
వాగ్వాదానికి దిగిన టీడీపీ నేతలు
కుప్పం: కోవిడ్ –19 ఎఫెక్ట్‌తో నాయీబ్రాహ్మణులు ఇబ్బంది పడుతున్నారు. టీడీపీ నాయకులు సాయం చేయలేదు. వైఎస్సార్ సీపీ నేతలు సాయం చేస్తుంటే విమర్శిస్తారా అంటూ టీడీపీ అనుబంధ నాయీ బ్రాహ్మణ సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో నాయీబ్రాహ్మణ సంఘం నాయకులు శాంతారామ్ మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ నేతలు అందించిన సహాయానికి అమ్ముడు పోతారా అని విమర్శించారు. దీంతో అక్కడే ఉన్న పలువురు నాయీ బ్రాహ్మణులు వాదోపవాదానికి దిగారు. బియ్యం, పప్పుకు ఎవరూ అమ్ముడు పోలేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment