![Man Shows Honesty Returns Bag That Contain Gold At Shivamogga - Sakshi](/styles/webp/s3/article_images/2022/10/13/gold.jpg.webp?itok=Es5QcVfr)
గురురాజ్‌కు పాదాభివందనం చేస్తున్న అర్పిత భర్త
సాక్షి, బెంగళూరు: తనకు దొరికిన నగల బ్యాగ్‌ను సొంతదారుకు అప్పగించి ఓ కోర్టు ఉద్యోగి నిజాయితీ చాటాడు. శివమొగ్గ వినోబా నగరానికి చెందిన అర్పిత చింతామణిలో బంధువుల ఇంటిలో పెళ్లికి వెళ్తూ ఈక్రమంలో శివమొగ్గ రైల్వే స్టేషన్‌లో బ్యాగ్‌ను పోగొట్టుకుంది. పనిపై శివమొగ్గకు వెళ్లిన తుమకూరు కోర్టు ఫస్ట్‌క్లాస్ అసిస్టెంట్ గురురాజ్‌కు ఆ బ్యాగ్ దొరికింది. అంతలోనే రైలు రావడంతో బ్యాగ్‌తో తుమకూరు చేరుకొని పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
నగల బ్యాగును అందజేస్తున్న గురురాజ్
అర్పితా కూడా బ్యాగ్ మిస్ అయినట్లు శివమొగ్గ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది. బ్యాగ్ దొరికిందని తెలియడంతో అర్పితా కుటుంబం తుమకూరు తాలూకా వక్కోడికి రాగా గురురాజ్ దంపతులు నగల బ్యాగ్ అందజేశారు. అర్పితా కుటుంబ సభ్యులు గురురాజ్ దంపతుల కాళ్లకు నమస్కరించి బ్యాగును స్వీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment