![Honest Auto Driver Returns Bag With Gold Jewellery To Owner - Sakshi](/styles/webp/s3/article_images/2021/03/9/AUTO.jpg.webp?itok=yM3pH2o-)
మహిళకు బ్యాగ్ అందజేస్తున్నఆటో డ్రైవర్
కొణిజర్ల: ఓ మహిళ ఆటోలో మర్చిపోయిన బ్యాగ్‌ను ఆటో డ్రైవర్ తిరిగి అప్పగించి నిజాయితీ చాటుకున్నాడు. ఎస్‌ఐ గండికోట మొగిలి కథనం ప్రకారం.. ఖమ్మానికి చెందిన తేజావత్ శైలజ సోమవారం మధ్యాహ్నం ఖమ్మం నుంచి తన అమ్మమ్మ గారి ఊరైన కొణిజర్ల మండలం అమ్మపాలెం వెళ్లేందుకు ఆటోలో బయలుదేరింది. తనికెళ్ల వద్ద దిగి అమ్మపాలెం వెళ్లే క్రమంలో తన బ్యాగు ఆటోలో మర్చిపోయి వెళ్లిపోయింది.
ఆమె బ్యాగులో రెండు తులాల బంగారపు గొలుసు, పుస్తెల తాడు, చెవిదిద్దులు, బంగారపు ఉంగారాలు ఉన్నాయి. దీంతో కొణిజర్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అదే సమయంలో తనికెళ్లకు చెందిన ఆటో డ్రైవర్ డేరంగుల రవీందర్‌బాబు తన ఆటోలో మర్చిపోయిన బ్యాగును ఠాణాలోఅప్పగించాడు. సదరు బ్యాగును ఎస్‌ఐ సమక్షంలో శైలజకు అందించాడు. డ్రైవర్ నిజాయితీని ఎస్‌ఐ మొగిలి అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment