హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మార్చి త్రైమాసికంలో సైయంట్ నికరలాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 14 శాతం ఎగసి రూ.176 కోట్లు సాధించింది. ఎబిటా రూ.249 కోట్లు, ఎబిటా మార్జిన్ 14.2 శాతం నమోదైంది.
గ్రూప్ ఆదాయం 48 శాతం అధికమై రూ.1,751 కోట్లకు చేరుకుంది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో నికరలాభం 8.2 శాతం పెరిగి రూ.565 కోట్లు దక్కించుకుంది. గ్రూప్ టర్నోవర్ 32.7 శాతం దూసుకెళ్లి రూ.6,016 కోట్లను తాకింది. మొత్తం డివిడెండ్ ఇప్పటి వరకు అత్యధికంగా ఒక్కో షేరుకు రూ.26కు చేరడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment