జెట్ ఎయిర్‌వేస్‌కు చౌక ధరల దెబ్బ
న్యూఢిల్లీ: చౌక ధరల పోటీ, పెరిగిన ఇంధన ధరలు విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్ ఫలితాలపై ప్రభావం చూపాయి. దీంతో జనవరి – మార్చి త్రైమాసికంలో లాభం ఏకంగా 95 శాతం తగ్గి రూ.23 కోట్లకు పరిమితమైంది. మార్చి త్రైమాసికంలో ఆదాయం రూ.5,728 కోట్లుగా నమోదైంది. ఇది అంతకుముందు ఏడాది ఇదే కాలంలో రూ.5,533 కోట్లుగా ఉంది. 2016–17 పూర్తి ఆర్థిక సంవత్సరంలో జెట్ ఎయిర్‌వేస్ కన్సాలిడేటెడ్ నికర లాభం భారీగా తగ్గి రూ.438.45 కోట్లకు పరిమితమైంది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో నికర లాభం రూ.1,211.65 కోట్లుగా ఉంది.