సైయంట్‌ లాభం రూ.88 కోట్లు | Cyient Q1FY18 consolidated net profit rises 10.4% qoq | Sakshi
Sakshi News home page

సైయంట్‌ లాభం రూ.88 కోట్లు

Published Fri, Jul 14 2017 12:44 AM | Last Updated on Tue, Sep 5 2017 3:57 PM

సైయంట్‌ లాభం రూ.88 కోట్లు

సైయంట్‌ లాభం రూ.88 కోట్లు

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఐటీ ఇంజనీరింగ్‌ సేవల సంస్థ సైయంట్‌ 2017–18 ఏడాది జూన్‌ త్రైమాసికం కన్సాలిడేటెడ్‌ ఫలితాల్లో క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే నికర లాభం 18.7% అధికమై రూ.87.8 కోట్లు నమోదు చేసింది. 2016–17 జూన్‌ త్రైమాసికంలో కంపెనీ రూ.74 కోట్ల నికర లాభం పొందింది. క్రితంతో పోలిస్తే టర్నోవర్‌ రూ.8.6% అధికమై రూ.907 కోట్లకు ఎగసింది.

నిర్వహణ లాభం క్రితం ఏడాదితో పోలిస్తే 6.5% పెరిగి రూ.116 కోట్లుగా ఉంది. 2017–18లో డిజైన్‌ ఆధారిత తయారీ విభాగం 20% వృద్ధి నమోదు చేస్తుందని కంపెనీ భావిస్తోంది. బీఎస్‌ఈలో గురువారం కంపెనీ షేరు ధర 1.36% తగ్గి రూ.515.60 వద్ద స్థిరపడింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement