న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ప్రయివేట్ రంగ సంస్థ సౌత్ ఇండియన్ బ్యాంక్(ఎస్‌ఐబీ) ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం భారీగా దూసుకెళ్లి రూ. 115 కోట్లను అధిగమించింది. గతేడాది(2021–22) క్యూ1లో రూ. 10 కోట్లు మాత్రమే ఆర్జించింది. అయితే గతేడాది క్యూ4లో నమోదైన రూ. 272 కోట్లతో పోలిస్తే లాభం 57 శాతం క్షీణించింది.
మొత్తం ఆదాయం రూ. 2,084 కోట్ల నుంచి రూ. 1,868 కోట్లకు వెనకడుగు వేసింది. ఇందుకు వడ్డీ, ఇతర ఆదాయాలు తగ్గడం కారణమైంది. వడ్డీ ఆదాయం స్వల్పంగా తగ్గి రూ. 1,622 కోట్లకు పరిమితంకాగా.. ఇతర ఆదాయం 45 శాతం పడిపోయి రూ. 246 కోట్లకు చేరింది. అయితే స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 8.02 శాతం నుంచి 5.87 శాతానికి తగ్గాయి. నికర ఎన్‌పీఏలు సైతం 5.05 శాతం నుంచి 2.87 శాతానికి దిగివచ్చాయి. మొత్తం ప్రొవిజన్లు సైతం రూ. 496 కోట్ల నుంచి రూ. 139 కోట్లకు తగ్గాయి. ఫలితాల నేపథ్యంలో సౌత్ ఇండియన్ బ్యాంక్ షేరు బీఎస్‌ఈలో 0.25 శాతం బలపడి రూ. 7.87 వద్ద ముగిసింది.
చదవండి: Stock Market: అమెరికా ఫెడ్ రిజర్వ్ అంచనాలు.. రెండో రోజు అదే తీరు!
Comments
Please login to add a commentAdd a comment