quarterly
-
మూడు నెలలకోసారి సైబర్ రిస్క్ మదింపు
న్యూఢిల్లీ: టెక్నాలజీ అత్యంత వేగంగా పురోగమిస్తున్న నేపథ్యంలో కంపెనీలు తమ సైబర్ రిస్కులను ఏడాదికోసారి కాకుండా మూడు నెలలకోసారి మదింపు చేసుకోవాల్సిన అవసరం ఉందని డెలాయిట్ ఇండియా రిస్క్ అడ్వైజరీ పార్ట్నర్ దిగ్విజయసింహ చుదసమా తెలిపారు. కంపెనీలే కాకుండా ప్రజలు కూడా సైబర్ రక్షణ కోసం స్వీయ–మార్గదర్శకాలను రూపొందించుకోవాలని, కీలకమైన డేటాను షేర్ చేయడం వల్ల తలెత్తే సమస్యలపై అవగాహన కలిగి ఉండాలని ఆయన పేర్కొన్నారు. హ్యాకర్లు మరింత అధునాతనమైన పద్ధతుల్లో సైబర్ దాడులకు దిగుతున్నందున ఈ తరహా రక్షణాత్మక చర్యలు అవసరమని చుదసమా వివరించారు. తమ ప్రయోజనాలను, తమ డేటాను పరిరక్షించుకునేందుకు ఉపయోగపడే విధానాలను రూపొందించుకోవడంపై కంపెనీలు కసరత్తు ప్రారంభించాలని ఆయన సూచించారు. -
బజాజ్ ఫిన్సర్వ్ సేల్స్ ఢమాల్
న్యూఢిల్లీ: ఎన్బీఎఫ్సీ దిగ్గజం బజాజ్ ఫిన్సర్వ్ ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర లాభం 31 శాతం క్షీణించి రూ. 833 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 1,215 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 14,192 కోట్ల నుంచి రూ. 13,949 కోట్లకు బలహీనపడింది. సొంత అనుబంధ సంస్థలు బజాజ్ ఫైనాన్స్, బజాజ్ అలయెంజ్ జనరల్ ఇన్సూరెన్స్, బజాజ్ అలయెంజ్ లైఫ్ ల ఉమ్మడి పనితీరుతో వెల్లడించిన ఫలితాలివి. ఫైనాన్స్ ఓకే: అనుబంధ సంస్థలలో బజాజ్ ఫైనాన్స్ నికర లాభం 4 శాతంపైగా ఎగసి రూ. 1,002 కోట్లను తాకగా.. జనరల్ ఇన్సూరెన్స్ లాభం 8.4 శాతం క్షీణించి రూ. 362 కోట్లకు పరిమితమైంది. ఇక లైఫ్ ఇన్సూరెన్స్ విభాగం లాభం 35 శాతం పైగా వెనకడుగుతో రూ. 84 కోట్లకు చేరింది. -
‘క్యూ3’ సీజన్ వస్తోంది... ఐటీ మెరుపులు..!
భారత ఐటీ కంపెనీల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక (క్యూ3) ఫలితాలు అంచనాలను మించుతాయని విశ్లేషకులు అంటున్నారు. ఈ దశాబ్దంలోనే అత్యుత్తమ క్యూ3 ఫలితాలు ఇవే కావచ్చని వారంటున్నారు. సాధారణంగా ఐటీ కంపెనీలకు క్యూ3 సీజన్ బలహీనమైనది. అయితే ఈసారి మాత్రం ఐటీ కంపెనీలు క్యూ3 ఫలితాల్లో దుమ్ము రేపుతాయని, కంపెనీల ఆదాయం జోరుగానే వృద్ధి చెందగల అవకాశాలున్నాయంటున్న విశ్లేషకుల అభిప్రాయాలపై సాక్షి బిజినెస్ స్పెషల్ స్టోరీ..... ఐటీ కంపెనీలకు క్యూ3 సీజన్ బలహీనమైనది. ఈ సీజన్లో సెలవులు అధికంగా ఉంటాయి. అవుట్‌సోర్సింగ్‌పై కంపెనీలు స్వల్పంగానే ఖర్చు చేస్తాయి. ఫలితంగా ఐటీ కంపెనీల క్యూ3 ఫలితాలు అంతంతమాత్రంగానే ఉంటాయి. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా ఉండబోతోంది. కరోనా కల్లోలాన్ని తట్టుకోవడానికి డిమాండ్‌ను పెంచుకోవడానికి వివిధ రంగాల కంపెనీలు టెక్నాలజీ వినియోగాన్ని పెంచాయి. ఇది ఐటీ కంపెనీలకు కలసివచ్చింది. గత ఏడాది చివరి ఆర్నెళ్లలో వివిధ కంపెనీలు ఐటీ సేవల కోసం భారీగానే వ్యయం చేశాయి. ఐటీకి సంబంధించిన భారీ డీల్స్ బాగా పెరగడం, ఎన్నడూ లేనంత స్థాయిల్లో కంపెనీల ఆర్డర్ల బుక్‌లు కళకళలాడుతుండటం, డిజిటల్, క్లౌడ్ టెక్నాలజీలకు డిమాండ్ బాగా పెరుగుతుండటం, కరోనా కారణంగా కుదేలైన రిటైల్, రవాణా తదితర రంగాలు కోలుకుంటుండటం, అధిక శాతం సిబ్బంది వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా విధులు నిర్వర్తిస్తుండటంతో వ్యయాలు తగ్గడం, పర్యాటక, మార్కెటింగ్ సంబంధిత వ్యయాలు కూడా తగ్గడం... ఈ కారణాలన్నింటి వల్ల ఈసారి క్యూ3 ఫలితాలు దుమ్ము రేపనున్నాయి. వేతన పెంపు తప్ప మరే ఇతర ఒత్తిడులు మార్జిన్లపై ప్రభావం చూపవని నిపుణులు భావిస్తున్నారు. గైడెన్స్ (భవిష్యత్తు అంచనాలు) కూడా బాగా ఉంటాయని బ్రోకరేజ్ సంస్థలు ఆశిస్తున్నాయి. మధ్య స్థాయి కంపెనీలదీ అదే దారి...: దిగ్గజ ఐటీ కంపెనీలతో పాటు మైండ్‌ట్రీ, ఎల్ అండ్ టీ టెక్నాలజీ సర్వీసెస్, ఎల్ అండ్ టీ ఇన్పోటెక్‌లు కూడా మంచి ఫలితాలనే ఇస్తాయని అంచనాలున్నాయి. ఫలితాల సందర్భంగా కంపెనీలు వెల్లడించే విషయాలపై ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డీల్స్‌కు సంబంధించిన వివరాలు, కంపెనీలు అనుసరిస్తున్న కొత్త వ్యూహాలపై పురోగతి, ఇటీవల టేకోవర్ చేసిన సంస్థల ప్రభావం, వీటికి సంబంధించి యాజమాన్యాల వ్యాఖ్యలు కీలకం కానున్నాయి. భారీ డీల్స్...: ఈ క్యూ3లో ఇన్ఫోసిస్ కంపెనీ 320 కోట్ల డాలర్ల భారీ ఒప్పందాన్ని దైమ్లర్ కంపెనీతో కుదుర్చుకుంది. ఇక టీసీఎస్ కంపెనీ డాషే బ్యాంక్, ప్రుడెన్షియల్ సంస్థల నుంచి భారీ డీల్స్‌ను సాధించింది. ఇక విప్రో కంపెనీ జర్మనీ హోల్‌సేల్ దిగ్గజం మెట్రో ఏజీతో 100 కోట్ల డాలర్ల డీల్ కుదుర్చుకుంది. ఈఆన్, మారెల్లీ తదితర దిగ్గజాల నుంచి భారీ డీల్స్‌ను సాధించింది. ఈ నెల 8న టీసీఎస్ ఫలితాలు టీసీఎస్ ఈ నెల 8న క్యూ3 ఫలితాలను వెల్లడిస్తుంది. ఈ నెల 13న ఇన్ఫోసిస్, విప్రోలు ఫలితాలను ప్రకటించనున్నాయి. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఫలితాలు ఈ నెల 15న వస్తాయి. ఇటీవలి ఐటీ షేర్లు జోరుగా పెరిగాయి. ఫలితాలపై భారీ అంచనాలతో చాలా ఐటీ షేర్లు మంగళవారం ఆల్‌టైమ్ హైలను తాకాయి. అనలిస్ట్‌ల అంచనాలు టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ ఈ కంపెనీల ఆదాయాలు సీక్వెన్షియల్‌గా 2–3% మేర పెరగగలవనేది విశ్లేషకుల అంచనా. 2021–22 ఆదాయ అంచనాలను పెంచే అవకాశాలు అధికంగా ఉన్నాయని వారంటున్నారు. టీసీఎస్: ఆదాయ వృద్ధి సీక్వెన్షియల్‌గా 2–3 శాతం ఉండొచ్చు. గత ఏడాది అక్టోబర్ నుంచి వేతనాలు పెంచినందున నిర్వహణ లాభం ఒకింత తగ్గవచ్చు. నికర లాభం కూడా 1–1.2 శాతం మేర తగ్గవచ్చు. ఇన్ఫోసిస్: ఆదాయం 3 శాతం మేర పెరుగుతుంది. నిర్వహణ లాభం ఫ్లాట్‌గా ఉండొచ్చు. లేదా ఒకింత తగ్గవచ్చు. అయితే నికర లాభం 15% పెరిగే అవకాశాలున్నాయి. కరోనా వల్ల పొదుపు చర్యలు పెరగడం, నిర్వహణ సామర్థ్యాలు మెరుగుపడటం, రూపాయి క్షీణత... ప్రధాన కారణాలు. విప్రో: ఈ కంపెనీ నిర్వహణ లాభం నిలకడగా ఉండొచ్చు. లేదా స్వల్పంగా పెరిగే అవకాశాలున్నాయి. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్: ఆదాయం (సీక్వెన్షియల్‌గా)2–3 శాతం రేంజ్లో పెరగవచ్చు. -
సగానికి తగ్గిన బీవోబీ లాభాలు
న్యూఢిల్లీ: మొండి బాకీలు పెద్దగా మారనప్పటికీ.. అధిక కేటాయిం పులు జరపాల్సి రావడంతో జూన్ త్రైమాసికంలో బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) నికర లాభం దాదాపు 52 శాతం క్షీణించి రూ. 203 కోట్లకు పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో ఇది రూ.424 కోట్లు. మరోవైపు, మొత్తం ఆదాయం మాత్రం రూ. 11,878 కోట్ల నుంచి రూ. 12,104 కోట్లకు పెరిగింది. స్థూల నిరర్ధక ఆస్తులు (ఎన్పీఏ) 11.15 సాతం నుంచి 11.40 శాతానికి చేరగా, నికర నిరర్ధక ఆస్తులు మాత్రం 5.73 శాతం నుంచి 5.17 శాతానికి తగ్గాయి. జూన్ త్రైమాసికంలో ప్రొవిజనింగ్ కింద బీవోబీ రూ. 2,157 కోట్లు పక్కన పెట్టింది. క్రితం క్యూ1లో ఈ మొత్తం రూ. 1,986 కోట్లు. బీఎస్ఈలో బీవోబీ షేరు 3.91 శాతం క్షీణించి రూ. 142.55 వద్ద ముగిసింది. బ్యాంకింగ్ ఫలితాలు ఓబీసీ నష్టం రూ. 486 కోట్లు ఆదాయంలో క్షీణత, మొండి బాకీలకు అధిక కేటాయింపుల మూలంగా ప్రభుత్వ రంగ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ) క్యూ1లో రూ. 486 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. గత జూన్ త్రైమాసికంలో లాభం రూ. 101 కోట్లు. ఇక ఆదాయం రూ. 5,398 కోట్ల నుంచి రూ. 5,204 కోట్లకు తగ్గింది. స్థూల ఎన్పీఏలు 11.45 శాతం నుంచి 14.83 శాతానికి, నికర ఎన్పీఏలు 8.11 శాతం నుంచి 9.56 శాతానికి పెరిగాయి. అలహాబాద్ లాభం రూ. 29 కోట్లు అలహాబాద్ బ్యాంక్ రూ. 29 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత క్యూ1లో బ్యాంకుకు రూ.565 కోట్ల నష్టం వచ్చింది. తాజా తొలి త్రైమాసికంలో ఆదాయం రూ.5,123 కోట్ల నుంచి రూ.4,969 కోట్లకు తగ్గింది. నికర ఎన్పీఏలు 8.69 శాతం నుంచి 8.96 శాతానికి పెరిగాయి. క్యూ1లో మొండి బాకీల కోసం ప్రొవిజనింగ్ కింద అలహాబాద్ బ్యాంకు చేసిన కేటాయింపులు రూ.1,575 కోట్ల నుంచి రూ.1,687 కోట్లకు పెరిగాయి. కార్పొరేషన్ బ్యాంక్ లాభం 67 శాతం అప్.. తొలి త్రైమాసికంలో కార్పొరేషన్ బ్యాంక్ నికర లాభం 67 శాతం వృద్ధి చెంది రూ.36 కోట్ల నుంచి రూ.60 కోట్లకు పెరిగింది. అయితే, ఆదాయం మాత్రం రూ.5,241 కోట్ల నుంచి రూ.5,113 కోట్లకు తగ్గింది. మరోవైపు, స్థూల నిరర్ధక ఆస్తులు 11.01 శాతం నుంచి ఏకంగా 15.49 శాతానికి ఎగశాయి. -
తగ్గిన హెరిటేజ్ లాభం
తొలి త్రైమాసికంలో 53 శాతం డౌన్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ నికరలాభం 2017–18 తొలి త్రైమాసికంలో 53 శాతం తగ్గింది. గతేడాది ఇదే కాలంతో ఆర్జించిన స్టాండలోన్ నికరలాభం రూ.16.4 కోట్లతో పోలిస్తే... ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్– జూన్) కేవలం రూ.7.64 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం 32 శాతం వృద్ధి చెంది రూ.610.74 కోట్ల వద్ద నిలిచింది. రూ.10 ముఖ విలువ కలిగిన ఒకో ఈక్విటీ షేరును రూ.5 ముఖ విలువ కలిగిన రెండు షేర్లుగా విభజించేందుకు (స్ప్లిట్) బోర్డు ఆమోదించింది. హెరిటేజ్ సంస్థ ఫ్రాన్స్‌కు చెందిన నొవాన్డీ ఎస్ఎన్సీతో కలసి 50:50 జాయింట్ వెంచర్‌గా రూ.16 కోట్లతో గ్రీన్‌ఫీల్డ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో ఫ్లేవర్డ్ యుగార్ట్, వెస్ట్రన్ డిస్సెర్ట్స్ను తయారు చేస్తోంది. ఈ ఉత్పత్తులను వచ్చే ఏడాది మార్కెట్లోకి విడుదల చేయనుంది. -
స్పైస్ జెట్ లాభం 16శాతం అప్
న్యూఢిల్లీ: ఏవియేషన్ కంపెనీ స్పైస్ జెట్ కన్సాలిడేటెడ్ నికరలాభం 2017 జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో 16 శాతం వృద్ధిచెంది రూ. 149 కోట్ల నుంచి రూ. 173 కోట్లకు పెరిగింది. కంపెనీ మొత్తం ఆదాయం రూ. 1,544 కోట్ల నుంచి రూ. 1,890 కోట్లకు చేరింది. ఫలితాల సందర్భంగా స్పైస్ జెట్ షేరు 5 శాతం పతనమై రూ. 119 వద్ద ముగిసింది. -
అశోక్ లేలాండ్ లాభం 111 కోట్లు
న్యూఢిల్లీ: వాహన దిగ్గజం అశోక్ లేలాండ్ నికర లాభం 2017 జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో భారీగా తగ్గి రూ. 111.23 కోట్లకు దిగింది. గతేడాది ఇదేకాలంలో లాభం రూ. 291 కోట్లు. అయితే హిందూజా ఫౌండ్రీస్ విలీనం కారణంగా ఈ కంపెనీ ఆర్థికాంశాలు కూడా కలిసివున్నందున, తమతాజా ఫలితాల్ని గతేడాదితో పోల్చలేమని అశోక్‌లేలాండ్ విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. కానీ ముగిసిన త్రైమాసికంలో తమ లాభదాయకత తగ్గినట్లు కంపెనీ తెలిపింది. తాజా త్రైమాసికంలో ఫారిన్ ఎక్సే్ఛంజ్ స్వాప్స్ కారణంగా రూ. 2.67 కోట్ల నష్టం వచ్చిందని, గతేడాది ఇదేకాలంలో ఈ కార్యకలాపాల ద్వారా రూ. 49 కోట్ల లాభం వచ్చినట్లు కంపెనీ వివరించింది. అశోక్ లేలాండ్ మొత్తం ఆదాయం రూ. 4,553 కోట్ల వద్ద స్థిరంగా నమోదయ్యింది. గతేడాది జూన్ త్రైమాసికంలో ఆదాయం రూ. 4,569 కోట్లు. -
నిరాశపరిచిన బజాజ్ ఆటో
క్యూ1లో19% డౌన్; రూ.836 కోట్లు న్యూఢిల్లీ: దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీల్లో ఒకటైన బజాజ్ ఆటో ఫలితాల్లో ఉసూరుమనిపించింది. విక్రయాలు పడిపోవడంతో జూన్ త్రైమాసికంలో లాభం ఏకంగా 19 శాతం క్షీణించింది. కంపెనీ రూ.836.79 కోట్ల లాభాన్ని కంపెనీ ఆర్జించింది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో లాభం రూ.1,039.70 కోట్లు కావటం గమనార్హం. మొత్తం ఆదాయం కూడా తగ్గి రూ.6,177 కోట్లుగా నమోదైంది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ.6,355 కోట్లు. బీఎస్–3 నుంచి బీఎస్–4 కాలుష్య ప్రమాణాలకు మారడంతో పాటు జీఎస్టీ వల్ల కూడా జూన్ త్రైమాసికంలో పరిశ్రమపై ప్రభావం పడిందని బజాజ్ ఆటో తెలియజేసింది. జూన్ క్వార్టర్లో వాహన విక్రయాలు 8,88,434గా ఉన్నాయి. అంతకుముందు ఏడాది ఇదే క్వార్టర్లో నమోదు చేసిన 9,94,733 వాహన విక్రయాలతో పోల్చి చూస్తే 10.68 శాతం తక్కువ. ‘‘జీఎస్టీకి మారడం వల్ల జూన్ 30 నాటికి డీలర్ల వద్ద మిగిలి ఉన్న ఒక్కో వాహనంపై రూ.1,400 సీఎస్టీ, ఆటోసెస్, ఎంట్రీ ట్యాక్స్ రూపేణా నష్టం వాటిల్లింది. దీంతో డీలర్లకు పరిహారం రూపేణా రూ.32 కోట్లు చెల్లించాం’’ అని బజాజ్ ఆటో తెలిపింది. బీఎస్ఈలో స్టాక్ ధర గురువారం 0.38 శాతం నష్టపోయి రూ.2,814.15 వద్ద క్లోజయింది. -
విప్రో రూ.11 వేల కోట్ల బైబ్యాక్
♦ షేరుకు రూ. 320 చొప్పున ♦ 34 కోట్ల షేర్ల కొనుగోలుకు ఆఫర్ ♦ స్వల్పంగా పెరిగిన నికరలాభం బెంగళూరు: భారత్‌లో మూడో పెద్ద ఐటీ కంపెనీ విప్రో నికరలాభం ఈ ఏడాది ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో 1.2 శాతం పెరుగుదలతో రూ. 2,076 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం కూడా స్వల్పంగా వృద్ధిచెంది రూ. 14,281 కోట్లకు చేరింది. అలాగే రూ. 11,000 కోట్లతో బైబ్యాక్ ఆఫర్‌ను విప్రో ప్రకటించింది. ఈ ఆఫర్ కింద షేరుకు రూ. 320 చొప్పున 34.3 కోట్ల షేర్లను కంపెనీ ఇన్వెస్టర్ల నుంచి కొనుగోలు చేయనుంది. గురువారం సమావేశమైన కంపెనీ డైరెక్టర్ల బోర్డు బైబ్యాక్ ప్రతిపాదనకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. షేర్‌హోల్డర్ల అనుమతికి లోబడి టెండర్ ఆఫర్ ప్రాతిపదికన ఈ బైబ్యాక్ ఆఫర్ అమలవుతోంది. ఈ ఏడాది అక్టోబర్‌కల్లా బైబ్యాక్ ప్రణాళికను పూర్తిచేస్తామన్న అంచనాల్ని కంపెనీ అధికారులు ప్రకటించారు. ఫలితాల నేపథ్యంలో విప్రో షేరు స్వల్ప తగ్గుదలతో రూ. 269 వద్ద ముగిసింది. సెప్టెంబర్ క్వార్టర్‌కి గైడెన్స్... ఈ జూన్–సెప్టెంబర్ త్రైమాసికంలో తమ ఐటీ ఆదాయం 1,96.2–200.1 కోట్ల డాలర్ల మధ్య వుండవచ్చని కంపెనీ అంచనాల్లో పేర్కొంది. డాలరు ప్రాతిపాదికన జూన్ త్రైమాసికంలో కంపెనీ ఐటీ సర్వీసుల ఆదాయం 2.1 శాతం పెరుగుదలతో 197.17 కోట్ల డాలర్లుగా నమోదయ్యింది. తాము గతంలో ప్రకటించిన గైడెన్స్ శ్రేణిలో గరిష్టస్థాయి టర్నోవర్‌ను ముగిసిన త్రైమాసికంలో సాధించామని విప్రో సీఈఓ అబిదాలి జడ్ నీమూచ్‌వాలా చెప్పారు. డిజిటల్ టెక్నాలజీలపై తాము దృష్టి సారిస్తున్నామని, దీనికి తోడు క్లయింట్ మైనింగ్‌పై తాము చేసిన పెట్టుబడులు ఫలితాల్ని ఇస్తున్నాయని, దాంతో ప్రధాన ఖాతాల నుంచి పటిష్టమైన వృద్ధి సాధించినట్లు ఆయన వివరించారు. రూపాయి పెరుగుదల, వేతనాల వృద్ధి వల్ల ఆపరేటింగ్ మార్జిన్లపై ప్రభావం పడినా, మంచి వ్యాపార సమర్థత కనపర్చడం ద్వారా ఆ ప్రతికూలతను కొంతవరకూ అధిగమించామని కంపెనీ సీఎఫ్ఓ జితిన్ దలాల్ చెప్పారు. జూన్ త్రైమాసికంలో విప్రో స్థూలంగా 1,309 కొత్త నియామకాల్ని జరపడంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,66,790కి చేరింది. షేర్హోల్డర్లకు రాబడులనిచ్చే క్రమంలో తాజా బైబ్యాక్ ఆఫర్‌ను ప్రకటించినట్లు ఆయన తెలిపారు. -
బజాజ్ ఫైనాన్స్ లాభం 42% వృద్ధి
♦ క్యూ1లో రూ. 602 కోట్లు ♦ రూ. 4,500 కోట్ల సమీకరణకు షేర్హోల్డర్లు ఓకే న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో బజాజ్ ఫైనాన్స్ నికర లాభం 42 శాతం ఎగిసి రూ. 602 కోట్లుగా నమోదైంది. 2016–17 ఏప్రిల్–జూన్ వ్యవధిలో లాభం రూ. 424 కోట్లే. ఇక తాజాగా ఆదాయం సైతం 39 శాతం వృద్ధి చెంది రూ. 2,282 కోట్ల నుంచి రూ. 3,165 కోట్లకు పెరిగినట్లు కంపెనీ తెలిపింది. డెట్ సెక్యూరిటీస్ జారీ ద్వారా రూ. 4,500 కోట్ల నిధులు సమీకరించే ప్రతిపాదనకు షేర్హోల్డర్లు ఆమోదముద్ర వేసినట్లు వివరించింది. గతేడాది జూన్ ఆఖరు నాటికి రూ. 49,608 కోట్లుగా ఉన్న బజాజ్ ఫైనాన్స్ నిర్వహణలోని ఆస్తుల విలువ (ఏయూఎం) ఈ ఏడాది జూన్ ఆఖరు నాటికి 39 శాతం పెరిగి రూ. 68,883 కోట్లకు చేరింది. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో సంస్థ షేరు ధర సుమారు 2 శాతం లాభంతో రూ. 1,543 వద్ద ముగిసింది. -
గ్రామాల్లో కార్లకు గిరాకీ!
♦ జూన్ క్వార్టర్లో 30 శాతం పెరిగిన విక్రయాలు ♦ మారుతి, హ్యుందాయ్‌లకు కలిసొచ్చిన కాలం న్యూఢిల్లీ: కార్ల కంపెనీలపై ఈ వర్షకాలం లాభాల జల్లు కురిపిస్తోంది. సాధారణ వర్షపాతం అంచనాలతో మొదటి త్రైమాసికంలో కార్ల విక్రయాలు అధిక సంఖ్యలో అమ్ముడుపోయాయి. మారుతి సుజుకి విక్రయాలు గ్రామీణ ప్రాంతాల్లో 30% పెరగ్గా, హ్యుందాయ్ అమ్మకాల్లో 23%కి పైగా వృద్ధి నమోదైంది. దేశీయ కార్ల మార్కెట్లో ఈ రెండు సంస్థల ఉమ్మడి వాటా 67%. వీటి విక్రయాల ద్వారా పరిశ్రమ ప్రగతిని తేలిగ్గా అంచనా వేయొచ్చు. మొత్తం విక్రయాల వృద్ధి కన్నా గ్రామీణ ప్రాంతాల్లో అధిక వృద్ధి నమోదైంది. ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో మారుతీ 1,34,624 కార్లను విక్రయించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో విక్రయాలు 1,04,059తో పోలిస్తే 30% అధికం. మరోవంక దేశ వ్యాప్తంగా మారుతీ కార్ల విక్రయాల్లో వృద్ధి 14 శాతమే. ఈ ఏడాది వర్షపాతం 98%గా ఉంటుందంటూ గత నెలలో భారత వాతావరణ విభాగం తన అంచనాలను సవరించడం తెలిసిందే. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో సెంటిమెంట్ మెరుగైందని, జూన్ త్రైమాసిక విక్రయాల్లో వృద్ధి గణాంకాలు తమ అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయని మారుతీ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇక హ్యుందాయ్ ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో 18,337 కార్లను గ్రామీణ ప్రాంతాల్లో విక్రయించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో విక్రయాలు 14,879తో పోలిస్తే 23% అధికం. అయితే ఇదే త్రైమాసికంలో మొత్తం మీద భారత మార్కెట్లో హ్యుందాయ్ కార్ల విక్రయాల్లో వృద్ధి 1%లోపే ఉండటం గమనార్హం. మెరుగైన వర్షపాత అంచనాలతో కస్టమర్లలో సెంటిమెంట్ బలపడిందని, దీంతో అధిక వృద్ధి నమోదైందని హ్యుందాయ్ అంటోంది. నెట్వర్క్ విస్తరణపై దృష్టి గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్‌ను గమనించిన ప్రధాన కంపెనీలు తమ రూరల్ నెట్వర్క్ విస్తరణపై దృష్టి పెట్టాయి. కస్టమర్లను చేరుకునేందుకు విక్రయాలు, సేవలకు సంబంధించి సిబ్బందిని నియమించుకుంటున్నాయి. బ్యాంకులతోనూ ప్రత్యేకంగా ఒప్పందాలు చేసుకుంటున్నాయి. హ్యుందాయ్‌కు గ్రామీణ ప్రాంతాల్లో 300 ఔట్‌లెట్లున్నాయి. వీటికి అదనంగా కంపెనీ కార్ల విక్రయాల కోసం ఫ్లోట్వ్యాన్స్ను రంగంలోకి దింపింది. ఈ వ్యాన్లు ఒకే చోట స్థిరంగా ఉండకుండా వివిధ గ్రామాల్లో పర్యటిస్తూ కార్ల విక్రయాలు చేపడతాయి. ఇక, పండుగల ప్రారంభ సీజన్ కావడంతో ఈ క్వార్టర్లోనూ విక్రయాలు మరింత మెరుగ్గా ఉంటాయని కంపెనీలు అంచనా వేస్తున్నాయి. వర్షాకాలం సాగు పనుల నేపథ్యంలో ట్రాక్టర్లకూ, అదే సమయంలో ద్విచక్ర వాహనాలకూ డిమాండ్ ఉంటుందని ఆటోమొబైల్ పరిశ్రమ ఆశిస్తోంది. -
క్యూ2లో చైనా వృద్ధి 6.9%
6.5 శాతం లక్ష్యం కన్నా అధికం బీజింగ్: ఈ ఏడాది రెండో త్రైమాసికంలో చైనా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 6.9 శాతం మేర వృద్ధి నమోదు చేసింది. ఇది ప్రభుత్వం లక్యంగా నిర్దేశించుకున్న 6.5 శాతం కన్నా అధికం. ఈ నేపథ్యంలో అధిక రుణభారం ఉన్నప్పటికీ.. 2017 వృద్ధి లక్ష్యాలను చైనా సునాయాసంగా అధిగమించగలదని పరిశీలకులు భావిస్తున్నారు. దాదాపు తొలి త్రైమాసికం స్థాయిలోనే రెండో త్రైమాసికంలోనూ వృద్ధి నమోదైంది. తమ ఎకానమీ సముచిత శ్రేణిలో స్థిరమైన వృద్ధి రేటు సాధిస్తున్నామని చైనా నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (ఎన్బీఎస్) ప్రతినిధి జింగ్ జిహాంగ్ తెలిపారు. వార్షిక వృద్ధి లక్ష్యం సాధన దిశగా పటిష్టమైన పునాది ఏర్పడుతున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు తాజా గణాంకాల నేపథ్యంలో చైనా క్యూ3 వృద్ధి అంచనాలను గతంలో పేర్కొన్న 6.6 శాతంనుంచి 6.8 శాతానికి, వార్షిక వృద్ధిని 6.7 శాతం నుంచి 6.8 శాతానికి పెంచుతున్నట్లు నొమురా సెక్యూరిటీస్ ఒక నివేదికలో పేర్కొంది. అటు ప్రాపర్టీ రంగంలో మందగమనం, దేశీయంగా డిమాండ్ తగ్గే అవకాశాలు, అంతర్జాతీయంగా డిమాండ్‌పై అనిశ్చితి నెలకొన్నందున వృద్ధి క్రమంగా మందగించవచ్చన్న అంచనాలు కొనసాగవచ్చని తెలిపింది. జనవరి నుంచి జూన్ మధ్య కాలంలో చైనాలోని పట్టణప్రాంతాల్లో సుమారు 73.5 లక్షల కొత్త ఉద్యోగాల కల్పన జరిగింది. ఇది గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే 1,80,000 అధికం. గతేడాది కన్నా పది లక్షలు అధికంగా ఈ ఏడాది దాదాపు 1.1 కోట్ల మేర ఉద్యోగాలు కల్పించాలని చైనా నిర్దేశించుకుంది. -
ఏసీసీ లాభం రూ.326 కోట్లు
న్యూఢిల్లీ: మెరుగైన అమ్మకాలతో సిమెంట్ దిగ్గజం ఏసీసీ జూన్ త్రైమాసికంలో రూ.326 కోట్ల లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే కాలంలో వచ్చిన రూ.246 కోట్లతో పోల్చుకుంటే తాజాగా 32 శాతం మేర వృద్ధి చెందింది. కన్సాలిడేటెడ్ విక్రయాలు 18 శాతం అధికమై రూ.3,818 కోట్లుగా నమోదయ్యాయి. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు రూ.3,238 కోట్లు. సిమెంట్ విక్రయాలు 10 శాతం అధికంగా 6.74 మిలియన్ టన్నులు అమ్ముడుపోయినట్టు కంపెనీ తెలిపింది. కొత్త బ్రాండ్లు విడుదల చేయడంతోపాటు ప్లాంట్ సామర్థ్యాన్ని మెరుగుపరచడం వంటి చర్యలు చక్కని పనితీరుకు నిదర్శనంగా ఏసీసీ ఎండీ నీరజ్ అఖోరీ తెలిపారు. కాగా, ప్రతీ రూ.10 ముఖ విలువ కలిగిన షేరుకు మధ్యంతర డివిడెండ్ కింద రూ.11 ఇవ్వాలని బోర్డు సిఫారసు చేసింది. జనవరి–డిసెంబర్‌ను ఆర్థిక సంవత్సరంగా ఏసీసీ పాటిస్తోంది. -
సైయంట్ లాభం రూ.88 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఐటీ ఇంజనీరింగ్ సేవల సంస్థ సైయంట్ 2017–18 ఏడాది జూన్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే నికర లాభం 18.7% అధికమై రూ.87.8 కోట్లు నమోదు చేసింది. 2016–17 జూన్ త్రైమాసికంలో కంపెనీ రూ.74 కోట్ల నికర లాభం పొందింది. క్రితంతో పోలిస్తే టర్నోవర్ రూ.8.6% అధికమై రూ.907 కోట్లకు ఎగసింది. నిర్వహణ లాభం క్రితం ఏడాదితో పోలిస్తే 6.5% పెరిగి రూ.116 కోట్లుగా ఉంది. 2017–18లో డిజైన్ ఆధారిత తయారీ విభాగం 20% వృద్ధి నమోదు చేస్తుందని కంపెనీ భావిస్తోంది. బీఎస్ఈలో గురువారం కంపెనీ షేరు ధర 1.36% తగ్గి రూ.515.60 వద్ద స్థిరపడింది. -
సీసీఎల్ నికర లాభం రూ.27 కోట్లు
షేరుకు రూ.2.50 తుది డివిడెండ్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇన్స్టాంట్ కాఫీ దిగ్గజం సీసీఎల్ ప్రొడక్ట్స్ జూన్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నికర లాభం బాగా క్షీణించింది. కిందటేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే లాభం రూ.40 కోట్ల నుంచి రూ.27 కోట్లకు పరిమితమయింది. టర్నోవరు రూ.251 కోట్ల నుంచి స్వల్పంగా తగ్గి రూ.249 కోట్లకు పరిమితమయింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల వాటా పరిమితిని పెంచాలని మంగళవారం సమావేశమైన బోర్డు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఎఫ్ఐఐల వాటా పరిమితి 24 శాతముంది. దీనిని 40 శాతం వరకూ అనుమతించేలా బోర్డు నిర్ణయం తీసుకుంది. 2016–17 సంవత్సరానికిగాను ఒక్కో షేరుపై రూ.2.50 తుది డివిడెండు చెల్లించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా కాళహస్తి సమీపంలో ఏర్పాటు చేయనున్న ప్లాంటులో ఉత్పత్తి కార్యకలాపాలు 2018 జూలై నాటికి ప్రారంభిస్తామని సీసీఎల్ ప్రొడక్ట్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ చల్లా రాజేంద్ర ప్రసాద్ ‘సాక్షి’ బిజినెస్ బ్యూరోకు తెలిపారు. 5,000 టన్నుల వార్షిక సామర్థ్యంతో రానున్న ఈ ప్లాంటు కోసం సుమారు రూ.325 కోట్లు వెచ్చిస్తున్నట్టు చెప్పారు. 100 ఎకరాలను కంపెనీ కొనుగోలు చేసింది. ఇందులో 25 ఎకరాల్లో సెజ్‌ను అభివృద్ధి చేస్తారు. ప్రత్యక్షంగా 100 మందికి, పరోక్షంగా మరో 100 మందికి ఉపాధి లభించనుంది. ఫ్రీజ్ డ్రైడ్ ఇన్స్టాంట్ కాఫీని ఇక్కడ తయారు చేస్తారు. ప్రధానంగా యూఎస్, యూరప్ మార్కెట్లకు కాఫీని ఎగుమతి చేయనున్నారు. -
సౌత్ ఇండియా బ్యాంకు లాభం రూ.101 కోట్లు
కోచి: సౌత్ ఇండియన్ బ్యాంకు జూన్ త్రైమాసికంలో రూ.101.47 కోట్ల లాభాన్ని ఆర్జించింది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో వచ్చిన రూ.95 కోట్లతో పోలిస్తే 7 శాతం వృద్ధి చెందింది. నిర్వహణ లాభం 46 శాతం వృద్ధితో రూ.120 కోట్లుగా నమోదైనట్టు బ్యాంకు ఎండీ వీజీ మ్యాథ్యూ ఫలితాల వెల్లడి సందర్భంగా పేర్కొన్నారు. నికర వడ్డీ ఆదాయం, ఇతర ఆదాయంలో పెరుగుదల ఉంది. సవాళ్లతో కూడిన వాతావరణంలో రిటైల్ రుణాలు, కాసా డిపాజిట్లు పెంచుకోవాలన్న బ్యాంకు విధానం ప్రస్తుత పనితీరుకు దోహదపడినట్టు మ్యాథ్యూ తెలిపారు. రుణాల జారీ రూ.5,340 కోట్లు పెరిగి రూ.47,264 కోట్లకు చేరాయి. ఇది అంతకుముందు ఏడాదితో పోల్చి చూస్తే 12.47 శాతం అధికం. -
టెల్కోల ఆదాయం 15% డౌన్
ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలో న్యూఢిల్లీ: టెలికం ఆపరేటర్లు సర్వీసుల నుంచి పొందే ఆదాయం ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలో 15 శాతం తగ్గుదలతో రూ.40,831 కోట్లకు క్షీణించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఈ ఆదాయం రూ.48,379 కోట్లుగా ఉంది. ఈ విషయాలను టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ తన తాజా నివేదికలో పేర్కొంది. దీని ప్రకారం.. వార్షిక ప్రాతిపదికన చూస్తే స్థూల ఆదాయం (జీఆర్), సర్దుబాటు స్థూల ఆదాయం (ఏజీఆర్) వరుసగా 7.35 శాతం, 15.60 శాతం క్షీణించాయి. కంపెనీకి అన్ని విభాగాల నుంచి వచ్చిన ఆదాయాన్ని స్ధూల ఆదాయం అని, కేవలం టెలికం సర్వీసుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని సర్దుబాటు స్థూల ఆదాయం అని పేర్కొంటాం. -
కొత్త పెట్టుబడులు... క్రాష్!
♦ ఏప్రిల్– జూన్ మధ్య భారీగా తగ్గిన పెట్టుబడులు ♦ ప్రకటించిన కొత్త ప్రాజెక్టులు 448 మాత్రమే... ♦ వీటి విలువ రూ.1.35 లక్షల కోట్లుగా అంచనా... ♦ గడిచిన మూడేళ్లలో త్రైమాసిక సగటు 2.2 లక్షల కోట్లు న్యూఢిల్లీ: పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో మాత్రం ఇది ఏమంత ఫలితాలిస్తున్నట్లు కనిపించటం లేదు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (2017–18, ఏప్రిల్–జూన్) దేశీయంగా కొత్త పెట్టుబడులు భారీగా పడిపోవటమే దీనికి నిదర్శనం. జూన్ క్వార్టర్లో భారతీయ కార్పొరేట్ సంస్థలు కేవలం 448 కొత్త ప్రాజెక్టులను మాత్రమే ప్రకటించాయి. వీటికి సంబంధించి పెట్టుబడుల అంచనా రూ.1.35 లక్షల కోట్లు. గడిచిన మూడేళ్లలో త్రైమాసిక ప్రాతిపదికన కార్పొరేట్లు ప్రకటించిన సగటు పెట్టుబడుల విలువ రూ.2.2 లక్షల కోట్లుగా లెక్కతేలుతుండటం గమనార్హం. అంటే సగటున చూసుకుంటే ఈ త్రైమాసికంలో ఏకంగా రూ.85 వేల కోట్ల వరకూ తగ్గుదల కనిపిస్తోంది. మరోవంక ఈ ఏడాది జనవరి–మార్చి క్వార్టర్లో ప్రకటించిన కొత్త పెట్టుబడుల విలువ రూ.2.95 లక్షల కోట్లు కావడం గమనార్హం. రీసెర్చ్ సంస్థ సీఎంఐఈ ఈ గణాంకాలను వెల్లడించింది. సామర్థ్య వినియోగం 75 శాతం వద్దే... వాస్తవానికి కొత్త పెట్టుబడి ప్రకటనలనేవి అటు ప్రైవేటు ఇటు ప్రభుత్వ రంగంలో కూడా కంపెనీల వ్యాపార విశ్వాసానికి కొలమానంగా భావిస్తారు. కేంద్రంలోని మోదీ సర్కారు గత మూడేళ్లుగా దేశంలో ఉద్యోగాల కల్పన, అదేవిధంగా తయారీ రంగాన్ని ప్రోత్సహించడం కోసం మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్మార్ట్ సిటీస్ వంటి పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. అయినప్పటికీ పెట్టుబడులు జోరందుకోకపోగా.. తగ్గుముఖం పడుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్లాంట్ల సామర్థ్య వినియోగం (కెపాసిటీ యుటిలైజేషన్) ఇంకా 75 శాతం వద్దే కొట్టుమిట్టాడుతోందని కంపెనీల చీఫ్‌లు చెబుతున్నారు. ఈ యుటిలైజేషన్ పూర్తిస్థాయికి చేరుకుంటే తప్ప కొత్త పెట్టుబడులవైపు కంపెనీలు దృష్టిసారించే అవకాశం లేదనేది వారి అభిప్రాయం. దీనికితోడు మొండిబకాయిల (ఎన్పీఏ) సమస్య తీవ్రతరం కావడంతో ఇప్పుడు బ్యాంకులన్నీ వసూళ్లపై సీరియస్‌గా దృష్టి పెట్టడం కూడా కంపెనీల పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. భారీగా ఎన్పీఏలు పేరుకుపోయిన టెలికం, స్టీల్, విద్యుత్ వంటి రంగాల్లో కొత్త ప్రాజెక్టులకు రుణాలిచ్చేందుకు బ్యాంకులు ముందుకొచ్చే పరిస్థితి కనబడటం లేదు. పాత ప్రాజెక్టుల రద్దు.. జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో ప్రాజెక్టుల పూర్తికి సంబంధించిన కార్యకలాపాలు కూడా మందకొడిగానే ఉన్నాయి. కేవలం రూ.లక్ష కోట్ల విలువైన ప్రాజెక్టులను మాత్రమే కంపెనీలు పూర్తిచేసి ప్రారంభించగలిగాయి. ఈ కాలంలో పూర్తయిన అతిపెద్ద ప్రాజెక్టు జిందాల్ స్టీల్ అండ్ పవర్(జేఎస్పీఎల్)కు చెందిన అంగుల్ స్టీల్ ప్లాంట్ ఫేజ్–1 కావడం విశేషం. దీని పెట్టుబడి విలువ రూ.33,000 కోట్లుగా అంచనా. ఇక రూ.14,000 కోట్ల పెట్టుబడితో తలపెట్టిన బెంగళూరు మెట్రో ఫేజ్–1 కూడా ఇదే క్వార్టర్లో పూర్తయి.. పట్టాలెక్కింది. అయితే, గతంలో ప్రకటించిన 52 కొత్త ప్రాజెక్టులు జూన్ త్రైమాసికంలో రద్దు కావడం గమనార్హం. ఇందులో ప్రధానంగా గుజరాత్లో తలపెట్టిన మిథివర్ది అణు విద్యుత్ ప్లాంట్ ఉంది. రూ.60,000 కోట్ల పెట్టుబడి అంచనాతో 6,000 మెగావాట్ల సామర్థ్యంతో ఎన్పీసీఐఎల్ దీన్ని నిర్మించాలని ప్రతిపాదించింది. అయితే, భూసేకరణ ఇతరత్రా సమస్యలతో దీన్ని పక్కనబెట్టింది. ఇక ఒడిశాలోని పారదీప్ వద్ద దక్షిణ కొరియా దిగ్గజం 12 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో పోస్కో ప్రతిపాదించిన స్టీల్‌ప్లాంట్ కూడా ఈ రద్దయిన జాబితాలో ప్రధానమైనదే. దీని పెట్టుబడి అంచనా రూ.50,000 కోట్లు. మొత్తంమీద మార్చి–జూన్ మధ్య రద్దయిన ప్రాజెక్టులకు సంబంధించిన పెట్టుబడుల విలువ రూ.2.4 లక్షల కోట్లుగా లెక్కతేలుతోంది. అదేవిధంగా వివిధ అడ్డంకుల కారణంగా రూ.2.4 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు జూన్ క్వార్టర్లో నిలిచిపోయాయి. జనవరి–మార్చిలో ఇలా నిలిచిపోయిన ప్రాజెక్టుల విలువ రూ.35,000 కోట్లు మాత్రమే. -
ట్యాబ్స్ విక్రయాలు 16 శాతం డౌన్
న్యూఢిల్లీ: ట్యాబ్లెట్స్ విక్రయాలు వార్షిక ప్రాతిపదికన జనవరి–మార్చి త్రైమాసికంలో 16 శాతం క్షీణతతో 7.6 లక్షల యూనిట్లకు తగ్గాయి. హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీలు ట్యాబ్లెట్స్‌కి ప్రచారం కల్పించకపోవడమే దీనికి కారణమని రీసెర్చ్ సంస్థ సీఎంఆర్ తెలిపింది. ఇక అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంతో పోలిస్తే జనవరి–మార్చి త్రైమాసికంలో ట్యాబ్లెట్స్ అమ్మకాలు 6 శాతంమేర క్షీణించాయని పేర్కొంది. ఇక డేటావిండ్ 34 శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో ఉందని తెలిపింది. దీని తర్వాతి స్థానాల్లో ఐబాల్ (16 శాతం), శాంసంగ్ (15 శాతం), మైక్రోమ్యాక్స్ (8 శాతం) ఉన్నాయని పేర్కొంది. ప్రభుత్వ రంగాల నుంచి ట్యాబ్లెట్స్కు డిమాండ్ ఉంటోందని సంస్థ తెలిపింది. -
జెట్ ఎయిర్వేస్కు చౌక ధరల దెబ్బ
న్యూఢిల్లీ: చౌక ధరల పోటీ, పెరిగిన ఇంధన ధరలు విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ ఫలితాలపై ప్రభావం చూపాయి. దీంతో జనవరి – మార్చి త్రైమాసికంలో లాభం ఏకంగా 95 శాతం తగ్గి రూ.23 కోట్లకు పరిమితమైంది. మార్చి త్రైమాసికంలో ఆదాయం రూ.5,728 కోట్లుగా నమోదైంది. ఇది అంతకుముందు ఏడాది ఇదే కాలంలో రూ.5,533 కోట్లుగా ఉంది. 2016–17 పూర్తి ఆర్థిక సంవత్సరంలో జెట్ ఎయిర్వేస్ కన్సాలిడేటెడ్ నికర లాభం భారీగా తగ్గి రూ.438.45 కోట్లకు పరిమితమైంది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో నికర లాభం రూ.1,211.65 కోట్లుగా ఉంది. -
మహింద్రా లాభం రూ. 725 కోట్లు
షేరుకు డివిడెండు రూ.13 ముంబై: ఆటోమొబైల్ దిగ్గజం మహింద్రా అండ్ మహింద్రా నికరలాభం 2017 మార్చితో ముగిసిన త్రైమాసికంలో 20 శాతం వృద్ధితో రూ. 725 కోట్లకు చేరింది. గతేడాది ఇదేకాలంలో కంపెనీ నికరలాభం రూ. 605 కోట్లు. ముగిసిన త్రైమాసికంలో ఆదాయం 4 శాతం వృద్ధితో రూ. 11,840 కోట్ల నుంచి రూ. 12,320 కోట్లకు పెరిగినట్లు కంపెనీ స్టాక్ ఎక్సే్ఛంజీలకు తెలిపింది. నాల్గవ త్రైమాసికంలో తమ వాహన విక్రయాలు ఫ్లాట్‌గా వున్నాయని, 1,30,778 యూనిట్లు విక్రయించినట్లు మహింద్రా పేర్కొంది. 2016–17 పూర్తి ఆర్థిక సంవత్సరంలో స్టాండెలోన్ ప్రాతిపదికన నికరలాభం 13 శాతం వృద్ధితో రూ. 3,204 కోట్ల నుంచి రూ. 3,965 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం రూ. 44,489 కోట్ల నుంచి రూ. 48,439 కోట్లకు పెరిగింది. మంగళవారం సమావేశమైన కంపెనీ డైరెక్టర్ల బోర్డు షేరుకు రూ. 13 చొప్పున డివిడెండు సిఫార్సుచేసింది. ఫలితాల నేపథ్యంలో మహింద్రా షేరు స్వల్ప పెరుగుదలతో రూ. 1,362 వద్ద ముగిసింది. ఈ ఏడాది బావుంటుంది... దేశీయ, అంతర్జాతీయ సానుకూల మార్కెట్ల కారణంగా 2017–18 ఆర్థిక సంవత్సరం గతేడాదితో పోలిస్తే ప్రోత్సాహకరంగా వుంటుందని మహింద్రా అంచనాల్లో పేర్కొంది. ప్రస్తుతం కొనసాగుతున్న రీమోనిటైజేషన్ ప్రక్రియకు తోడు బ్యాంకుల రుణ వడ్డీ రేట్లు తగ్గుతున్న కారణంగా అమ్మకాలు పెరుగుతాయని ఆశిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. యుటిలిటీ వాహన విభాగంలో మార్కెట్ వాటా పెంచుకోవడంపై దృష్టినిలిపినట్లు మహింద్రా మేనేజింగ్ డైరెక్టర్ పవన్ గోయింకా చెప్పారు. ఈ విభాగంలో ఒక కొత్త బ్రాండ్‌తో మోడల్‌ను ప్రవేశపెడతామని, కొన్ని ప్రస్తుత మోడల్స్‌లో మార్పుచేర్పులు చేసి విడుదల చేస్తామని ఆయన వివరించారు. -
హెచ్డీఎఫ్సీ బ్యాంకు లాభం 20% వృద్ధి
• క్యూ2లో రూ.3,455 కోట్లు • కలసి వచ్చిన రిటైల్ రుణాలు • 19% పెరిగిన నికర వడ్డీ ఆదాయం ముంబై: రిటైల్ రుణాలు కలసి రావడంతో ప్రైవేటు రంగ హెచ్డీఎఫ్సీ బ్యాంకు లాభం సెప్టెంబర్ త్రైమాసికంలో 20.4 శాతం వృద్ధి చెంది రూ.3,455 కోట్లకు చేరింది. గతేడాది ఇదే కాలంలో బ్యాంకు నికర లాభం రూ.2,869 కోట్లుగా ఉంది. ఆదా యం రూ.19,970 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే కాలంలో వచ్చిన రూ.17,324 కోట్లతో పోలిస్తే 15 శాతానికిపైగా వృద్ధి సాధించినట్టు తెలుస్తోంది. అధిక మార్జిన్లతో కూడిన రిటైల్ రుణాలు 22 శాతం వృద్ధి చెందడంతో నికర వడ్డీ ఆదాయం భారీగా పెరిగింది. నికర వడ్డీ ఆదాయం ఈ త్రైమాసికంలో 19.6 శాతం పెరిగి రూ.7,993 కోట్లకు చేరింది. బ్యాంకు నికర వడ్డీ మార్జిన్ 4.2 శాతంగా ఉంది. రిటైల్ రుణాల కారణంగా బ్యాంకు మొత్తం రుణాలు గతేడాది ఇదే కాలంలో పోలిస్తే 18.1 శాతం వృద్ధి చెందినట్టు హెచ్డీఎఫ్సీ బ్యాంకు తెలిపింది. బ్యాంకు ఇతర ఆదాయం సైతం 13.7 శాతం పెరిగి రూ.2,901 కోట్లుగా నమోదైంది. స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్పీఏలు) మొత్తం రుణాల్లో 0.90 శాతం నుంచి రూ.1.02 శాతానికి పెరిగాయి. వీటికి చేసిన కేటాయింపులు రూ.749 కోట్లుగా ఉన్నాయి. సెప్టెంబర్‌తో ముగిసిన ఆరు నెలల కాలానికి చూసుకుంటే బ్యాంకు నికర లాభం 20.3 శాతం పెరిగి రూ.6,694 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో లాభం రూ.5,565 కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయం కూడా రూ.33,827 కోట్ల నుంచి రూ.39,293 కోట్లకు చేరుకుంది. -
గల్ఫ్ ఆయిల్ లూబ్రికెంట్స్ లాభం 28% వృద్ధి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో గల్ఫ్ ఆయిల్ రూ. 274 కోట్ల నికర ఆదాయంపై రూ. 30 కోట్ల నికర లాభం ప్రకటించింది. క్రితం క్యూ2లో ఆదాయం రూ. 249 కోట్లు కాగా లాభం రూ. 24 కోట్లు. తాజా రెండో త్రైమాసికంలో లాభం 28 శాతం వృద్ధి చెందినట్లు కంపెనీ తెలిపింది. సాధారణంగా జూలై-సెప్టెంబర్ మధ్య కాలంలో వర్షాల కారణంగా వాహనాల వినియోగం తగ్గుతుందని, అయినా అమ్మకాల్లో రెండంకెల స్థాయి వృద్ధి సాధించగలిగామని పేర్కొంది. -
టాటా స్టీల్ నష్టం రూ.3,183 కోట్లు
ఆదాయం 6 శాతం తగ్గుదల న్యూఢిల్లీ: ఉక్కు దిగ్గజం టాటా స్టీల్ నష్టాలు మరింత తీవ్రతరమయ్యాయి. ఈ ఏడాది జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం(2016-17, క్యూ1)లో కంపెనీ కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన(యూరప్ ఇతరత్రా కార్యకలాపాలు కలిపి) రూ.3,183 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో నష్టం రూ.316 కోట్లతో పోలిస్తే దాదాపు 10 రెట్లు పెరిగింది. కాగా, క్యూ1లో కంపెనీ మొత్తం ఆదాయం 6 శాతం దిగజారి రూ.26,406 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే క్వార్టర్లో ఆదాయం రూ.28,025 కోట్లు. ప్రధానంగా లాంగ్స్టీల్ యూకే లిమిటెడ్‌ను రూ.3,296 కోట్ల నష్టానికి గ్రేబుల్ క్యాపిటల్ ఎల్ఎల్పీకి విక్రయించడం, దీన్ని తొలి త్రైమాసికంలో నమోదుచేయడం కారణంగా భారీ నష్టాలను చవిచూడాల్సి వచ్చిందని కంపెనీ తెలిపింది. దీన్ని మినహాయించి ప్రస్తుతం కొనసాగుతున్న వ్యాపారాన్ని పరిగణనలోకి తీసుకుంటే టాటా స్టీల్ గ్రూప్ ఈ ఏడాది క్యూ1లో రూ.172 కోట్ల లాభాన్ని నమోదు చేసిందని, చాలా త్రైమాసికాల తర్వాత తొలిసారి మెరుగైన పనితీరును సాధించినట్లు కంపెనీ వెల్లడించింది. కాగా, భారత్, ఆగ్నేయాసియా యూరప్ కార్యకలాపాల పనితీరు మెరుగుపడటంతో నిర్వహణ లాభం క్యూ1లో 21 శాతం పెరిగింది. మరోపక్క, కంపెనీ మొత్తం వ్యయాలు రూ.26,680 కోట్ల నుంచి రూ.24,406 కోట్లకు దిగిరావడం గమనార్హం. ఎగబాకిన రుణ భారం: టాటా స్టీల్ స్థూల రుణ భారం క్యూ1లో రూ.85,475 కోట్లకు ఎగబాకింది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్లో ఇది రూ.81,975 కోట్లు. ఇక నికర రుణ భారం రూ.4,171 కోట్లు పెరిగి రూ.75,259 కోట్లకు చేరింది. భారత్‌లో కొత్తగా చేపట్టిన రుణ సమీకరణ(బాండ్ల జారీ రూపంలో), అంతర్జాతీయంగా కొనుగోళ్లు(ప్రొక్యూర్మెంట్) వంటివి రుణ భారం పెరిగేందుకు దారితీసింది. కాగా, ప్రస్తుతం తమ వద్ద రూ.12,746 కోట్ల నగదు నిల్వలు ఉన్నట్లు టాటా స్టీల్ వెల్లడించింది. ఇక ఈ ఏడాది ఏప్రిల్-జూన్ కాలంలో 5.41 మిలియన్ టన్నుల స్టీల్ అమ్మకాలను నమోదు చేసినట్లు తెలిపింది. జూన్ క్వార్టర్లో కంపెనీ మొత్తం రూ.2,442 కోట్ల పెట్టుబడులు పెట్టింది. ఇందులో భారత్‌లో కార్యకలాపాల విస్తరణకు రూ.1,118 కోట్లను వెచ్చించింది. యూరప్ యూనిట్ల అమ్మకంపై దృష్టి: స్పెషాలిటీ స్టీల్ వ్యాపారంతోపాటు హార్టెల్పూల్లో ఉన్న పైప్ మిల్స్‌ను విక్రయించే ప్రక్రియ కొనసాగుతోందని టాటా స్టీల్ వివరించింది. ఇక టాటా స్టీల్ యూరప్ విభాగం కూడా జాయింట్ వెంచర్ లేదా వ్యూహాత్మక భాగస్వామ్యం కోసం చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే ఇది ఒక కొలిక్కివస్తుందని పేర్కొంది. యూరోపియన్ యూనియన్(ఈయూ) నుంచి వైదొలగిన నేపథ్యంలో బ్రిటన్ వృద్ధి రేటుపై కొంత ప్రతికూల ప్రభావం ఉండొచ్చని.. ఈ నేపథ్యంలో ఇక్కడి తమ కార్యకలాపాలు గాడిలోపడేందుకు వ్యవధి పడుతుందని టాటా స్టీల్ అంచనా వేసింది. ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు ధర సోమవారం బీఎస్ఈలో 5.3 శాతం దిగజారి రూ.373.60 వద్ద ముగిసింది. మార్కెట్ క్యాప్ రూ.36,285 కోట్లకు తగ్గింది. -
5 కోట్లకు చేరువలో ఎంఎఫ్ ఖాతాలు
ముంబై: దేశంలో మ్యూచువల్ ఫండ్స్ (ఎంఎఫ్) ఇన్వెస్టర్ ఖాతాలు 5 కోట్లకు చేరువలో ఉన్నాయి. జూన్ త్రైమాసికం చివరకి ఎంఎఫ్ ఖాతాల సంఖ్య కొత్తగా 12.61 లక్షలు పెరిగింది. దీంతో మొత్తం ఖాతాల సంఖ్య 4.89 కోట్లకు ఎగసింది. ఈ వివరాలను మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ సమాఖ్య యాంఫీ వెల్లడించింది.