
సాక్షి, అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కరోనా కట్టడి చేసేందుకు రాష్ట్రంలో కొన్ని ఆంక్షలు అమలవుతున్నాయి. ప్రస్తుతం కోవిడ్ నిబంధనల అమలుతో పరిమిత సంఖ్యలో వివాహాలకు అనుమతిస్తున్నారు. ఈ క్రమంలో మడకశిర నియోజకవర్గంలోని అమలాపురంలో టీడీపీ నేత కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఈరన్న తన కూతురు వివాహాన్ని భారీ జన సందోహం మధ్య జరిపించారు. దీంతో మాజీ ఎమ్మెల్యే ఈరన్నపై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.