సినిమాల్లో నిజాయితీ పనికిరాదు: సోనమ్ కపూర్ | Honesty not appreciated in film industry, says Sonam Kapoor | Sakshi
Sakshi News home page

సినిమాల్లో నిజాయితీ పనికిరాదు: సోనమ్ కపూర్

Published Sat, Mar 15 2014 12:32 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

సినిమాల్లో నిజాయితీ పనికిరాదు: సోనమ్ కపూర్ - Sakshi

సినిమాల్లో నిజాయితీ పనికిరాదు: సోనమ్ కపూర్

స్వేచ్ఛ కోసం పరితపించే సోనమ్ కపూర్.. ఇక మీదట మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలని తెలుసుకుంది. తాము చేసిన ప్రకటనలను తిప్పితిప్పి కావల్సినట్లు ఉపయోగించుకుంటారని ఇప్పుడు అంటోంది. సోనమ్ కపూర్ చేసిన బికినీ షాట్ వల్ల 'బేవకూఫియా' సినిమాకు మంచి ఓపెనింగ్స్ వస్తాయని ఆమె తండ్రి అనిల్ కపూర్ ఇటీవల అన్నాడు. అయితే, ''నాన్న ఎప్పుడూ అలా అనలేదు. ఆ ప్రెస్మీట్లో సినిమాకు మంచి ఓపెనింగ్స్ వస్తాయని మా నాన్న అన్నట్లు నేను చెప్పానంతే. కానీ మర్నాడు పేపర్లలో చూస్తే నా బికినీ షాట్ ప్రధాన శీర్షికలలో కనిపించింది'' అని సోనమ్ వాపోయింది.

దాంతో ఇకమీదట ఏం మాట్లాడాలన్నా జాగ్రత్తగా ఉండాలని తెలుసుకున్నట్లు చెప్పింది. తాను చెప్పిన విషయాల్లో చాలా వరకు అనువాద లోపం వల్ల రాకుండా పోయాయని, అయినా ఈ పరిశ్రమలో అసలు నిజాయితీ అన్నదే పనికిరాదని సోనమ్ తెలిపింది. సాధారణంగా స్క్రిప్టు డిమాండు చేయడం వల్లనో, డైరెక్టర్ చెప్పారనో తాను బికినీ వేసుకున్నట్లు హీరోయిన్లు తరచు చెబుతుంటారు. కానీ, సోనమ్ మాత్రం తనంతట తానే ఆ నిర్ణయం తీసుకున్నట్ల చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement