ముంబై: సౌత్ ఇండియన్ బ్యాంక్ సెప్టెంబర్ క్వార్టర్లో రూ.70 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.4.3 కోట్ల నికర లాభం వచ్చిందని బ్యాంక్ తెలిపింది. ఈ క్యూ2లో నికర లాభం 16 రెట్లు పెరిగిందని పేర్కొంది. గత క్యూ2లో రూ.1,817 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ2లో రూ.1,855 కోట్లకు పెరిగిందని తెలిపింది.
స్థూల మొండి బకాయిలు 3.57 శాతం నుంచి 4.61 శాతానికి, నికర మొండి బకాయిలు 2.57 శాతం నుంచి 3.16 శాతానికి పెరిగాయని వివరించింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో బ్యాంక్ షేర్ 0.3 శాతం పడింది.
Comments
Please login to add a commentAdd a comment