సౌత్ ఇండియన్ బ్యాంకుకు భారీ జరిమానా | RBI imposes Rs5 crore penalty on South Indian Bank for flouting rules | Sakshi
Sakshi News home page

సౌత్ ఇండియన్ బ్యాంకుకు భారీ జరిమానా

Published Sat, May 19 2018 9:43 AM | Last Updated on Sat, May 19 2018 9:43 AM

RBI imposes Rs5 crore penalty on South Indian Bank for flouting rules - Sakshi

సాక్షి, ముంబై: రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) సౌత్ ఇండియన్ బ్యాంకుకు భారీ జరిమానా విధించింది. కెవేసీ నిబంధనలు, ఆస్తుల వర్గీకరణ తదితర అంశాల్లో ఆర్‌బీఐ నిబంధనలను ఉల్లఘించిందన్న ఆరోపణలపై  5 కోట్ల రూపాయల జరిమానా విధించింది. ఆస్తుల వర్గీకరణ,  కెవైసీ నిబంధనల ఉల్లంఘన,  ట్రెజరీ కార్యకలాపాలకు సంబంధించిన నిబంధనలను పాటించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ఆర్‌బీఐ శుక్రవారం విడుదల చేసిన  ఒక ప్రకటనలో తెలిపింది. ఐఆర్‌ఏసీ, కేవైసీ, ట్రెజరీ ఫంక్షన్‌కు సంబంధించిన సూత్రాలను సౌత్ ఇండియన్ బ్యాంక్  పట్టించుకోకపోవడంతో, సెక్షన్ 47ఏ1సీ, సెక్షన్ 46ఏఐ కింద ఈ జరిమానా విధించినట్లు ఆర్‌బీఐ స్పష్టం చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement