South Indian Bank
-
సౌత్ ఇండియన్ బ్యాంక్ లాభం అప్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ సంస్థ సౌత్ ఇండియన్ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. జులై–సెపె్టంబర్(క్యూ2)లో నికర లాభం 18 శాతం ఎగసి రూ. 325 కోట్లను తాకింది. ట్రెజరీ, ఫారెక్స్ ఆర్జన రెట్టింపై రూ. 106 కోట్లకు చేరుకోవడం ఇందుకు సహకరించింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 275 కోట్ల లాభం సాధించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 2,485 కోట్ల నుంచి రూ. 2,804 కోట్లకు బలపడింది. వడ్డీ ఆదాయం రూ.2,129 కోట్ల నుంచి రూ. 2,355 కోట్లకు మెరుగుపడింది. నికర వడ్డీ ఆదాయం 9 శాతం వృద్ధితో రూ. 882 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్లు 3.24 శాతంగా నమోదయ్యాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 4.96 శాతం నుంచి 4.4 శాతానికి, నికర ఎన్పీఏలు 1.7 శాతం నుంచి 1.31 శాతానికి దిగివచ్చాయి. ప్రొవిజన్లు రెట్టింపై రూ. 116 కోట్లను తాకాయి. కనీస మూలధన నిష్పత్తి 18.04 శాతాన్ని తాకింది. ఫలితాల నేపథ్యంలో సౌత్ ఇండియన్ బ్యాంక్ షేరు బీఎస్ఈలో 6.5 శాతం జంప్‌చేసి రూ. 25.5 వద్ద ముగిసింది. -
సౌత్ ఇండియన్ బ్యాంక్ ఫలితాల జోరు, 6 శాతం జంప్
సాక్షి,ముంబై: ప్రయివేట్ రంగ సంస్థ సౌత్ ఇండియన్ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో రూ. 223 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 187 కోట్ల నికర నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం 11 శాతం పుంజుకుని రూ. 1,995 కోట్లను అధిగమించింది. నికర వడ్డీ ఆదాయం సైతం రూ. 1,647 కోట్ల నుంచి రూ. 1,740 కోట్లకు బలపడింది. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 6.65 శాతం నుంచి 5.67 శాతానికి తగ్గాయి. నికర ఎన్పీఏలు 3.85 శాతం నుంచి 2.51 శాతానికి మెరుగుపడ్డాయి. మొండి రుణాలు, కంటింజెన్సీలకు కేటాయింపులు 57 శాతం తగ్గి రూ. 179 కోట్లకు పరిమితమయ్యాయి. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో గురువారం 3.4 శాతం ఎగిసింది. శుక్రవారం కూడా ఈ జోరు కంటిన్యూ చేస్తూ ఏకంగా 6 శాతం లాభాలతో కొనసాగుతోంది. -
ఎస్ఐబీకి ఫలితాలు.. గతేడాదితో పోలిస్తే పదింతల లాభాలు!
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ప్రయివేట్ రంగ సంస్థ సౌత్ ఇండియన్ బ్యాంక్(ఎస్ఐబీ) ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం భారీగా దూసుకెళ్లి రూ. 115 కోట్లను అధిగమించింది. గతేడాది(2021–22) క్యూ1లో రూ. 10 కోట్లు మాత్రమే ఆర్జించింది. అయితే గతేడాది క్యూ4లో నమోదైన రూ. 272 కోట్లతో పోలిస్తే లాభం 57 శాతం క్షీణించింది. మొత్తం ఆదాయం రూ. 2,084 కోట్ల నుంచి రూ. 1,868 కోట్లకు వెనకడుగు వేసింది. ఇందుకు వడ్డీ, ఇతర ఆదాయాలు తగ్గడం కారణమైంది. వడ్డీ ఆదాయం స్వల్పంగా తగ్గి రూ. 1,622 కోట్లకు పరిమితంకాగా.. ఇతర ఆదాయం 45 శాతం పడిపోయి రూ. 246 కోట్లకు చేరింది. అయితే స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 8.02 శాతం నుంచి 5.87 శాతానికి తగ్గాయి. నికర ఎన్పీఏలు సైతం 5.05 శాతం నుంచి 2.87 శాతానికి దిగివచ్చాయి. మొత్తం ప్రొవిజన్లు సైతం రూ. 496 కోట్ల నుంచి రూ. 139 కోట్లకు తగ్గాయి. ఫలితాల నేపథ్యంలో సౌత్ ఇండియన్ బ్యాంక్ షేరు బీఎస్ఈలో 0.25 శాతం బలపడి రూ. 7.87 వద్ద ముగిసింది. చదవండి: Stock Market: అమెరికా ఫెడ్ రిజర్వ్ అంచనాలు.. రెండో రోజు అదే తీరు! -
ఐఆర్బీ ఇన్ఫ్రా- సౌత్ బ్యాంక్.. స్పీడ్
ఇటీవల తమ ప్రాజెక్టులలో ట్రాఫిక్.. కోవిడ్‌కు ముందున్న స్థాయిలో 80 శాతానికి చేరినట్లు మౌలిక సదుపాయాల కంపెనీ ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ చైర్మన్ డీఎం వీరేంద్ర పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా లాక్‌డవున్ నిబంధనల్లో వెసులుబాటు కారణంగా ఇకపై టోల్ కలెక్షన్లు పుంజుకోనున్నట్లు అభిప్రాయపడ్డారు. మొత్తం 9 ప్రాజెక్టులలో 5 ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని, వీటిలో 4 ఈ ఏడాదికల్లా పూర్తికాగలవని అంచనా వేస్తున్నారు. తద్వారా టారిఫ్‌లు 45 శాతం పెరిగే వీలున్నట్లు తెలియజేశారు. కంపెనీ గతేడాది(2019-20) ఫలితాలపై వెలువరించిన వార్షిక నివేదికలో ఈ అంశాలను పొందుపరిచినట్లు నిపుణులు తెలియజేశారు. దీంతో రానున్న కాలంలో కంపెనీ పనితీరు మెరుగుపడగలదన్న అంచనాలు పెరిగినట్లు తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఐఆర్బీ ఇన్ఫ్రా షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో దాదాపు 9 శాతం జంప్‌చేసింది. రూ. 128ను తాకింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. గత నెల రోజుల్లో ఈ షేరు 84 శాతం దూసుకెళ్లడం విశేషం! సౌత్ ఇండియన్ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో సౌత్ ఇండియన్ బ్యాంక్ ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. క్యూ1(ఏప్రిల్-జూన్)లో బ్యాంక్ స్టాండెలోన్ నికర లాభం 11 శాతం వృద్ధితో రూ. 82 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం సైతం దాదాపు 5 శాతం పుంజుకుని రూ. 2172 కోట్లకు చేరింది. త్రైమాసిక ప్రాతిపదికన స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 4.98 శాతం నుంచి 4.93 శాతానికి, నికర ఎన్పీఏలు 3.34 శాతం నుంచి 3.09 శాతానికి వెనకడుగు వేశాయి. అయితే ప్రొవిజన్లు, కంటింజెన్సీలు 43 శాతం పెరిగి రూ. 293 కోట్లను తాకాయి. ఈ నేపథ్యంలో సౌత్ ఇండియన్ బ్యాంక్ షేరు ఎన్ఎస్ఈలో 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 8.30 వద్ద ఫ్రీజయ్యింది. -
12 శాతం తగ్గిన కర్ణాటక బ్యాంక్ లాభం
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ కర్ణాటక బ్యాంక్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2019–20) మూడో త్రైమాసిక కాలంలో 12 శాతం తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.140 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.123 కోట్లకు తగ్గిందని కర్ణాటక బ్యాంక్ వెల్లడించింది. మొండి బకాయిలు పెరగడంతో నికర లాభం తగ్గిందని పేర్కొంది. మొత్తం ఆదాయం మాత్రం రూ.1,816 కోట్ల నుంచి రూ.2,024 కోట్లకు పెరిగిందని వివరించింది. గత క్యూ3లో 4.45 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ3లో 4.99 శాతానికి పెరిగాయని బ్యాంక్ తెలియజేసింది. నికర మొండి బకాయిలు 3 శాతం నుంచి 3.75 శాతానికి చేరాయి. కేటాయింపులు రూ.209 కోట్ల నుంచి రూ.315 కోట్లకు పెరిగాయని పేర్కొంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో కర్ణాటక బ్యాంక్ షేర్ 0.6 శాతం లాభంతో రూ.78 వద్ద ముగిసింది. సౌత్ ఇండియన్ బ్యాంక్ ఆదాయం రూ.2,188 కోట్లు ప్రైవేట్ రంగ సౌత్ ఇండియన్ బ్యాంక్‌కు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019–20) డిసెంబర్ క్వార్టర్లో రూ.91 కోట్ల నికర లాభం వచ్చింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో వచ్చిన నికర లాభం రూ.84 కోట్లతో పోలిస్తే 8 శాతం వృద్ధి సాధించామని సౌత్ ఇండియన్ బ్యాంక్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.1,922 కోట్ల నుంచి రూ.2,188 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఈ బ్యాంక్ స్థూల మొండి బకాయిలు స్వల్పంగా పెరిగాయి. గత క్యూ3లో 4.88 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ3లో 4.96 శాతానికి పెరిగాయి. అయితే నికర మొండి బకాయిలు మాత్రం 3.54 శాతం నుంచి 3.44 శాతానికి తగ్గాయి. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో సౌత్ ఇండియన్ బ్యాంక్ షేర్ 1.5 శాతం లాభంతో రూ.11 వద్ద ముగిసింది. -
16 రెట్లు పెరిగిన సౌత్ ఇండియన్ బ్యాంక్ లాభం
ముంబై: సౌత్ ఇండియన్ బ్యాంక్ సెప్టెంబర్ క్వార్టర్లో రూ.70 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.4.3 కోట్ల నికర లాభం వచ్చిందని బ్యాంక్ తెలిపింది. ఈ క్యూ2లో నికర లాభం 16 రెట్లు పెరిగిందని పేర్కొంది. గత క్యూ2లో రూ.1,817 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ2లో రూ.1,855 కోట్లకు పెరిగిందని తెలిపింది. స్థూల మొండి బకాయిలు 3.57 శాతం నుంచి 4.61 శాతానికి, నికర మొండి బకాయిలు 2.57 శాతం నుంచి 3.16 శాతానికి పెరిగాయని వివరించింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో బ్యాంక్ షేర్ 0.3 శాతం పడింది. -
సౌత్ ఇండియన్ బ్యాంకుకు భారీ జరిమానా
సాక్షి, ముంబై: రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సౌత్ ఇండియన్ బ్యాంకుకు భారీ జరిమానా విధించింది. కెవేసీ నిబంధనలు, ఆస్తుల వర్గీకరణ తదితర అంశాల్లో ఆర్బీఐ నిబంధనలను ఉల్లఘించిందన్న ఆరోపణలపై 5 కోట్ల రూపాయల జరిమానా విధించింది. ఆస్తుల వర్గీకరణ, కెవైసీ నిబంధనల ఉల్లంఘన, ట్రెజరీ కార్యకలాపాలకు సంబంధించిన నిబంధనలను పాటించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ఆర్బీఐ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ఐఆర్ఏసీ, కేవైసీ, ట్రెజరీ ఫంక్షన్‌కు సంబంధించిన సూత్రాలను సౌత్ ఇండియన్ బ్యాంక్ పట్టించుకోకపోవడంతో, సెక్షన్ 47ఏ1సీ, సెక్షన్ 46ఏఐ కింద ఈ జరిమానా విధించినట్లు ఆర్బీఐ స్పష్టం చేసింది. -
సౌత్ ఇండియన్ బ్యాంక్ లాభం 51% అప్
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ సౌత్ ఇండియన్ బ్యాంక్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం జనవరి–మార్చి క్వార్టర్లో 51 శాతం ఎగసింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2016–17) ఇదే క్వార్టర్లో రూ.76 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.114 కోట్లకు పెరిగిందని సౌత్ ఇండియన్ బ్యాంక్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.1,608 కోట్ల నుంచి రూ.1,768 కోట్లకు పెరిగిందని పేర్కొంది. వడ్డీ ఆదాయం రూ.1.471 కోట్ల నుంచి 8 శాతం వృద్దితో రూ.1,589 కోట్లకు పెరిగిందని వివరించింది. ఒక్కో షేర్‌కు 40 పైసలు డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపింది. పెరిగిన మొండి బకాయిలు... స్థూల మొండి బకాయిలు రూ.1,149 కోట్ల నుంచి రూ. 1,980 కోట్లకు, నికర మొండి బకాయిలు రూ.675 కోట్ల నుంచి రూ.1,416 కోట్లకు పెరిగాయని బ్యాంక్ పేర్కొంది. శాతం పరంగా చూస్తే, స్థూల మొండి బకాయిలు 2.45 శాతం నుంచి 3.59 శాతానికి, నికర మొండి బకాయిలు 1.45 శాతం నుంచి 2.60 శాతానికి పెరిగాయని తెలిపింది. మొండి బకాయిలు పెరిగినప్పటికీ, కేటాయింపులు మాత్రం రూ.165 కోట్ల నుంచి రూ.149 కోట్లకు తగ్గాయని బ్యాంక్ తెలిపింది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2016–17లో రూ.393 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 15 శాతం క్షీణించి రూ.335 కోట్లకు తగ్గిందని తెలిపింది. మొత్తం ఆదాయం రూ.6,563 కోట్ల నుంచి రూ.7,030 కోట్లకు పెరిగిందని వివరించింది. నికర లాభం 51 శాతం ఎగియడంతో బీఎస్ఈలో సౌత్ ఇండియన్ బ్యాంక్ షేర్ 3.5 శాతం లాభంతో రూ.26 వద్ద ముగిసింది. -
సౌత్ ఇండియా బ్యాంకు లాభం రూ.101 కోట్లు
కోచి: సౌత్ ఇండియన్ బ్యాంకు జూన్ త్రైమాసికంలో రూ.101.47 కోట్ల లాభాన్ని ఆర్జించింది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో వచ్చిన రూ.95 కోట్లతో పోలిస్తే 7 శాతం వృద్ధి చెందింది. నిర్వహణ లాభం 46 శాతం వృద్ధితో రూ.120 కోట్లుగా నమోదైనట్టు బ్యాంకు ఎండీ వీజీ మ్యాథ్యూ ఫలితాల వెల్లడి సందర్భంగా పేర్కొన్నారు. నికర వడ్డీ ఆదాయం, ఇతర ఆదాయంలో పెరుగుదల ఉంది. సవాళ్లతో కూడిన వాతావరణంలో రిటైల్ రుణాలు, కాసా డిపాజిట్లు పెంచుకోవాలన్న బ్యాంకు విధానం ప్రస్తుత పనితీరుకు దోహదపడినట్టు మ్యాథ్యూ తెలిపారు. రుణాల జారీ రూ.5,340 కోట్లు పెరిగి రూ.47,264 కోట్లకు చేరాయి. ఇది అంతకుముందు ఏడాదితో పోల్చి చూస్తే 12.47 శాతం అధికం. -
చోరీకి యత్నించి.. తెల్లమొహంతో ఇంటికి!
ఘట్ కేసర్: కొన్నిసార్లు చోరీ యత్నాలు కాస్త విచిత్రంగానూ, కాస్త నవ్వు తెప్పించేవిగా ఉంటాయి. సరిగా అలాంటి ఘటన మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ మండల పరిధిలోని అన్నోజిగూడలో శనివారం అర్ధారత్రి చోటుచేసుకుంది. ఆ వివరాలిలా ఉన్నాయి.. స్థానిక అన్నోజిగూడలో సౌత్ ఇండియన్ బ్యాంక్ ఏటీఎం ఉంది. ఇందులో చోరీ చేయాలని ఇద్దరు గుర్తు తెలియని యువకులు ప్లాన్ చేశారు. శనివారం అర్ధరాత్రి దాదాపు ఒంటిగంట ప్రాంతంలో ఓ యువకుడు ఏటీఎం సెంటర్లోకి వెళ్లగా, రెండో వ్యక్తి బయట కాపాలా ఉన్నాడు. ఎలాంటి ఆయుధం లేకుండా, ముఖానికి ఎలాంటి ముసుగు లాంటివి ధరించని ఆ యువకుడు చేసిన చోరీ యత్నం కాస్త విచిత్రంగానూ, నవ్వు తెప్పించేదిగా ఉంది. కేవలం చేతినే ఆయుధంగా చేసుకుని ఏటీఎం మేషిన్‌ను తెరవాలని శక్తికొద్దీ యత్నం చేశాడు. ఈ క్రమంలో ఓ చోరుడు నాలుగైదు పర్యాయాలు బయటకు వెళ్లి, మళ్లీ లోపలకి రావడం చేసినా ప్రయోజనం లేకపోయింది. నగదు పెట్టె భాగంలో ఉండే భాగం కాస్త ఊడి రావడంతో సంతోషించారు కానీ దాని లోపల అసలైన నగదు బాక్స్ ఉండటంతో తెల్లమొహాలు వేశారు ఆ యువకులు. చివరికి అక్కడి నుంచి వెళ్లిపోయారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఆదివారం ఉదయం బ్యాంకు అధికారుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. చోరీకి యత్నించిన యువకుల కోసం ఫుటేజీ ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు. -
చోరీకి యత్నించి.. తెల్లమొహంతో ఇంటికి!
-
దరఖాస్తు చేశారా?
సిండికేట్ బ్యాంక్‌లో అటెండెంట్, స్వీపర్ పోస్టుల దరఖాస్తుకు చివరి తేది: జనవరి 25 సౌత్ ఇండియన్ బ్యాంక్‌లో ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల దరఖాస్తుకు చివరి తేది: జనవరి 27 ఎస్బీఐలో పార్ట్‌టైమ్ మెడికల్ ఆఫీసర్ పోస్టుల దరఖాస్తుకు చివరి తేది: ఫిబ్రవరి 2 ఎన్డీఏ అండ్ ఎన్ఏ (1) ఎగ్జామ్ దరఖాస్తుకు చివరి తేది: ఫిబ్రవరి 10 -
రెండు ఏటీఎంలలో చోరికి యత్నం