
స్పైస్ జెట్ లాభం 16శాతం అప్
న్యూఢిల్లీ: ఏవియేషన్ కంపెనీ స్పైస్ జెట్ కన్సాలిడేటెడ్ నికరలాభం 2017 జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో 16 శాతం వృద్ధిచెంది రూ. 149 కోట్ల నుంచి రూ. 173 కోట్లకు పెరిగింది. కంపెనీ మొత్తం ఆదాయం రూ. 1,544 కోట్ల నుంచి రూ. 1,890 కోట్లకు చేరింది. ఫలితాల సందర్భంగా స్పైస్ జెట్ షేరు 5 శాతం పతనమై రూ. 119 వద్ద ముగిసింది.