డిస్క్లోజర్ నిబంధనల కింద 5 శాతానికి మించి వాటాలు కొనుగోలు చేస్తే ఆ సమాచారాన్ని వెల్లడించడం తప్పనిసరి. -
ట్విటర్ కీలక నిర్ణయం.. ఇకపై అలాంటి ట్వీట్లు కనిపించవు..
న్యూఢిల్లీ: నిబంధనలకు విరుద్ధంగా ఉండే ట్వీట్లకు పరిమితులు వర్తింపచేయనున్నట్లు సోషల్ మీడియా సైట్ ట్విటర్ వెల్లడించింది. ఇకపై రూల్స్‌ను అతిక్రమించే ట్వీట్లను చూపడంపై (విజిబిలిటీ) ఆంక్షలు అమలు చేయనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు పాలసీని అప్డేట్ చేసినట్లు వివరించింది. దీని ప్రకారం ముందుగా, విద్వేషపూరిత ప్రవర్తన నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయనిపించే ట్వీట్లను వడగట్టేందుకు ట్విటర్ విజిబిలిటీ ఫిల్టర్‌ను ఉపయోగించనుంది. ఆ తర్వాత ఇతరత్రా విభాగాలకు కూడా దీన్ని విస్తరించనుంది. అభ్యంతరకరమైన ట్వీట్లపై, వాటి విజిబిలిటీ మీద ఆంక్షలు విధించినట్లుగా అందరికీ కనిపించేలా ముద్ర వేస్తారు. అయితే, ఆయా ట్వీట్లను ట్విటర్ తప్పుగా వర్గీకరించిందని వాటిని పోస్ట్ చేసిన యూజర్లు గానీ సంప్రదించిన పక్షంలో పునఃసమీక్షిస్తామని ట్విటర్ పేర్కొంది. అయితే, ట్వీట్ విజిబిలిటీని పునరుద్ధరించేందుకు గ్యారంటీ అంటూ ఉండదని స్పష్టం చేసింది. సాధారణంగా తాము వాక్స్వాతంత్య్రానికి పెద్ద పీట వేస్తామని, సెన్సార్షిప్ భయం లేకుండా తమ అభిప్రాయాలు, ఐడియాలను చెప్పేందుకు యూజర్లందరికీ హక్కులు ఉంటాయని ట్విటర్ తెలిపింది. అదే సమయంలో వారందరికీ కూడా తమ ప్లాట్‌ఫామ్ సురక్షితమైనదిగా ఉండేలా తీర్చిదిద్దేందుకే ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. -
సికింద్రాబాద్ అగ్నిప్రమాదం: నిప్పుల్లో నిబంధనలు
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని రూబీ ఎలక్ట్రికల్ స్కూటర్స్, రూబీ లాడ్జీలతో కూడిన భవనం నిబంధనల ఉల్లంఘనకు కేరాఫ్ అడ్రస్‌గా ఉంది. ఫైర్ సేఫ్టీ మెజర్స్ అతిక్రమించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. భవనం ఏరియా సైతం ఉండాల్సిన విధంగా లేదు. ఈ కారణంగానే సోమవారం రాత్రి చోటు చేసుకున్న అగ్నిప్రమాదం ఎనిమిది మందిని పొట్టనపెట్టుకుంది. ఉల్లంఘనలు ఇలా.. ► భవనం సెల్లార్, గ్రౌండ్ ప్లస్ ఫోర్‌తో పాటు పెంట్ హౌస్‌తో కలిపి మొత్తం ఆరు అంతస్తులు ఉంది. సెల్లార్‌ను నిబంధనలకు విరుద్ధంగా ఈ–బైక్స్ షోరూమ్, సర్వీసింగ్ పాయింట్‌గా మార్చారు. ఈ మొత్తం విస్తీర్ణంలో కనీసం 1/3 వంతు ఖాళీ స్థలం ఉండాలి. ఇది మచ్చుకైనా లేదు. భవనం చుట్టూ ఫైరింజన్ స్వేచ్ఛగా తిరిగేలా ఖాళీ స్థలం ఉండాలి. అరకొర స్థలంలో నిర్మించిన ఈ భవనంలో తూర్పు వైపు రోడ్డు మినహామిస్తే మిగిలిన మూడు దిక్కులూ కనీసం నడిచే స్థలం కూడా లేదు. ► ప్రమాదం జరిగితే బయటపడానికి వెలుపల వైపు స్టెయిర్ కేస్ ఉండాలి. వెలుపల మాట అటుంచితే లోపల ఉన్న ఇంటర్నల్ స్టెయిర్ కేస్ మీటర్ వెడల్పు కూడా లేదు. అత్యవసర సమయంలో వెలిగించేందుకు ఎమర్జెన్సీ లైట్లు, ఆటో గ్లో సిస్టమ్ ఉండాలి. భవనంలో ఎమర్జెన్సీ లైట్లు తగిన సంఖ్యలో లేవు. గ్లో సిస్టమ్ లేనే లేదు. ప్రమాదం జరిగితే అగ్నిమాపక సిబ్బంది కోసం ప్రత్యేక లిఫ్ట్ ఉండాలి. ఇది ఎక్కడా కనిపించలేదు. స్టెయిర్ కేస్ వద్ద ఉన్నది కూడా లాడ్జిలో బస చేసిన వారికీ ఉపయుక్తంగా లేదు. ► మంటలార్పేందుకు ఈ భవనంలో ఫైర్ ఎక్స్టింగ్విషర్లు, వాటర్ పైపులు, స్ప్రింక్లర్స్‌తో పాటు వెట్ రైజర్ తప్పనిసరి. ఇందులో వాటర్ పైపులు, స్ప్రింక్లర్స్ మాత్రం ఉన్నాయి. అవి ఎంత వరకు పని చేశాయన్నది తేలాల్సి ఉంది. విద్యుత్ ఫైర్ అలారం, మాన్యువల్ ఫైర్ అలారం తప్పనిసరి. ఈ రెండూ రూబీ లాడ్జిలో మచ్చుకైనా కనిపించలేదు. ప్రమాదాన్ని పసిగట్టి హెచ్చరించే ఆటోమేటిక్ వ్యవస్థ ఉండాలి. ఇలాంటిది ఎక్కడా కనిపించలేదని అగ్నిమాపక శాఖ అధికారులు చెబుతున్నారు. ► అగ్ని ప్రమాదాల్లో మాత్రమే వినియోగించడానికి ఉపకరించే అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంక్, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ తప్పనిసరి. ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ మాత్రమే ఉంది. దీన్ని సాధారణ వాడకానికి వినియోగిస్తున్నారనే అనుమానాలు ఉన్నాయి. అగ్ని ప్రమాదాల సందర్భంలో నీటిని సరఫరా చేసేందుకు విద్యుత్, డీజిల్, జాకీ పంప్‌లు ప్రత్యేకంగా ఉండాలి. ఎంత వెతికినా ఇవి ఎక్కడా కనిపించలేదు. నిప్పుల్లో నిబంధనలు అగ్ని మాపక నిబంధనల్లో రూబీ లాడ్జీ యాజమాన్యం నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా కనిపించింది. ఇలాంటి నిర్లక్ష్యపూరిత నిర్మాణాలు నగరంలో అనేకం ఉన్నాయి. వీటి విషయం అటు పాలకులు, ఇటు అధికారులు ఎవరికీ పట్టడంలేదు. ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే ఒకటి రెండు రోజులు హడావుడి చేస్తున్నారు. ఆ తర్వాత కథ షరామామూలే. అనుమతుల్లేని భవనాలు, పై అంతస్తులు నిర్మించుకోవడం, పైస్థాయిలో పైరవీలతో అనుమతులు తీసుకోవడమో, మేనేజ్ చేయడమో నగరంలో సాధారణంగా మారింది. జీహెచ్ఎంసీ ఎన్ని నిబంధనలు పెట్టినా, చట్టాలు తీసుకువచ్చినా అవన్నీ కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయి. అన్ని శాఖలు మూకుమ్మడిగా అనుమతి నిరాకరించిన అనేక బహుళ అంతస్తుల భవనాలు, వాణిజ్య సముదాయాలకు ప్రభుత్వమే వివిధ సందర్భాల్లో అనుమతులు మంజూరు చేసింది. వీటి విషయంలో న్యాయస్థానాలు సైతం పలుమార్లు మొట్టికాయలు వేసినా.. పటిష్ట చర్యలు తీసుకోవడానికి మాత్రం వెనుకడుగు వేస్తోంది. కోఠిలోని పుష్పాంజలి కాంప్లెక్స్‌లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం ఈ విషయంలో అందరి కళ్లూ తెరిపించింది. ఆ తర్వాత మీనా జ్యువెలర్స్ ఉదంతంతో అధికార గణం మరింత అప్రమత్తమయ్యామంటూ ఊదరగొట్టింది. ఇవన్నీ కేవలం ఆరంభశూరత్వాలుగానే మిగిలిపోయాయి. ముఖ్యంగా నగరంలో ఉన్న అని భవనాలను సందర్శించి ఫైర్ సేఫ్టీ మెజర్స్ పరీక్షిస్తామని, నిబంధనల ప్రకారం లేని వాటి యజమానులను చైతన్య పరుస్తామని, ఆ తర్వాత కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు అనేక సందర్భాల్లో ప్రకటించారు. కొన్ని రోజులు గడిచాక ఈ విషయాలనే మర్చిపోతున్నారు. గతంలో అధికారులు నిర్వహించిన సర్వేలో ఇలాంటి భవనాలు నగరంలో వేల సంఖ్యలో ఉన్నాయని బయటపడింది. అయినా ఇప్పటికీ వీటిపై తీసుకున్న సరైన చర్యలు లేవు. అందుకే ఎక్కడపడితే అక్కడ అక్రమ భవనాలు వెలుస్తున్నాయి. సోమవారం నాటి రూబీ లాడ్జి అగ్ని ప్రమాదంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. ఇకనైనా అధికారులు కఠినంగా వ్యవహరించి సరైన చర్యలు తీసుకోకపోతే... అనేక మంది అమాయకుల ప్రాణాలు బలి కావాల్సిందే. (క్లిక్ చేయండి: చివరి నిమిషంలో రూబీ లాడ్జీలో దిగి.. మృత్యువు పిలిచినట్టు..) -
2 వేల లోన్ యాప్స్ తొలగింపు
న్యూఢిల్లీ: నిబంధనల ఉల్లంఘన, తప్పుదోవ పట్టించే సమాచారం ఇవ్వడం, వివాదాస్పద ఆఫ్‌లైన్ ధోరణులు తదితర అంశాల కారణంగా ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకూ ఇండియా ప్లే స్టోర్ నుంచి 2,000 పైగా లోన్ యాప్స్‌ను తొలగించినట్లు టెక్ దిగ్గజం గూగుల్ సీనియర్ డైరెక్టర్ సైకత్ మిత్రా తెలిపారు. రుణాల యాప్‌ల సమస్య ఇప్పటికే తారా స్థాయికి చేరుకుందని, దీనిపై అంతా దృష్టి పెడుతున్న నేపథ్యంలో ఇది ఇకపై క్రమంగా తగ్గుముఖం పట్టొచ్చని మిత్రా వివరించారు. రాబోయే రోజుల్లో నిబంధనలను మరింత కఠినతరం చేసే అంశాన్ని కూడా సంస్థ పరిశీలిస్తున్నట్లు ఆయన చెప్పారు. లోన్ యాప్‌ల సమస్య ఒకో మార్కెట్లో ఒకో రకంగా ఉంటోందని మిత్రా తెలిపారు. అమెరికాలో పోటీ సంస్థలను దెబ్బతీసే విధమైన యాప్‌ల సమస్య ఉండగా.. భారత్‌లో తప్పుదోవ పట్టించే, నిబంధనలను ఉల్లంఘించడం రూపంలో యాప్‌ల సమస్య ఉన్నట్లు పేర్కొన్నారు. తాము కార్యకలాపాలు సాగించే అన్ని దేశాల్లోనూ నియంత్రణ నిబంధనలను పాటించడానికి కట్టుబడి ఉన్నామని మిత్రా స్పష్టం చేశారు. సైబర్‌సెక్యూరిటీపై రోడ్‌షోలు.. ఆన్లైన్ భద్రతపై అవగాహన కల్పించే దిశగా భారత్‌లో వివిధ నగరాల్లో సైబర్‌సెక్యూరిటీ రోడ్‌షోలు నిర్వహించనున్నట్లు గూగుల్ వైస్ ప్రెసిడెంట్ సంజయ్ గుప్తా తెలిపారు. 1,00,000 మంది డెవలపర్లకు శిక్షణ కల్పించనున్నట్లు, అలాగే డిజిటల్ భద్రతను ప్రోత్సహించే దిశగా వివిధ సంస్థలకు గూగుల్‌డాట్‌ఆర్గ్ 2 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 16 కోట్లు) నిధులు గ్రాంట్‌గా అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కలెక్టివ్ గుడ్ ఫౌండేషన్, పాయింట్ ఆఫ్ వ్యూ, హెల్ప్‌ఏజ్ ఇండియా తదితర స్వచ్ఛంద సేవా సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. సైబర్ ముప్పుల నుంచి డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు పటిష్టమైన రక్షణ కల్పించే ఉద్దేశ్యంతో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు గుప్తా వివరించారు. డిజిటల్ లావాదేవీలను సురక్షితంగా నిర్వహించే క్రమంలో మెరుగైన విధానాలు పాటించేలా ఇంటర్నెట్ యూజర్లను ప్రోత్సహించే అవగాహన కార్యక్రమాన్ని కూడా వివిధ భాషల్లో గూగుల్ ఆవిష్కరించింది. -
ఆకాశానికి భవంతులు
ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా పుట్టపర్తి పట్టణంలో భవనాలు ఆకాశానికి లేచాయి. నిబంధనలకు విరుద్ధంగా గత టీడీపీ హయాంలో పది అంతస్తుల వరకు ఆ పార్టీ నేతలు నిర్మించారు. అందులో కొన్ని పూర్తి కాగా.. ఇంకొన్ని ఇప్పటికీ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అత్యంత ఎత్తైన భవనాల్లో ఏ ఒక్కదానికీ అనుమతులు లేవు. అయినా మున్సిపల్ అధికారులు, పుడా (పుట్టపర్తి అర్బన్ డెవపల్‌మెంట్ అథారిటీ) అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. సాక్షి, పుట్టపర్తి: జిల్లా కేంద్రం పుట్టపర్తిలో అపార్ట్మెంట్ కల్చర్ అధికంగా ఉంది. అయితే తీసుకున్న అనుమతులుకు.. నిర్మిస్తున్న భవనాలకు ఏమాత్రం పొంతన ఉండటం లేదు. అడిగేవారు లేరని అత్యంత ఎత్తయిన భవనాలు నిర్మించేస్తున్నారు. పుట్టపర్తి మున్సిపాలిటీ నిబంధనల ప్రకారం ‘జీ ప్లస్ టూ’ అంటే మొదటిది కాకుండా మరో రెండు అంతస్తులు నిర్మించుకోవచ్చు. అంతకంటే ఎక్కువ అంతస్తులు నిర్మించాలంటే పుడా (పుట్టపర్తి అర్బన్ డెవపల్‌మెంట్ అథారిటీ) నుంచి అనుమతులు తీసుకోవాలి. ముందుగా దరఖాస్తు చేసుకుని అనుమతులు జారీ అయిన తర్వాతనే భవనాలు నిర్మించాలి. అయితే పుట్టపర్తిలో వందకు పైగా భవనాలు 10 అంతస్తుల వరకు ఉన్నాయి. వాటికి మున్సిపాలిటీ అనుమతులు మాత్రమే ఉన్నాయి. రెండు అంతస్తులకు అనుమతులు తీసుకుని.. మూడు నాలుగు రెట్లు ఎక్కువ అంతస్తులు నిర్మించారు. అయినా ఇంతవరకు యజమానులపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. నిబంధనలు ఇవే.. పుట్టపర్తి పట్టణ అభివృద్ధి సంస్థ (పుడా) నిబంధనల ప్రకారం రెండంతస్తుల కంటే ఎక్కువ ఎత్తు నిర్మించాలంటే ముందుగా అనుమతులు తీసుకోవాలి. లే అవుట్ అయితే 10 శాతం స్థలాన్ని ముందుగా పుడాకు అప్పజెప్పాలి. ఆ తర్వాతే నిర్మాణాలు మొదలుపెట్టాలి. భవనాల చుట్టూ ఎత్తు ఆధారంగా పుడా నిర్ణయించిన మేరకు స్థలం వదలాల్సి ఉంటుంది. కనీసం 7.5 సెంట్ల కంటే ఎక్కువ స్థలం అయితేనే పుడా పరిధిలోకి వస్తుంది. లేదంటే రెండు కంటే ఎక్కువ అంతస్తులు అయి ఉండాలి. అంతకంటే తక్కువ అయితే మున్సిపాలిటీ అనుమతి తప్పనిసరి. అయితే ఈ నిబంధనలన్నీ తుంగలో తొక్కి భారీ భవనాలు వెలిశాయి. టీడీపీ హయాంలో చేపట్టిన నిర్మాణాల్లో కొన్ని... కమ్మవారిపల్లికి చెందిన నారాయణప్ప మున్సిపల్ కార్యాలయం ఎదురుగా తొమ్మిది అంతస్తుల భవనం నిర్మించారు. దీనికి ఎలాంటి అనుమతులూ తీసుకోలేదు. కమ్మవారిపల్లికి చెందిన మోర్ ఆదెప్ప గ్రౌండ్ ఏరియాలో 10 అంతస్తుల భవనం నిర్మిస్తున్నాడు. కొన్ని అంతస్తులు పూర్తయి నివాసం ఉంటున్నారు. పైన ఇంకొన్ని నిర్మాణంలో ఉన్నాయి. డ్వాక్రా బజారు వెనుక రోడ్డులో కొందరు ఉపాధ్యాయులు సంయుక్తంగా 8 అంతస్తుల భవనం నిర్మించారు. గోకులంలో టీచర్ వెంకటేశ్.. 9 అంతస్తుల భవనం నిర్మిస్తున్నాడు. అందులో మొత్తం 80 ఫ్లాట్లు ఉన్నాయి. నిర్మాణం తుదిదశకు చేరుకుంది. నోటీసులు ఇచ్చాం నిబంధనలను ఉల్లంఘించి భవనాలు నిర్మించిన వారికి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నోటీసులు జారీ చేశాం. మరోసారి సర్వే నిర్వహించి.. ఇంకెంత మంది ఉన్నారో అందరికీ నోటీసులు ఇస్తాం. మున్సిపాలిటీ పరిధి జీ ప్లస్ టూ వరకు మాత్రమే. ఆ పై అంతస్తులకు పుడా ముందస్తు అనుమతులు తప్పనిసరి. నిబంధనలు ఉల్లంఘించిన వారు ఎంతటి వారైనా చట్టరీత్యా చర్యలకు ఆదేశిస్తాం. అనుమతులు లేకుండా ఇప్పటికే పూర్తి చేసిన భవనాలకు దాని విలువలో 20 శాతం మేర జరిమానా విధిస్తాం.. లేదంటే మూడేళ్ల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. – కేఎన్ నరేశ్ కృష్ణ, పుడా వైస్ చైర్మన్ -
జెట్ స్పీడ్‌తో దూసుకెళ్లిన ఆటో.. ఛేజ్ చేసిన పోలీసులకు షాక్
వైరల్: ఇవాళ ప్రపంచ జనాభా దినోత్సవం. అంతేనా.. మరో ఏడాదిలో మన జనాభా.. చైనా జనాభాను అధిగమించి ప్రపంచంలో నెంబర్ వన్ స్థానానికి ఎదగబోతోందని సర్వేలు వెల్లడించాయి కూడా. అదే సమయంలో సోషల్ మీడియాలో జనాభా పెరుగుదల మీద ఇవాళ రకరకాల చర్చలూ జరుగుతున్నాయి. ఈ క్రమంలో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో ఆసక్తికరంగా మారింది. రోడ్డు మీద ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న పోలీసులకు.. స్పీడ్ గన్ వేగాన్ని మించి దూసుకుపోయిన ఓ ఆటో కనిపించింది. దీంతో ఆ ఆటోను ఛేజ్ చేశారు పోలీసులు. ఎట్టకేలకు దానిని ఆపి.. అందులోంచి ప్యాసింజర్లను దించే యత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు నోళ్లు వెళ్లబెట్టారు. ఒకటి కాదు.. రెండుకాదు.. ఏకంగా 27 మంది(డ్రైవర్‌తో పాటు) ప్రయాణికులు దిగారు ఆ ఆటో నుంచి. ఇంకేం షాక్ కావడం పోలీసుల వంతు అయ్యింది. ఇది ఎప్పుడు జరిగిందనే దానిపై స్పష్టత లేకున్నా.. ఉత్తర ప్రదేశ్ ఫతేపూర్ బిండ్‌కీ కోట్వాలి రీజియన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. చిన్నపిల్లలను పెద్దలతో కలిపి కుక్కేసి మరీ ఆ త్రీవీలర్‌లో తీసుకెళ్లే యత్నం చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఎలాంటి చర్యలు తీసుకున్నారన్న దానిపై మాత్రం స్పష్టత లేదు. అశ్విని ఉపాధ్యాయ అనే ట్విటర్ యూజర్ దానిని పోస్ట్ చేయగా.. విపరీతమైన లైకులు,షేర్లు, కామెంట్లతో దూసుకుపోతోంది. जनसंख्या विस्फोट का दुष्परिणाम ऑटो एक और सवारी सत्ताईस👇 pic.twitter.com/ex7QCiRJTp — Ashwini Upadhyay (@AshwiniUpadhyay) July 11, 2022 -
ప్రైవేట్ ట్రావెల్స్ రూటే సెపరేటు..అనుమతులు ఒకలా.. ప్రయాణం మరోలా..
సాక్షి, ఆదిలాబాద్: ప్రైవేటు ట్రావెల్స్ అడ్డదారిలో జిల్లా ప్రయాణికులను తరలించుకుపోతూ ఆర్టీసీ ఆదాయానికి గండి కొడుతున్నాయి. కాంటాక్టు క్యారియర్ అనుమతులు ఉన్న బస్సులు ఇలా మధ్య, మధ్యలో ఆపి ప్రయాణికులను తీసుకెళ్లడం నిబంధనలకు విరుద్ధం. కానీ ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్ నుంచి జిల్లా మీదుగా నిత్యం రాకపోకలు సాగించే ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు స్టేజ్ క్యారియర్ అనుమతి లేకున్నా.. ఆదిలాబాద్‌లో నిలిపి ప్రయాణికులను తీసుకెళ్తున్నాయి. నిబంధనలు ఉల్లంఘించే ట్రావెల్స్ బస్సులపై చర్య తీసుకోవాల్సిన ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు. జిల్లా కేంద్రం మీదుగా ఆదిలాబాద్–హైదరాబాద్, రాయ్‌పూర్ – హైదరాబాద్, నాగ్‌పూర్ – బెంగళూరు మధ్య అనేక ప్రైవేట్ బస్సులు నడుస్తాయి. ఆరెంజ్, జీడీఆర్, ఎస్ఆర్ఎస్, శబరి, దివాకర్, ఖురానా అనే ట్రావెల్ బస్సులు ఇతర ప్రాంతాల నుంచి బయలుదేరి ఆదిలాబాద్ మీదుగా గమ్య స్థానానికి వెళ్తాయి. ఇవే కాకుండా ఆదిలాబాద్ నుంచి నిత్యం ముస్కాన్, మెట్రో, డైమండ్, పల్లవి, సహరా స్థానిక ట్రావెల్స్ ఏజెన్సీల నుంచి హైదరాబాద్‌కు రాత్రి సర్వీసులు నడుస్తాయి. కర్ణాటక రాష్ట్రంలోని కలబురగి వద్ద ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురై దగ్ధమైంది. ఈ ఘటనలో ఏడుగురు సజీవదహనం అయ్యారు. వారంతా హైదరాబాద్ వాసులు కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంఘటన కలకలం రేపింది. ప్రైవేట్ బస్సుల్లో భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా కేంద్రం నుంచి నిత్యం పదుల సంఖ్యలో ప్రైవేట్ ట్రావెల్స్ ద్వారా వందలాది మంది ప్యాసింజర్లు గమ్యస్థానాలకు వెళ్తున్నారు. లాగేజీ దందా.. కాంటాక్టు క్యారియర్ అనుమతి తీసుకుని నిబంధనలు ఉల్లంఘిస్తూ స్టేజ్ క్యారియర్‌గా బస్సులను నడుపుతుండడమే కాకుండా ఈ ట్రావెల్స్ ఏజెన్సీ నిర్వాహకులు పార్శిల్, లగేజీ దందాను అక్రమంగా నిర్వహిస్తున్నాయి. ఇక్కడి నుంచి వచ్చిపోయే బస్సులు పెద్ద మొత్తంలో పార్శిల్, లగేజీ నిర్వాహణ చేపడుతున్నాయి. వస్తు సామగ్రిని ఒక చోట నుంచి మరోచోటకి బస్సుల ద్వారా తరలించే అనుమతి వీరికి లేకపోయినా యథేచ్చగా నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ప్యాసింజర్లను చేరవేయడం ద్వారా ట్రావెల్ ఏజెన్సీలకు అనుకున్న స్థాయిలో లాభాలు ఉండవని, అసలు పార్శిల్, లగేజీలు చేరవేయడం ద్వారా పెద్ద ఎత్తున అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఈ బస్సుల ద్వారా వస్తుసామగ్రి చేరవేత రూపంలో అనేక అక్రమ దందాలు కూడా కొనసాగుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. కొంత మంది వ్యాపారులు డబ్బులను హవాలా రూపంలో చేరవేస్తారనే ప్రచారం కూడా ఉంది. పెద్ద మొత్తంలో లగేజీని బస్సుల బాక్స్లతోపాటు టాప్‌పై తీసుకొస్తుండడంతో ఎదైనా ప్రమాదాలు జరిగినప్పుడు ఈ లగేజీ కారణంగా ప్రమాద తీవ్రత పెరుగుతుంది. దీనిపై ఇటు పోలీసు, అటు రవాణా శాఖ అధికారుల నిఘా లేకపోవడం వారికి కలిసి వస్తోంది. భద్రత డొల్లా.. ప్రస్తుతం ప్రైవేట్ బస్సులు స్లీపర్ కోచ్‌లను తీసుకురావడం జరిగింది. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు వీటిపై ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈ సీటింగ్ విధానంతో బస్సు లోపల స్థలం ఇరుకుగా మారింది. ఎదైనా ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రయాణికులు ఒకరికి దాటుకుని మరొకరు బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లోనే మరణాల సంఖ్య పెరుగుతుంది. సాధారణంగా కాంటాక్టు క్యారియర్ అనుమతి ఉన్నవారు పెళ్లిళ్లు, శుభకార్యాలకు బస్సులను అద్దెకిస్తారు. దానికి విరుద్ధం స్టేజ్ క్యారియర్ అనుమతి లేకున్నప్పటికీ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి బస్సును నడపడమే కాకుండా మధ్యమధ్యలో బస్సును ఆపి ప్రయాణికులను చేరవేయడం నిబంధనలకు విరుద్దం. కానీ ఇవన్నీ యథేచ్ఛగా జరుగుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. -
కస్సు బస్సు!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్సులు రోడ్లపై హడలెత్తిస్తున్నాయి. సిటీ, ఇతర జిల్లాలు, రాష్ట్రాల బస్సులనే తేడా లేకుండా యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయి. ఇటీవల ఆ సంస్థ తీసుకున్న ‘డ్రైవర్ నంబర్’ నిర్ణయం సైతం సెల్‌ఫోన్ డ్రైవింగ్‌ను ప్రోత్సహించేలా ఉంది. మరోపక్క నగరంలో ట్రాఫిక్ ఇక్కట్లు తగ్గించే ఉద్దేశంతో పోలీసు విభాగం ప్రతిపాదించిన రూట్ల పొడిగింపు అంశాన్నీ ఆ సంస్థ పట్టించుకోవట్లేదు. నడిరోడ్లే వారికి బస్‌బేలు.. నగరంలో తిరిగే సిటీ బస్సుల కోసం అనేక ప్రాంతాల్లో ప్రత్యేకంగా బస్టాపులు, బస్ బేలు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో ఇతర వాహనాలు ఆగకుండా కొన్ని ప్రాంతాల్లో ఆర్టీసీ సిబ్బంది కూడా పని చేస్తుంటారు. అనేక సిటీ బస్సులు వీటిల్లో కాకుండా నడిరోడ్డుపై ఆగుతుంటాయి. ఒకేసారి అనేక బస్సులు రావడంతో పాటు డ్రైవర్ల నిర్లక్ష్యమూ దీనికి కారణమని పోలీసులు చెబుతున్నారు. ఇది చాలదన్నట్లు ఇటీవల ఆర్టీసీ అధికారులు ప్రయాణికులు ఎక్కడ చెయ్యెత్తితే అక్కడ బస్సులు ఆపాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో బస్టాప్‌లు, బస్ బేలు ఉన్న చోట మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాల్లోనూ నడిరోడ్లపై ఆగుతున్న ఆర్టీసీ బస్సులు ట్రాఫిక్ జామ్‌లకు కారణమవుతున్నాయి. రూట్లపై స్పందన నామమాత్రం.. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి బయలుదేరే ఆర్టీసీ బస్సుల గమ్యస్థానం మెహిదీపట్నంగా ఉంటోంది. ఈ రూట్లు ఇక్కడితో ముగిసిపోతుండటంతో స్థానికంగా ట్రాఫిక్ ఇబ్బందులు వస్తున్నాయి. అవే ఆర్టీసీ బస్సు రూట్లు అటు షేక్‌పేట్, ఇటు అత్తాపూర్ వరకు ఉంటే మెహిదీపట్నం ప్రాంతంలో రద్దీ తగ్గుతుంది. రాజధానిలోని అనేక ఆర్టీసీ రూట్లు ఇలానే ఉన్నాయి. దీన్ని పరిగణనలోకి తీసుకున్న సిటీ ట్రాఫిక్ వింగ్ వీటి పొడిగింపుపై దృష్టి పెట్టింది. దీనికి అవసరమైన అధ్యయనంలో బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ నిపుణుల సహాయం తీసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రతిపాదనలు పంపాల్సిందిగా ఆర్టీసీ అధికారులను కోరింది. దీనిపైనా ఆ విభాగం నుంచి నామమాత్రపు స్పందనే వచ్చింది. అధ్యయనానికి ఏమాత్రం ఉపకరించని విధంగా ప్రతిపాదనలు పంపడం విమర్శలకు తావిస్తోంది. (చదవండి: పైసలు తీసుకుంటూ పట్టుబడ్డారు) -
ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ‘ప్యూరిఫైడ్’ దందా!
సాక్షి,ఆదిలాబాద్‌టౌన్: వేసవి వచ్చిందంటే చాలు జిల్లాలో నీళ్ల దందా షురూ అవుతుంది. పుట్టగొడుగుల్లా వాటర్ ప్లాంట్లు వెలుస్తాయి. అయితే వీటికి అనుమతులు ఉండవు.. ప్రమాణాలు పాటించరు.. నిర్వహణ సైతం ఇష్టారీతిన కొనసాగుతోంది. రక్షిత నీటిని తాగాలన్న ప్రజల బలహీనతను ఆసరా చేసుకుని ప్యూరిఫైడ్ పేరిట కొందరు ఏటా లక్షలాది రూపాయలు అర్జిస్తున్నారు. క్యాన్లలో కలుషిత నీటిని అందిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఐఎస్ఐ అనుమతి ఉండి రెన్యూవల్ చేసుకోని వాటర్ప్లాంట్లు 20 వరకు ఉండగా జిల్లా వ్యాప్తంగా వీటి సంఖ్య దాదాపు 700లకు పైగానే ఉంది. అయితే ఇందులో ఒక్క ప్లాంట్ కూడా నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని తెలుస్తోంది. వీటికి అనుమతులు సైతం లేకపోవడం గమనార్హం. ఇదంతా కళ్లెదుటే జరుగుతున్నా సంబంధిత అధికారులు ‘మామూలు’గా తీసుకుంటున్నారనే విమర్శలు లేకపోలేదు. ఈ ప్లాంట్లలో పాత యంత్రాలు వాడటం, పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటం, జలాన్ని శుద్ధి చేయకుండానే సాధారణ నీటినే క్యాన్లలో సరఫరా చేస్తున్నారు. ఇలాంటి నీటిని తాగితే రోగాల బారిన పడడం ఖాయమంటున్నారు వైద్య నిపుణులు. ప్రమాణాలు పాటించని వైనం.. భారత ప్రమాణాల సంస్థ (ఐఎస్ఐ) నిబంధనలు ఏ ఒక్కటీ అమలు కావడం లేదు. జిల్లాలో సుమారు 700 వరకు వాటర్ ప్లాంట్లు ఉన్నాయి. వాటిలో ఏ ఒక్కదానికి కూడా అనుమతి లేదు. ఇళ్లల్లో, దుకాణాల్లో, పాత గదుల్లో ప్లాంట్లను నిర్వహిస్తున్నారు. ఇందులో ఏ ఒక్క ప్లాంట్‌లో కూడా నీటి నిర్ధారణ పరీక్షలు చేయడం లేదు. మైక్రోబయోలజిస్ట్, కెమిస్టులు అందుబాటులో ఉండడం లేదు. జిల్లాలో ఏటా ఈ ప్లాంట్ల నిర్వాహకులకు మొత్తంగా సుమారు రూ.25 కోట్లకు పైగా ఆదాయం సమకూరుతోంది. దీంతో ఏడాదికేడాది వాటర్ ప్లాంట్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. గతంలో పట్టణాలకు పరిమితమైన వాటర్ప్లాంట్లు ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలకు సైతం విస్తరించాయి. వాటర్ క్యాన్‌కు రూ.20 నుంచి రూ.30 వరకు వసూలు చేస్తున్నారు. వాస్తవంగా 20 లీటర్ల నీరు శుద్ధి చేయడానికి రూ.2 నుంచి రూ.3 మాత్రమే ఖర్చవుతుంది. ఈ క్రమంలో ఖర్చు తక్కువ.. ఆదాయం ఎక్కువగా ఉన్న ఈ వ్యాపారం వైపు మొగ్గుచూపుతున్నారు. కొన్ని ప్లాంట్లలో క్యాన్లు శుద్ధి చేయకుండానే సాధారణ నీటిని నింపి సరఫరా చేస్తున్నారు. కాలం చెల్లిన క్యాన్లు ఉపయోగించడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. నిబంధనలు ఇవే.. ►వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు మున్సిపాలిటీ, గ్రామపంచాయతీ అనుమతి తీసుకోవాలి. ► పరిశ్రమల శాఖ నుంచి పార్టు–1 లైసెన్సు పొందాలి. ► బీఎస్ఐ అనుమతి ఉండాలి. ఐఎస్ఐ నిబంధనలు పాటించాలి. ► ప్లాంట్‌లో మైక్రోబయాలజీ, కెమిస్ట్రీ సిబ్బంది తప్పనిసరిగా ఉండాలి. ► పీహెచ్ స్థాయి 7 కంటే తగ్గకుండా చూడాలి. తగ్గితే ఆ నీరు తాగిన వారికి కిడ్నీ సంబంధిత సమస్యలు వస్తాయి. ► నీటిని క్యాన్లలో నింపేవారు చేతులకు తొడుగులు ధరించాలి. ► ప్లాంట్‌లో ప్రయోగశాలతో పాటు ఆవరణ పరిశుభ్రంగా ఉండాలి. ► క్యాన్లు పరిశుభ్రంగా ఉండాలి. ప్రతిరోజు పొటాషియం పర్మాంగనేట్‌తో కెమికల్ క్లీనింగ్ చేయాలి. ► ప్రతి క్యాన్‌పై శుద్ధి చేసిన తేదీ, బ్యాచ్ నంబర్ ఉండాలి. ► మినరల్ వాటర్‌ను క్యానులో పట్టే ముందు అల్ట్రా వైరస్ రేస్‌తో శుద్ధి చేయాలి. నీటిని క్యాన్‌లోకి పట్టిన తర్వాత రెండు రోజుల పాటు భద్రపరిచి, మార్కెట్లోకి పంపాలి. ► శుద్ధి చేసిన నీటిని 304 గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్‌తో తయారు చేసిన పెద్ద ట్యాంకులో నింపి ఓజోనైజేషన్ చేయాలి. ► ప్రతి మూడు నెలలకోసారి రా వాటర్ టెస్టింగ్ జరపాలి. ప్లాస్టిక్ బాటిల్స్, ప్యాకెట్లలో నిర్ణీత మైక్రోన్స్ ఉండాలి. తనిఖీ నిర్వహిస్తాం అనుమతి లేకుండా కొనసాగిస్తున్న వాటర్ప్లాంట్లలో తనిఖీలు నిర్వహిస్తాం. ఫుడ్ ఇన్స్పెక్టర్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుంటాం. కనీస ప్రమాణాలు పాటించని వాటర్ ప్లాంట్లపై చర్యలు తీసుకుంటాం. అనుమతులు లేని వాటిని మూసివేయిస్తాం. – జాడి రాజేశ్వర్, ఆర్డీఓ, ఆదిలాబాద్ అనారోగ్య సమస్యలు.. ప్యూరిఫైడ్ పేరిట రక్షితం కాని నీటిని తాగితే అనారోగ్య సమస్యలు వస్తాయి. ప్యూరిఫైడ్ ప్లాంట్లలో క్యాన్లు నింపే సమయంలో వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. లవణాలు మోతాదులో ఉండే నీటిని నింపాలి. రోజుల తరబడి క్యాన్లను శుభ్రం చేయకుంటే కిడ్నీ సంబంధిత వ్యాధులు వస్తాయి. డయేరియా, వాంతులు, విరోచనాలు, టైఫాయిడ్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. క్లోరినేషన్ సరిగా చేయకుండా నీటిని నింపితే ప్రమాదకరం. – క్రాంతికుమార్, ఎండీ, ఫిజీషియన్, రిమ్స్ -
ట్రాఫిక్ పోలీసుల తీరు.. ఏపీ వాహనం ఆపాల్సిందే
సాక్షి,బళ్లారి: డ్రైవర్ లైసెన్స్, ఇన్సూరెన్స్ సక్రమంగా ఉన్నాయా లేదా, వాహన డ్రైవర్లు రోడ్డు నియమాలు పాటిస్తున్నారా లేదా అన్న దానిపై నిత్యం ట్రాఫిక్ పోలీసులు నిఘా ఉంచి, నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడుపుతున్న వారిపై చర్యలు తీసుకోవడం, అపరాధ రుసుం వసూలు చేయడం పరిపాటి. అయితే అన్ని సక్రమంగా ఉన్నప్పటికి బళ్లారిలో కొందరు ట్రాఫిక్ పోలీసులు ఏదో ఒక తప్పు చూపి వాహనాలు నడిపే వారితో డబ్బులు గుంజుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ సంబంధించిన వాహనాలు కనబడితే మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. (చదవండి: సంచలనాత్మక నిర్ణయం తీసుకున్న కేజ్రీవాల్...పంజాబ్ ఆప్ ఎమ్మెల్యేలకు హెచ్చరికలు ) ఏపీ నుంచి బళ్లారికి వచ్చే వాహనాలను ఆపడంతో ఎంతో కొంత డబ్బులు తీసుకుని వాహనాలు వదులుతున్నారని, డ్రైవర్లు, వాహన యజమానుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బళ్లారికి అనంతపురం, కర్నూలు జిల్లాల నుంచి ప్రతి నిత్యం పెద్ద సంఖ్యలో వచ్చి పోతుంటారు. బళ్లారి ఏపీఎంసీ మార్కెట్లో పండ్లు, కూరగాయాలు, ఆహార ధాన్యాలు అమ్మకాల సాగించేందుకు ఇక్కడికి వాహనాల్లో వస్తుంటారు. రైతులు తీసుకుని వచ్చిన వాహనాలను సైతం అన్ని రకాలు సక్రమంగా ఉన్నప్పటికి తనిఖీలు చేస్తూ డబ్బులు తీసుకుంటున్నారని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. ఇక నగరంలోని ప్రధాన రహదాల్లో ఏపీ వాహనాలు కనబడితే చాలు ఆపి ఏదో రకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. అధికారులు ఈ విషయంపై దృష్టి సారించాలని వాహనదారులు కోరుతున్నారు. -
పార్లమెంట్లో కరోనా నిబంధనల ఉల్లంఘన
సాక్షాత్తూ పార్లమెంట్ సాక్షిగా ఎంపీలు కరోనా నిబంధనలను ఉల్లంఘించారు. సామాజిక దూరం అనే మాటే మర్చిపోయారు. ఒక పార్టీ అని కాదు, అన్ని పార్టీల ఎంపీలదీ అదే తీరు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా సోమవారం సెంట్రల్ హాల్లో ఉభయసభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగించారు. ఈ క్రమంలో మొదటి రెండు వరుసల్లో ఆసీనులైన ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గేతోపాటు పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు మాత్రమే సామాజిక దూరం పాటించారు. మూడో వరుస నుంచి కూర్చున్న ఎంపీలు కోవిడ్–19 ప్రొటోకాల్‌ను లెక్కచేయలేదు. వీరిలో కొందరు కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు. కొన్ని బెంచీల్లో ఐదుగురు మాత్రమే కూర్చోవాల్సి ఉండగా, ఏడుగురు కనిపించారు. ఇక చాలామంది ఎంపీలు మాస్కులు కూడా కిందకు దించేశారు. మాస్కులు సక్రమంగా ధరించకుండానే ఒకరితో ఒకరు మాటల్లో మునిగిపోయారు. కరోనా కేసుల ఉధృతి దృష్ట్యా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను రెండు షిఫ్టుల్లో నిర్వహించనున్నారు. ఉదయం రాజ్యసభ, సా యంత్రం లోక్‌సభ సమావేశాలు జరుగుతాయి. (చదవండి: Nirmala Sitharaman Budget 2022 Speech) -
అర్ధరాత్రి పార్టీ.. మద్యం మత్తులో చిందులు.. నటులపై కేసు
సాక్షి, బెంగళూరు: నగరంలోని కెంగేరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ రిసార్టులో ఈ నెల 27వ తేదీ అర్ధరాత్రి నైట్ కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించి పార్టీ చేసుకుంటున్న టీవీ నటులపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీరియళ్లలో నటించే రక్షిత్–అనూషా దంపతులు, ఇతరులు అభిషేక్, రంజన్, రాకేశ్, రవిచంద్రన్‌లు అర్ధరాత్రి 1.30 సమయంలో మద్యం మత్తులో చిందులేస్తుండగా పోలీసులు వెళ్లి అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. చదవండి: (భార్య మృతితో భర్త ఆత్మహత్య) -
హైదరాబాద్‌లో ఆటోవాలాల ఆగడాలు.. ఏ మాత్రం తగ్గట్లేదు!
Hyderabad Auto Drivers: ఆటోవాలాలు ఇష్టానుసారంగా వాహనాలు నడుపుతూ ప్రయాణికులను ఇబ్బందులుకు గురిచేస్తున్నారు. ముఖ్యంగా దూలపల్లి రోడ్డులో వీరి ఆగడాలు ఎక్కువయ్యాయి. డ్రైవర్ పక్కన ఇద్దరు, వెనకాల ఆరుగురు ఇలా మొత్తం 8 మందిని నింపుకుని అతి ప్రమాదకరంగా ప్రయాణం కొనసాగిస్తున్నారు. అసలే ఇరుకైన రోడ్డు.. ఆపై గుంతలుగా ఉన్నా.. వేగాన్ని మాత్రం తగ్గించకుండా వెళ్తున్నారు. కేవలం నలుగురు మాత్రమే ఎక్కాల్సిన ఆటోలో ఇలా 8 మందిని ఎక్కించుకుంటూ కొందరు ఆటోవాలాలు నిబంధనలను తుంగలో తొక్కుతూ ప్రయాణాలు సాగిస్తున్నారు. అయితే ఇక్కడ ట్రాఫిక్ విధులు నిర్వహించే సిబ్బంది కేవలం ఫోటోలకే పరిమితమవుతూ అధిక లోడుతో వెళ్తున్న వారిని కట్టడి చేయడంలో విఫలం అవుతున్నారు. దూలపల్లి నుంచి కొంపల్లి వరకు ప్రత్యేకంగా దృష్టి సారించి ఆటోవాలాలను కట్టడి చేయాలని స్థానికులు కోరుతున్నారు. చదవండి: Ranga Reddy: చిత్తు కాగితాలు కాదండి.. విద్యార్థుల సర్టిఫికెట్లు -
అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన
ఒంగోలు: అమరావతి పరిరక్షణ పేరుతో నిర్వహిస్తున్న రైతుల మహాపాదయాత్రలో అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన జరుగుతోందని ప్రకాశం జిల్లా ఎస్పీ మలికాగర్గ్ చెప్పారు. ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం రాత్రి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. నాగులుప్పలపాడు మండలం చదలవాడలో గురువారం ఉదయం 11.30 గంటల సమయంలో మహాపాదయాత్ర బృందానికి వ్యతిరేకదిశలో 250 నుంచి 300 మంది రాజకీయ నాయకులు దూసుకొచ్చారని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమలులో ఉన్నా పట్టించుకోకుండా పాదయాత్రకు అనుకూలంగా నినాదాలు చేస్తూ వ్యతిరేక దిశలో వచ్చారని తెలిపారు. అడ్డుకోబోయిన పోలీసులపై కర్రలతో దౌర్జన్యం చేస్తూ ముందుకు సాగారని, ఒక పోలీసు అధికారి చేతిలోని మ్యాన్‌పాక్‌ను లాక్కునే ప్రయత్నం చేశారని చెప్పారు. ఈ ఘటనల వీడియోను ప్రదర్శించారు. తమ సిబ్బంది వారిని అదుపుచేసేందుకు యత్నించారే తప్ప ఎక్కడా దురుసుగా ప్రవర్తించలేదని ఎస్పీ స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజా కూడా ఈ గుంపులో వచ్చినట్లు గుర్తించామన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున రాజకీయ పార్టీలు అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించరాదని చెప్పారు. హైకోర్టు ఉత్తర్వులను అమలుచేయడం బాధ్యతగా భావిస్తూ పాదయాత్ర బృందానికి భద్రత కల్పిస్తున్నామన్నారు. నాలుగు వాహనాలకు, 157 మంది మాత్రమే పాల్గొనేందుకు అనుమతి ఉండగా వందల వాహనాలు వస్తున్నాయని, అనుమతికి మించి 15 రెట్లకుపైగా జనం పోగవుతున్నారని, పరిమితికి మించి మైక్‌లు వినియోగిస్తున్నారని, కోవిడ్ నిబంధనలు నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తుండటంతో చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. పాదయాత్ర సజావుగా, ప్రశాంతంగా జరిగేందుకు తమశాఖ అన్ని చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించకుండా హైకోర్టు ఆదేశాలు, డీజీపీ షరతులకు లోబడి అనుమతి పొందిన 157 మంది మాత్రమే పాదయాత్రలో పాల్గొనాలని సూచించారు. నాగరాజు అనే వ్యక్తి గాయపడినట్లు ప్రచారం జరిగిందని, అతడికి ఎటువంటి గాయాలు లేవని చెప్పారు. భద్రత కల్పించడం కోసమే ట్రాఫిక్‌ను సైతం క్రమబద్ధీకరిస్తున్నామని, పెద్ద ఎత్తున జనం రావడం వల్ల పాదయాత్రలో ఉన్నవారి భద్రతకు ఇబ్బందులు తలెత్తుతాయని పేర్కొన్నారు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలని ఎస్పీ కోరారు. ఈ సమావేశంలో ఒంగోలు టౌన్ డీఎస్పీ ఉప్పుటూరి నాగరాజు పాల్గొన్నారు. -
బ్రాండింగ్ నిబంధనలను కాలరాస్తున్న అదానీ గ్రూప్స్..!
ముంబై: గౌతమ్ అదానీకు చెందిన అదానీ గ్రూప్స్ ఎయిర్పోర్ట్ నిర్వహణ రంగంలో దూసుకుపోతున్నాయి. దేశ వ్యాప్తంగా సుమారు ఎనిమిది ఇంటర్నేషనల్, రిజనల్ ఎయిర్‌పోర్ట్‌ల నిర్వహణ చేస్తున్నాయి. కొన్ని రోజుల క్రితమే ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ను జీవీకే నుంచి కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా విమానాశ్రయ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) ఏర్పాటు చేసిన మూడు కమిటీలు అదానీ గ్రూప్స్ నిర్వహిస్తోన్న అహ్మదాబాద్, మంగుళూరు, లక్నో విమానాశ్రయాల్లో రాయితీ ఒప్పందాలలో ఏఏఐ సూచించిన బ్రాండింగ్ నిబంధనలను ఉల్లఘిస్తున్నట్లు కనుగొంది. దీంతో అదానీ గ్రూప్స్ ఆయా ఎయిర్‌పోర్ట్‌ల్లో బ్రాండింగ్, డిస్ప్లే బోర్డులను మారుస్తోన్నట్లు తెలుస్తోంది. మూడు విమానాశ్రయాల నిర్వహణ కోసం 2019 ఫిబ్రవరిలో అదానీ గ్రూప్ బిడ్లను గెలుచుకుంది. ఎయిర్‌పోర్టుల నిర్వహణ కోసం ఫిబ్రవరి 2020లో ఏఏఐతో అదానీ గ్రూప్స్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. నవంబర్ 2020 నుంచి ఎయిర్‌పోర్టుల నిర్వహణను అదానీ గ్రూప్స్ తీసుకున్నాయి. తాజాగా ఏఏఐ నిర్వహించిన తనిఖీల్లో అదానీ గ్రూప్స్ ఆయా ఎయిర్‌పోర్టులో బ్రాండింగ్ నిబంధనలను కాలరాస్తున్నట్లు గుర్తించారు. హోర్డింగ్స్ డిస్ప్లే విషయాల్లో ఏఏఊ సూచనలను అదానీ గ్రూప్స్ ఉల్లంఘించినట్లు గుర్తించారు. ఏఏఐ లోగోలను డిస్ప్లే చేయడంలో అదానీ గ్రూప్స్ నిబంధనల ప్రకారం ప్రదర్శించలేదు. కాగా ఈ విషయంపై స్పందించిన అదానీ గ్రూప్స్..ఆయా విమానాశ్రయాల్లో నిబంధనలను అనుగుణంగా డిస్ప్లే బోర్డులను వేస్తామని ఒక ప్రకటనలో తెలిపింది. -
మంత్రి గారు మాస్క్ ముఖానికి పెట్టుకోవాలి, అక్కడ కాదు..!
