
సాక్షి, అనంతపురం : ఎన్టీఆర్ జయంతి సందర్భంగా జిల్లాలోని శింగనమలలో టీడీపీ నేతలు లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లఘించారు. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని స్థానిక టీడీపీ నేతలైన బండారు శ్రావణి, ఎంఎస్ రాజు తమ బలం నిరూపించేందుకు పోటాపోటీగా జయంతి సమావేశాలు నిర్వహించారు. ఎంఎస్ రాజు ఆధ్వర్యంలో శింగనమల టీడీపీ కార్యాలయంలో నిర్వహించగా.. రామాలయంలో బండారు శ్రావణి రాజుకు పోటీగా సమావేశం ఏర్పాటు చేశారు. అయితే వీరువురు ఏర్పాటు చేసిన సమావేశాలకు హాజరైన టీడీపీ కార్యకర్తలు కనీస భౌతికదూరం పాటించకుండా గుంపులుగా ఒకేచోట చేరి కేక్ కట్ చేయడం గమనార్హం. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ నిబంధనలు అతిక్రమించిన టీడీపీ కార్యకర్తలపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. (ఎల్లో మీడియా తప్పుడు వార్తలు: మోపిదేవి)
Comments
Please login to add a commentAdd a comment