
ప్రతీకాత్మకచిత్రం
సాక్షి, బెంగళూరు: నగరంలోని కెంగేరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ రిసార్టులో ఈ నెల 27వ తేదీ అర్ధరాత్రి నైట్ కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించి పార్టీ చేసుకుంటున్న టీవీ నటులపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీరియళ్లలో నటించే రక్షిత్–అనూషా దంపతులు, ఇతరులు అభిషేక్, రంజన్, రాకేశ్, రవిచంద్రన్‌లు అర్ధరాత్రి 1.30 సమయంలో మద్యం మత్తులో చిందులేస్తుండగా పోలీసులు వెళ్లి అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
చదవండి: (భార్య మృతితో భర్త ఆత్మహత్య)