డెహ్రాడూన్: కరోనా మూడో దశ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలంటూ ఆరోగ్య నిపుణులు పదే పదే హెచ్చరిస్తున్నారు. కానీ, చాలా మంది ఆ మాటలను పెడచెవిన పెట్టి మాస్క్‌ల వాడకానికి మంగళం పాడుతున్నారు. సాధారణ ప్రజల పరిస్థితి ఇలా ఉంటే.. పదిమందికీ చెప్పాల్సిన మంత్రులు మరింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కరోనా వ్యాప్తికి కారకులవుతున్నారు. ఉత్తరాఖండ్‌కు చెందిన ఓ మంత్రి అయితే మాస్క్‌ను ముఖానికి కాకుంగా కాలి బొటన వేలికి తగిలించి ఓ ముఖ్యమైన భేటీలో దర్శనమిచ్చారు. సదరు మంత్రి గారి నిర్వాకానికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరాఖండ్‌లో బీజేపీకి చెందిన ఐదుగురు నేతలు ఓ సమావేశంలో పాల్గొన్నారు. అందులో ముగ్గురు రాష్ట్ర మంత్రులు కూడా ఉన్నారు. అయితే వీరిలో ఏ ఒక్కరికీ మాస్క్‌లు లేవు. వీరిలో యతీశ్వరానంద్ అనే మంత్రి అయితే మాస్క్‌ను ఏకంగా కాలి బొటన వేలికి తగిలించి సమావేశంలో పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఫొటోను ఉత్తరాఖండ్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి గరిమా దాసౌని ట్విటర్లో పోస్టు చేశారు. ''ఇదీ అధికార భాజపా మంత్రుల పరిస్థితి. వీరంతా మాస్క్‌లు పెట్టుకోని వారిని శిక్షించమని చెబుతారు'' అంటూ విమర్శించారు. మాస్క్ పెట్టుకోవడానికి ఏది సరైన చోటో ఉత్తరాఖండ్ మంత్రిని అడిగి తెలుసుకోండి అంటూ ఆప్ నేత దీప్ ప్రకాశ్ పంత్ కామెంట్ చేశారు. దీనిపై ప్రస్తుతం విపక్షాల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ప్రెస్‌మీట్ పేరుతో సభ.. టీడీపీ నేతల అరెస్ట్
రౌతులపూడి: నిబంధనలను ఉల్లంఘించి ప్రెస్‌మీట్ పేరిట సభ నిర్వహించేందుకు యత్నించిన టీడీపీ నాయకులను తూర్పు గోదావరి జిల్లా రౌతులపూడి పోలీసులు శుక్రవారం అడ్డుకున్నారు. విశాఖ జిల్లా నాతవరం మండలం, సుందరకోట శివారు బమిడికలొద్దులో చేపట్టిన బాక్సైట్ తవ్వకాలు నిలిపివేయాలంటూ మాజీ మంత్రులు చినరాజప్ప, అయ్యన్నపాత్రుడు తదితరులు గిరిజన ప్రాంతాలైన జల్దాం, చల్లూరు, దబ్బాదిలో పర్యటించారు. తర్వాత వీరు రౌతులపూడి చేరుకున్నారు. ప్రెస్‌మీట్ పేరుతో సభ నిర్వహించేందుకు ప్రయత్నించారు. కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వీరిని పోలీసులు అడ్డుకున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం వరకు టీడీపీ నేతలతో పోలీసులు చర్చించినా వినలేదు. దీంతో చినరాజప్ప, అయ్యన్నపాత్రుడు, నక్కా ఆనందబాబు, ప్రత్తిపాడు టీడీపీ ఇన్చార్జ్ వరుపుల రాజా, ఎమ్మెల్సీ సంధ్యారాణి, మాజీ ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, వంగలపూడి అనిత, వంతల రాజేశ్వరి, బి.రామానాయడు, శ్రావణ్‌కుమార్, కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌కుమార్, తదితరులను పోలీసులు అరెస్టు చేసి కోటనందూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసిన అనంతరం విడుదల చేశారు. -
Private Schools: కాసులిస్తేనే క్లాస్.. లేకుంటే ఆన్లైన్ లింక్‌లు కట్..
కరీంనగర్ పట్టణం బ్యాంక్‌కాలనీకి చెందిన ఓ వ్యక్తి సమీపంలోని ఓ పేరున్న పాఠశాలలో అతడి కొడుకును 9వ తరగతి చదివిస్తున్నాడు. కోవిడ్ నేపథ్యంలో ఇంట్లోనే ఆన్లైన్ క్లాసులు వింటున్నా డు. ఈక్రమంలో అబ్బాయి ఫీజు చెల్లించాలంటూ సదరు వ్యక్తిని పాఠశాల యాజమాన్యం వారం రోజులుగా ఫోన్ చేస్తూ ఒత్తిడి తెస్తోంది. లేకుంటే ఆన్లైన్ కనెక్షన్ కట్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే రూ.15 వేలు చెల్లించగా, అవి పాత బకాయి కింద జమ చేసుకున్నట్లు సదరు పాఠశాల యాజమాన్యం చెప్పిందని ఆ విద్యార్థి తండ్రి ‘సాక్షి’కి తెలిపాడు. వారం రోజుల పాటు ఆన్లైన్ తరగతులు వినేలా లింక్ ఇచ్చారని, ఆ తర్వాత కట్ చేస్తామని చెప్పారని వాపోయాడు. ఫీజు తర్వాత కడుతామని చెప్పినా వినడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇదే పాఠశాలలో పదో తరగతి చదువుతున్న మరో విద్యార్థి తండ్రిని కూడా ఫీజు చెల్లించాల ని వేధిస్తున్నట్లు బాధితుడు తెలిపాడు. ఇప్పటికే ఇద్దరు పిల్లలకు ఒక్కొక్కరికీ రూ.15 వేల చొప్పున చెల్లించా నని మరో రూ.15 వేలు చెల్లించాలని పాఠశాల నిర్వాహకులు తరచూ ఫోన్ చేయడంతో పిల్లల ఒత్తిడి తట్టుకోలేక అవి కూడా ఇటీవలే చెల్లించానని వాపోయాడు. అయితే మొదట చెల్లించిన రూ.15 వేలు పుస్తకాలు, ఇతర ఖర్చుల కింద పాఠశాల యాజమాన్యం చూపిస్తోందని, అంతే కాకుండా ఆన్లైన్ తరగతులు వినేందుకు ప్రత్యేకంగా రూ.1,250 చెల్లించాలనే నిబంధన పెట్టినట్లు ఆ విద్యార్థి తండ్రి చెప్పాడు. సాక్షి, కరీంనగర్: కరీంనగర్ పట్టణంలోని కొన్ని ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. కోవిడ్ నేపథ్యంలో పేరున్న పాఠశాలలు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తూ అందినకాడికి దండుకుంటున్నాయి. నగరంలోని మంకమ్మతోట, వావిలాలపల్లి, భగత్‌నగర్, గణేశ్‌నగర్ తదితర కాలనీల్లో ఉన్న కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు ధనార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తున్నాయి. అయితే సాధారణ రోజుల్లో కంటే ప్రస్తుతం ఈ విద్యాసంస్థలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయి. “ఫీజు చెల్లిస్తారా.. లేదంటే ఆన్లైన్ తరగతుల లింక్ కట్ చేయమంటారా’.. అంటూ విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు చేసి హెచ్చరిస్తున్నాయి. చెప్పిన చోటే పుస్తకాలు కొనాలి కొన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు తాము చెప్పిన చోటే పుస్తకాలు కొనాలని విద్యార్థుల తల్లిదండ్రులకు సూచిస్తున్నాయి. వారికి కమీషన్ ఇచ్చే దుకా ణాల్లో మాత్రమే స్టడీ మెటీరియల్ కొనాలని షరతులు విధించడం లేదంటే పాఠశాలలోనే బిల్లు చెల్లించాలని కరాఖండిగా చెబుతున్నాయి. ఇంత జరుగుతున్నా విద్యాశాఖ అధికారులు మాత్రం చర్యలు తీ సుకోవడం లేదు. కనీసం పాఠశాలలను తనిఖీ చే యడం లేదు. ఆన్లైన్ తరగతుల నిర్వహణ ఎలా జరుగుతుందనే దానిపై కూడా దృష్టిసారించడం లేదు. జబర్దస్త్‌గా ఫీజు వసూలు అసలే కరోనా సమయం.. ఇంట్లో నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితులు.. అయినా కొన్ని విద్యాసంస్థలు మాత్రం ఫీజులు చెల్లించాల్సిందేనని హుకుం జారీ చేస్తున్నాయి. ఫీజు కడితేనే ఆన్లైన్ క్లాసులకు అనుమతిస్తున్నారు. ఈనేపథ్యంలో పోటీ పరీక్షలకు సిద్ధం కావాలనే ఆలోచనతో విద్యార్థులు, తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చి ఫీజులు కట్టిస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఫీజులు పెంచకూడదని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలల్లో ఈ దందా జోరుగా సాగుతోంది. గత నెలరోజుల నుంచి ఫీజుల వసూళ్లపై దృష్టి సారించారు. మెస్సెజ్‌లు పెడుతూ, నేరుగా ఫోన్లో మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులపై తీవ్ర ఒత్తిడి పెంచుతున్నారు. ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు కరోనా నేపథ్యంలో విద్యార్థుల నుంచి ఎలాంటి ఫీజులు వసూలు చేయవద్దని, కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే తీసుకోవాలని ప్రభుత్వం సూచించిన నిబంధనలు బేఖాతరు అవుతున్నాయి. జీవో నం.46 ప్రకారం పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి ట్యూషన్ ఫీజు తప్ప ఎలాంటి ఫీజులు తీసుకోవద్దని ఆదేశాలు ఉన్నా ప్రైవేట్ పాఠశాలల నిర్వాహకులు అమలు చేయడం లేదు. ఆన్లైన్ క్లాసుల పేరిట దోపిడీకి పాల్పడుతున్న ప్రైవేట్ పాఠశాలలపై విద్యాశాఖ అధికారులు దృష్టిసారించాలి. లేకుంటే ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాల్సి వస్తుంది. – జూపాక శ్రీనివాస్,పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు జీవో ప్రకారం వసూలు చేయాలి జీవో నం.46 ప్రకారం ప్రైవేట్ విద్యాసంస్థలు ప్రతీనెల ట్యూషన్ ఫీజులను మాత్రమే వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు. అధిక ఫీజుల విషయంపై తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు వస్తే దృష్టిసారిస్తాం. – జనార్దన్‌రావు, డీఈవో చదవండి: వారికి ఒక్కో కుటుంబానికి 10 లక్షలు.. నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి -
కరోనా రూల్స్ బ్రేక్ చేసిన కివీస్ ఆటగాళ్లు.. ఆందోళనలో టీమిండియా
సౌతాంప్టన్: మరి కొద్ది గంటల్లో(జూన్ 18న) భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ 2021ప్రారంభం కానుండగా, కొందరు కివీస్ ఆటగాళ్లు కరోనా నిబంధనలను అతిక్రమంచి గోల్ఫ్ ఆడేందుకు వెళ్లారని ప్రముఖ క్రీడా వెబ్సైట్ క్రిక్ బజ్ పేర్కొంది. న్యూజిలాండ్ ఆటగాళ్లు ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథీ, హెన్రీ నికోల్స్, మిచెల్ సాంట్నర్, డారిల్ మిచెల్, ఫిజియో టామీ సిమ్సెక్ ఈ ఉదయం బయో బబుల్‌ను దాటి బయటకు వెళ్లారని సదరు వెబ్సైట్ వెల్లడించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో న్యూజిలాండ్ ఆటగాళ్లు బయో బబుల్‌ను వీడి బయటకు వెళ్లిరావడం పట్ల భారత జట్టు యాజమాన్యం ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఇది కచ్చితంగా బయో బబుల్ ప్రోటోకాల్‌ను ఉల్లంఘించినట్టేనని టీమిండియా మేనేజ్మెంట్ వాదిస్తోంది. ఈ విషయంపై ఐసీసీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపింది. అయితే దీనిపై న్యూజిలాండ్ వాదన మాత్రం వేరేలా ఉంది. హోటల్, గోల్ఫ్ కోర్సు ఒకే ప్రాంగణంలో ఉన్నందున తమ ఆటగాళ్లు గోల్ఫ్ ఆడేందుకు వెళ్లారని, ఇది బయో బబుల్ ప్రోటోకాల్‌ను ఉల్లంఘించినట్లు కాదని ఆ జట్టు మేనేజ్మెంట్ వాదిస్తోంది. ఇదిలా ఉంటే, ఐసీసీ నిబంధనల ప్రకారం భారత్, న్యూజిలాండ్ జట్లు మంగళవారం 15 మంది సభ్యుల జట్టును ప్రకటించాయి. రెండు జట్ల ఆటగాళ్లు సౌతాంప్టన్‌లోని ఒకే హోటల్లో బస చేస్తున్నారు. న్యూజిలాండ్ జట్టు: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), టామ్ బ్లండెల్, ట్రెంట్ బౌల్ట్, డెవాన్ కాన్వే, కోలిన్ గ్రాండ్‌హోమ్, మాట్ హెన్రీ, కైల్ జేమీసన్, టామ్ లాథమ్, హెన్రీ నికోల్స్, అజాజ్ పటేల్, టిమ్ సౌథీ, రాస్ టేలర్, నీల్ వాగ్నర్, బీజే వాట్లింగ్, విల్ యంగ్. చదవండి: WTC Final: చారిత్రక మ్యాచ్‌కు వరుణ గండం..? -
కృష్ణా జిల్లాలో 33 కోవిడ్ ఆస్పత్రుల అనుమతులు రద్దు
కృష్ణా: జిల్లాలో 33 కోవిడ్ ఆస్పత్రుల అనుమతి రద్దు చేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్.. జిల్లా కోవిడ్ నోడల్ అధికారి శివశంకర్ ఆదివారం తెలిపారు. ప్రభుత్వ నిబంధనలు పాటించని ఆస్పత్రుల అనుమతి రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా జిల్లాలో 82 ఆస్పత్రుల్లో కోవిడ్ చికిత్స నిమిత్తం ఆరోగ్యశ్రీ వర్తింపు చేస్తున్నాం. ఇప్పటివరకు జూన్ 3న 20, జూన్ 5న 13 ప్రైవేట్ ఆసుపత్రులు.. మొత్తంగా 33 కోవిడ్ చికిత్స అనుమతులు రద్దు చేశామని తెలిపారు. -
మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రపై కేసు నమోదు
సాక్షి, విజయవాడ: మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రపై ఆదివారం పటమట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కోవిడ్ నిబంధనలు ఉల్లఘించి హోటల్లో మీటింగ్ పెట్టారని తెలియడంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. కాగా ఈ ఏడాది ఏప్రిల్ నెలలో టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సంగం డెయిరీకి సంబంధించి అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై ధూళిపాళ్లను రెండు నెలల క్రితం ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. సంగం డెయిరీ ఛైర్మన్‌గా ధూళిపాళ్ల నరేంద్ర ఉన్న సమయంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో ఆయన్ను ఏసీబీ అరెస్ట్ చేసింది. -
పటిష్టంగా లాక్డౌన్.. 5,614 వాహనాలు సీజ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో లాక్డౌన్ పటిష్టంగా అమలవుతుంది. లాక్డౌన్ నిబంధనలు పాటించనివారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేస్తున్న పోలీసులు మూడు రోజుల్లోనే 5,614 వాహనాలను సీజ్ చేశారు. కాగా ఇవాళ ఒక్కరోజే దాదాపు రెండు వేల వాహనాలు సీజ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. రాష్ట్రంలో మే 12 నుంచి లాక్డౌన్ అమల్లో ఉండగా.. ఇప్పటికవరకు 30 వేల కేసులు నమోదు చేసినట్లు స్పష్టం చేశారు. కాగా రాచకొండ కమిషనరేట్ పరిధిలో 46 చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు పోలీస్ అధికారులు స్పష్టం చేశారు. కాగా రాష్ట్రంలో లాక్డౌన్ మే 30 వరకు అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. లాక్డౌన్ నిబంధనలు ఉల్లఘించి అనవసరంగా రోడ్ల మీదకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీలు అంజనీ కుమార్, సజ్జనార్‌లు హెచ్చరించారు. కాగా తెలంగాణలో వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 3308 కరోనా కేసులు నమోదయ్యాయి. కోవిడ్ బాధితుల్లో 21 మంది మరణించారు. గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 4723 మంది డిశ్చార్జ్ కాగా.. ఇప్పటివరకు మొత్తం 5,04,970 మంది డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణలో ప్రస్తుతం 42,959 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో కరోనాతో ఇప్పటివరకు 3106 మంది మృతి చెందారు. చదవండి: కనిపించని శత్రువుతో సమష్టి యుద్ధం -
రోగుల ప్రాణాలతో మందులోళ్ల చెలగాటం..
సాక్షి, హైదరాబాద్: కొన్ని ఔషధ కంపెనీలు, మందుల దుకాణాలు, బ్లడ్ బ్యాంకులు నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయి. రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. సరైన పర్యవేక్షణ లేకపోవడంతో మెడికల్ షాపుల్లో గడువు తీరిన, నాసిరకం మందుల అమ్మకంతో రోగులకు ముప్పు పొంచి ఉంటోంది. ఔషధ నియంత్రణశాఖ పరిధిలో జరిగే ఉల్లంఘనల్లో దాదాపు 75% మెడికల్ షాపుల్లో జరిగేవేనని అధికారులు అంటున్నారు. ప్రధానంగా రిఫ్రిజిరేటర్లో ఉంచాల్సిన ఔషధాలను వేడి వాతావరణంలో పెట్టడం, సాధారణ మెడికల్ షాపు ల్లోనూ పశువుల మందులు విక్రయించడం, ఫార్మ సిస్ట్ లేకపోవడం, ప్రిస్క్రిప్షన్ లేకుండానే అమ్మడం, ఒక బ్రాండ్‌కు బదులు మరో బ్రాండ్ మందులు అంటగట్టడం, నిర్ణీత ధర కంటే ఎక్కువకు అమ్మడం, రికార్డుల నిర్వహణ సరిగా లేకపోవడం వంటి ఉల్లంఘనలు జరిగినట్లు సర్కారు గుర్తించింది. అలాగే కొన్ని ఔషధ కంపెనీలు కూడా నాణ్యతలేని ముడి సరుకులతో ఔషధాలు తయారు చేస్తున్నాయని తేలింది. అంతేగాక లేబిలింగ్ సరిగా ఉండకపోవడం, తక్కువధర ఉండాల్సిన వాటికి ఎక్కువ ధర నిర్ణయించడం తదితర ఉల్లంఘనలు జరిగాయి. మరోవైపు బ్లడ్‌బ్యాంకుల్లోనూ విపరీతంగా ఉల్లంఘనలు జరిగాయి. 2 నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రతలో రక్తాన్ని నిల్వ ఉంచకపోవడం, నిర్దేశిత టెస్టుల్లో కొన్ని చేయకపోవడం జరుగుతోంది. తద్వారా సేకరించిన రక్తంలో ఏవైనా ఇన్ఫెక్షన్లు ఉంటే స్వీకరించే రోగులకు అంటుకునే ప్రమాదం ఉంటుంది. అలాగే మెడికల్ ఆఫీసర్ లేకుండానే టెక్నీషియన్లతో బ్లడ్ బ్యాంకును నడిపించడం వంటి ఉల్లంఘనలు జరిగాయి. ప్లాస్మా, రెడ్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్ వంటి వాటికి ప్రత్యేక లైసెన్సు లేకుండా నడపడం తీవ్రమైన ఉల్లంఘనగా అధికారులు చెబుతున్నారు. 21,087 ఉల్లంఘనల్లో 18 వేలు మెడికల్ షాపుల్లోనే.. మందుల దుకాణాలు, ఫార్మసీ కంపెనీలు, బ్లడ్ బ్యాంకులు, స్టోరేజీ సెంటర్లలో గత ఐదేళ్లలో ఏకంగా 21,087 ఉల్లంఘనలు జరిగినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అసెంబ్లీకి సమర్పించిన నివేదిక వెల్లడించింది. 2016–17 నుంచి 2020–21 జనవరి వరకు ఈ ఐదేళ్లలో ఫార్మసీ కంపెనీలు, మందుల దుకాణాలు, బ్లడ్‌బ్యాంకులు, స్టోరేజీ సెంటర్లలో 87,700 తనిఖీలు నిర్వహించారు. వీటిల్లో 21,087 ఉల్లంఘనలను గుర్తించారు. ఏకంగా 24 శాతం ఉల్లంఘనలు జరగడం విస్మయం కలిగిస్తోంది. గడిచిన ఐదేళ్లలో 12,801 శాంపిళ్లను పరీక్షించగా... 1,348 కేసులు ప్రాసిక్యూషన్ వరకు వెళ్లాయి. ఔషధ నియంత్రణ సంస్థలోని కొందరు అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించడం వల్లే యదేచ్ఛగా ఉల్లంఘనలు జరుగుతున్నాయని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అంటున్నారు. ఉల్లంఘనలు జరిగిన వాటిల్లో దాదాపు 18 వేలు మెడికల్ షాపుల్లోనే జరిగినట్లు ఔషధ నియంత్రణశాఖ వర్గాలు చెబుతున్నాయి. (చదవండి: ‘బల్సిందా నీ.. ఊర్కో బే’ బోధన్ ఎమ్మెల్యే బూతు పురాణం) వైద్య ఆరోగ్యశాఖ నివేదికలోని మరికొన్ని అంశాలు.. గతేడాది కరోనా నేపథ్యంలో అనారోగ్యానికి గురైనా చాలామంది ఆసుపత్రులకు రావడానికి జంకారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఔట్ పేషెంట్లు, ఇన్ పేషెంట్ల సంఖ్య బాగా పడిపోయింది. ప్రసవాలు మాత్రం గణనీయంగా పెరిగాయి. ప్రతిష్టాత్మక నిమ్స్ ఆసుపత్రిలో 2019లో ఔట్పేషెంట్లు 6.03 లక్షల మంది కాగా, 2020లో ఆ సంఖ్య ఏకంగా 2.98 లక్షలకు పడిపోయింది. అలాగే 2019లో 47,359 మంది ఇన్న్ పేషెంట్లుగా చికిత్స తీసుకోగా, 2020లో ఆ సంఖ్య 25,931కు పడిపోయింది. ఇక శస్త్రచికిత్సలు 2019లో 24,638 జరగ్గా, 2020లో సగానికికంటే తక్కువగా 11,073కు పడిపోయాయి. 2019లో మూత్రపిండాల మార్పిడి చికిత్సలు 105 జరగ్గా, 2020లో 30కు పడిపోయాయి. మోకాళ్ల మార్పిడి చికిత్సలు 2019లో 173 కాగా, 2020లో 34కు పడిపోయాయి. వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలోని 108 ఆసుపత్రులకు సగటున ఏడాదికి 1.08 కోట్ల మంది ఔట్ పేషెంట్లు వస్తుండగా, 2020–21లో జనవరి వరకు కేవలం 60.52 లక్షల మందే వచ్చారు. ఇన్ పేషెంట్లు 9.55 లక్షలు అంచనా కాగా, ఆ సంఖ్య 6.96 లక్షలకు పడిపోయింది. అయితే కరోనా కాలంలో 108 జిల్లా, ఏరియా ఆసుపత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాలు గణనీయంగా పెరిగాయి. వాటిల్లో సగటున ఏడాదికి 81,600 ప్రసవాలు జరుగుతుండగా, 2020లో ఏకంగా 1,24,278 ప్రసవాలు జరగడం విశేషం. ఆయా ఆసుపత్రుల్లో ల్యాబ్ టెస్ట్‌లు 36.95 లక్షల నుంచి 40.44 లక్షలకు చేరుకోవడం గమనార్హం. సగటు ఏడాదికి జరిగే ఈసీజీలు 63,175 కాగా.. గత ఏడాది ఏకంగా 79,970 జరిగాయి. ఇక తెలంగాణ డయాగ్నస్టిక్‌లలో 2019లో 9.05 లక్షల పరీక్షలు జరగ్గా, 2020లో 7.61 లక్షలకు పడిపోయాయి. 9 ప్రభుత్వ బోధనాసుపత్రులు, 22 స్పెషాలిటీ ఆసుపత్రుల్లో 2019లో 76.83 లక్షల మంది ఔట్ పేషెంట్లు వైద్య సేవలు పొందగా, 2020లో ఆ సంఖ్య సగానికి అంటే 38.25 లక్షలకు పడిపోయింది. ఇన్ పేషెంట్ల సంఖ్య 2019లో 5,91,772 కాగా, 2020లో 3.98 లక్షలకు పడిపోయింది. 2019లో ఈ ఆసుపత్రుల్లో 3.22 లక్షల శస్త్రచికిత్సలు జరగ్గా, 2020లో 1.48 లక్షలు జరిగాయి. ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో 2019–20లో 3.50 లక్షల మంది వైద్య సేవలు పొందగా, 2020–21 మార్చి 10వ తేదీ నాటికి 2.26 లక్షల మంది సేవలు పొందారు. (చదవండి: ఉపాధి పనికి ఆలయ అర్చకుడు ) -
నిబంధనలు పాటించని వారిపై పోలీసుల కొరడా
సాక్షి, విజయవాడ: కోవిడ్ నిబంధనలు పాటించని వారిపై విజయవాడ నగర పోలీసులు కొరడా జులిపిస్తున్నారు. సోమవారం రోజున రామవరప్పాడులో ట్రాఫిక్ ఏడీసీపీ రవిచంద్ర స్పెషల్‌డ్రైవ్ నిర్వహించారు. మాస్కులు లేకుండా తిరుగుతున్న వారికి పోలీసులు జరిమానా విధించి మాస్కులు ఇచ్చారు. ఈ సందర్భంగా ఏడీసీపీ రవిచంద్ర మాట్లాడుతూ.. నెల రోజుల్లో మాస్కులు లేకుండా తిరుగుతున్న 10,805 మందిపై కేసులు నమోదు చేశాము. మొత్తంగా వారికి రూ. 8,83,600 జరిమానా విధించాము. కరోనా కట్టడికి ప్రభుత్వ నిబంధనలను ప్రతిఒక్కరూ పాటించాలి. నిర్లక్ష్యం వహించిన వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తాము' అని రవిచంద్ర పేర్కొన్నారు. (పరిశ్రమలతో పాటు భద్రత ముఖ్యం: సీఎం జగన్) -
క్వారంటైన్‌కు వెళ్లకుండా నేరుగా డ్యూటీకి!
సాక్షి, నిజామాబాద్/భిక్కనూరు: కరోనా పాజిటివ్ వచ్చిన వారి ప్రైమరీ కాంట్రాక్టు వ్యక్తుల్లో కరోనా లక్షణాలు కనిపించకున్న హోంక్వారంటైన్లో ఉండాలని సూచించే వైద్య సిబ్బందే నిబంధనలను ఉల్లంఘించారు. క్యారంటైన్‌కు వెళ్లకుండా వైద్య సిబ్బంది విధులకు హాజరైయ్యారు. వివరాలు.. భిక్కనూరు ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్న వైద్యురాలికి శుక్రవారం కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో సదరు వైద్యురాలికి సంబందించి 33మంది ప్రైమరీ కాంట్రాక్టు వ్యక్తులను గుర్తించారు. వీరిలో 29 మంది వైద్య సిబ్బంది, ఆసుపత్రిలో పనిచేసేవారు కాగా, మిగతా నలుగురు వైద్య సిబ్బంది సంబదికులుగా ఉన్నారు. వీరందరి నమూనాలను ఈనెల 12న క రోనా పరీక్షలకు పంపిస్తారు. ఈక్రమంలో వీరంద రూ ఫలితాలు వచ్చే వరకు హోం క్వారంటైన్లో ఉండాల్సి ఉంటుంది. (చదవండి: నిర్లక్ష్యంపై బిగుసుకుంటున్న ఉచ్చు!) కానీ, శనివారం యథావిధిగా ఆ సుపత్రిలో పనిచేసే పలువురు సిబ్బంది విధులకు వచ్చారు. ఇలా విధులకు రావడం కొవిడ్ నిబందనల కు విరుద్దమని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సుపత్రిలో పనిచేసే సిబ్బంది ఇతర ప్రాంతాల్లో ని వాసం ఉంటారని వారు బస్సులో విధులు నిర్వర్తించేందుకు వచ్చారని ఒకవేళ ఈ సిబ్బందిలో ఎవరికైన కరోనా పాజిటివ్ ఉంటే బస్సులో ప్రయాణించిన మిగత ప్రయాణికుల పరిస్థితి ఏమి కావాలని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైద్యశాఖ ఉన్న తాధికారుల ఆదేశాల మేరకే తాము విధలుకు వచ్చా మని సిబ్బంది తెలిపారు. నిబంధనలు పాటించాలని,కరోనా ఫలితాలు వెలువడే వ రకు ప్రైమరీ కాంట్రాక్టు వ్యక్తులు హోంక్వారంటైన్లో ఉండా లని చె ప్పే వైద్య సిబ్బందే ఇలా నిబంధనలు పాటించకుండా విధులకు హాజరవ్వడం మండలంలో చర్చనీయంశమైంది. (కరోనాను జయించినా.. మరణం తప్పలేదు)