నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్‌ | auto driver returns passenger bag in police station | Sakshi
Sakshi News home page

నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్‌

Published Tue, Jul 11 2017 7:27 AM | Last Updated on Sun, Apr 7 2019 3:23 PM

వేముల రాజు - Sakshi

వేముల రాజు

బోడుప్పల్‌: ప్రయాణికురాలు ఆటోలో మరిచిపోయిన బ్యాగ్‌ను మేడిపల్లి పోలీస్‌ స్టేషన్‌లో అప్పజెప్పి ఓ ఆటో డ్రైవర్‌ నిజాయితీ చాటుకున్నాడు. మేడిపల్లి పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నారాపల్లి ఎంఎస్‌ఆర్‌ కాలనీకి చెందిన వేముల రాజు (33)ఆటో డ్రైవర్‌గా పని చేసేవాడు. ఆదివారం రాత్రి అంబర్‌పేటలో ఓ మహిళ (40) అతని ఆటో ఎక్కి ఉప్పల్‌లోని రేణుక వైన్స్‌ వద్ద దిగి వెళ్లింది. ఆ తరువాత ఇంటికి వెళ్లిన రాజు తన ఆటోలో చూసుకోగా బ్యాగ్‌ కనిపించింది.

బ్యాగు తీసి పరిశీలించగా అందులో రూ 37,080 నగదు, కొన్ని డాక్యుమెంట్‌లు ఉన్నా యి. దీంతో అతను నేరుగా మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని పోలీసులకు బ్యాగ్‌ను అప్పగించాడు. పోలీసులు ఆ ఆటో డ్రైవర్‌ను అభినందించారు. బాధితురాలు మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని పోలీసులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement