
సాక్షి, విజయవాడ: కోవిడ్ నిబంధనలు పాటించని వారిపై విజయవాడ నగర పోలీసులు కొరడా జులిపిస్తున్నారు. సోమవారం రోజున రామవరప్పాడులో ట్రాఫిక్ ఏడీసీపీ రవిచంద్ర స్పెషల్‌డ్రైవ్ నిర్వహించారు. మాస్కులు లేకుండా తిరుగుతున్న వారికి పోలీసులు జరిమానా విధించి మాస్కులు ఇచ్చారు. ఈ సందర్భంగా ఏడీసీపీ రవిచంద్ర మాట్లాడుతూ.. నెల రోజుల్లో మాస్కులు లేకుండా తిరుగుతున్న 10,805 మందిపై కేసులు నమోదు చేశాము. మొత్తంగా వారికి రూ. 8,83,600 జరిమానా విధించాము. కరోనా కట్టడికి ప్రభుత్వ నిబంధనలను ప్రతిఒక్కరూ పాటించాలి. నిర్లక్ష్యం వహించిన వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తాము' అని రవిచంద్ర పేర్కొన్నారు. (పరిశ్రమలతో పాటు భద్రత ముఖ్యం: సీఎం జగన్)