సౌత్ ఇండియా బ్యాంకు లాభం రూ.101 కోట్లు
కోచి: సౌత్ ఇండియన్ బ్యాంకు జూన్ త్రైమాసికంలో రూ.101.47 కోట్ల లాభాన్ని ఆర్జించింది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో వచ్చిన రూ.95 కోట్లతో పోలిస్తే 7 శాతం వృద్ధి చెందింది. నిర్వహణ లాభం 46 శాతం వృద్ధితో రూ.120 కోట్లుగా నమోదైనట్టు బ్యాంకు ఎండీ వీజీ మ్యాథ్యూ ఫలితాల వెల్లడి సందర్భంగా పేర్కొన్నారు. నికర వడ్డీ ఆదాయం, ఇతర ఆదాయంలో పెరుగుదల ఉంది.
సవాళ్లతో కూడిన వాతావరణంలో రిటైల్ రుణాలు, కాసా డిపాజిట్లు పెంచుకోవాలన్న బ్యాంకు విధానం ప్రస్తుత పనితీరుకు దోహదపడినట్టు మ్యాథ్యూ తెలిపారు. రుణాల జారీ రూ.5,340 కోట్లు పెరిగి రూ.47,264 కోట్లకు చేరాయి. ఇది అంతకుముందు ఏడాదితో పోల్చి చూస్తే 12.47 శాతం అధికం.