సాక్షి, ఖమ్మం : కొత్త ఆకులు చిగురించే వేళ అడవిలో కాయలు, పండ్లు లేక అల్లాడుతున్న కోతుల ఆకలి తీరుస్తున్నారు ఇల్లెందుకు చెందిన ఆటో డ్రైవర్ రాజ్‌కుమార్ (చిన్ను). భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం – ఇల్లెందు ప్రధాన రహదారి వెంట సాత్ నంబర్, ఆట్ నంబర్‌గా పిలుచుకునే అటవీ ప్రాంతంలో రోడ్డు వెంట తచ్చాడుతున్న వానరాలకు వారానికి రెండు, మూడుసార్లు ఆహారాన్ని అందిస్తున్నారు. అరటిపండ్లు, కూరగాయలు, బియ్యం, శనగపప్పు వేస్తూ వాటి కడుపు నింపుతున్నారు. లాక్‌డౌన్ తీవ్రంగా ఉన్నప్పుడు కోతులు ఆకలితో రహదారి పక్కన కవర్లు, ఇతర సంచులు తెరచి చూస్తుండడండడం, నీరసంతో కనిపించడం కలచివేసిందని, అందుకే రెండు నెలలుగా తన వంతుగా ఇలా చేస్తున్నానని ఆయన తెలిపారు. మానవత్వం చాటేలా ఆహారాన్ని అందిస్తున్న దృశ్యాలను ‘సాక్షి’ కెమెరా ఇదిగో ఇలా క్లిక్‌మనిపించింది.
Comments
Please login to add a commentAdd a comment