శభాష్‌.. రాజేష్‌ | HONEST AUTO DRIVER | Sakshi
Sakshi News home page

శభాష్‌.. రాజేష్‌

Published Sat, Aug 20 2016 1:12 AM | Last Updated on Mon, Sep 4 2017 9:58 AM

శభాష్‌.. రాజేష్‌

శభాష్‌.. రాజేష్‌

నిడదవోలు : ఆటోవాలా నిజాయితీకి అభినందనలు వెల్లువెత్తాయి. తన ఆటోలో ప్రయాణికుడు మరిచిపోయిన ఆరు కాసుల బంగారు నెక్లెస్‌ ఉన్న బ్యాగ్‌ను నిజాయతీగా పోలీసులకు అప్పగించి శభాష్‌ అనిపించుకున్నాడు. కొవ్వూరు మండలం బంగారంపేటకు చెందిన ఆటో డ్రైవర్‌ దాసరి రాజేష్‌ కిరాయికోసం శుక్రవారం నిడదవోలు బయలుదేరాడు. మార్గమధ్యలో సమిశ్రగూడెం వద్ద విజయవాడ పుష్కరాలకు బయలుదేరిన ఆకుల శ్రీనివాస్‌ కుటుంబ సభ్యులను ఎక్కించుకున్నాడు. వారు నిడదవోలు బస్టాండ్‌ సెంటర్‌లో ఆటోదిగారు. అక్కడి నుంచి రైల్వేస్టేçÙన్‌కు నడిచివెళుతుండగా ఆటోలో నెక్లెస్‌ బ్యాగ్‌ మరిచిపోయినట్టు గుర్తించారు. స్థానిక పోలీస్‌స్టేçÙన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. బస్టాండ్‌ వద్ద ప్రయాణికులను దింపిన ఆటో డ్రైవర్‌ రాజేష్‌ కిరాయి కోసం రాజమండ్రి వెళ్లాడు. తిరిగి బంగారంపేట చేరుకున్నాడు. అప్పుడు ఆటోలో బ్యాగ్‌ ఉన్నట్టు గుర్తించి నిడదవోలు పోలీస్‌స్టేçÙన్‌ వద్దకు వచ్చాడు. పోలీసులు బ్యాగ్‌ తెరచి చూడగా విలువైన బంగారు ఆభరణాలు ఉన్నాయి. పోలీసులు బ్యాగ్‌ మరిచిపోయిన ఆకుల శ్రీనివాస్‌కు ఫోన్‌ చేసి రప్పించి రాజేష్‌ సమక్షంలో అప్పగించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement