
లక్నో : కరోనా వైరస్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయా రాష్ట్రాలు నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్ లో లాక్‌డౌన్‌ను ఉల్లఘించిన 288 మందిని తాత్కాలికంగా ఏర్పాటు చేసిన జైళ్లలో పెట్టినట్లు అక్కడి జైళ్లశాఖ అధికారులు పేర్కొన్నారు. లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలు తీసుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 34 తాత్కాలిక జైళ్లను ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు జైళ్లలో పెట్టిన 288 మందిలో 156 మంది విదేశీయులు ఉండగా, 132 మంది భారతీయులు ఉన్నారు. జైళ్లో పెట్టిన విదేశీయుల్లో మలేషియా, కిర్గిస్తాన్, కజకిస్తాన్, బంగ్లాదేశ్, ఇండోనేషియా, సుడాన్, థాయిలాండ్‌కు చెందిన వారు ఉన్నారు. అయితే వీరందరిని ఎంతకాలం జైళ్లో ఉంచుతారనేది తెలియాల్సి ఉంది.
(కరోనా: అప్పుడు మాకు దిక్కెవరు?)