![Auto driver shows his honesty in karnataka - Sakshi](/styles/webp/s3/article_images/2018/01/10/auto-driver.jpg.webp?itok=cDoA344c)
సాక్షి, బనశంకరి: రోడ్డుపైన పదిరూపాయల నోటు పడితే ఎవరూ చూడకుండా నొక్కేసే రోజులివి. అయితే ప్రయాణికుడు మరచిపోయిన రూ.2లక్షల నగదు సంచిని సొంతదారుడికి అప్పగించి ఓ ఆటో డ్రైవర్ నిజాయితీకి నిలువెత్తు రూపంగా నిలిచాడు. ఈఘటన బుధవారం కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో చోటుచేసుకుంది. శివాజీనగనర చర్చ్‌లో పనిచేసే దివ్య చర్చ్‌కు సంబంధించిన రూ.15 లక్షల నగదును బ్యాంకులో డిపాజిట్ చేయడానికి మంగళవారం సాయంత్రం ఆటోడ్రైవరు సుహేల్‌బాషా ఆటోలో ఇన్‌ప్యాంట్రీరోడ్డు వరకు వెళ్లింది.
ఈక్రమంలో రూ.2 లక్షల నగదు ఆటోలోనే మరచిపోయింది. నగదు గల్లంతైన ఘటపై కమర్షియల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఇదిలా ఉండగా బుధవారం ఉదయం ఆటో డ్రైవర్ సుహేలబాషా తన వాహనంలో రూ.2 లక్షల నగదు సంచిని గమనించి పోలీస్‌కమిషనర్ కార్యాలయంలో అప్పగించాడు. అధికారులు స్పందించి బాధితురాలిని కమిషనర్ కార్యాలయానికి రప్పించి నగదు అందజేశారు. నిజాయితీగా వ్యవహరించిన ఆటోడ్రైవర్‌కు దివ్య కృతజ్ఞతలు తెలిపారు.
, ,
Comments
Please login to add a commentAdd a comment