ట్యాబ్స్‌ విక్రయాలు 16 శాతం డౌన్‌ | India Tablet Sales Declined 16 Percent in March Quarter: CMR | Sakshi
Sakshi News home page

ట్యాబ్స్‌ విక్రయాలు 16 శాతం డౌన్‌

Published Tue, Jun 13 2017 12:30 AM | Last Updated on Tue, Sep 5 2017 1:26 PM

ట్యాబ్స్‌ విక్రయాలు  16 శాతం డౌన్‌

ట్యాబ్స్‌ విక్రయాలు 16 శాతం డౌన్‌

న్యూఢిల్లీ: ట్యాబ్లెట్స్‌ విక్రయాలు వార్షిక ప్రాతిపదికన జనవరి–మార్చి త్రైమాసికంలో 16 శాతం క్షీణతతో 7.6 లక్షల యూనిట్లకు తగ్గాయి. హ్యాండ్‌సెట్స్‌ తయారీ కంపెనీలు ట్యాబ్లెట్స్‌కి ప్రచారం కల్పించకపోవడమే దీనికి కారణమని రీసెర్చ్‌ సంస్థ సీఎంఆర్‌ తెలిపింది. ఇక అక్టోబర్‌–డిసెంబర్‌ త్రైమాసికంతో పోలిస్తే జనవరి–మార్చి త్రైమాసికంలో ట్యాబ్లెట్స్‌ అమ్మకాలు 6 శాతంమేర క్షీణించాయని పేర్కొంది.

ఇక డేటావిండ్‌ 34 శాతం మార్కెట్‌ వాటాతో అగ్రస్థానంలో ఉందని తెలిపింది. దీని తర్వాతి స్థానాల్లో ఐబాల్‌ (16 శాతం), శాంసంగ్‌ (15 శాతం), మైక్రోమ్యాక్స్‌ (8 శాతం) ఉన్నాయని పేర్కొంది. ప్రభుత్వ రంగాల నుంచి ట్యాబ్లెట్స్‌కు డిమాండ్‌ ఉంటోందని సంస్థ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement