పిజ్జా ఆర్డర్ చేస్తే.. నోట్ల కట్ట వచ్చింది!
సాధారణంగా ఏదైనా వస్తువు ఆర్డర్ చేసినప్పుడు అది మనకు సకాలంలో రాకపోతే ఎంతో చిరాకు పడుతుంటాం. అయితే తనకు వచ్చిన పార్శిల్ చాలా ఆలస్యంగా వచ్చినా ఓ మహిళా కస్టమర్ ఓపిక పట్టింది. అయితే ఆ ఆర్డర్ లో తనకు కావాల్సిన వస్తువు లేదు.. అంతకంటే ఆశ్చర్యం ఏంటంటే.. ఐదు వేల డాలర్ల విలువైన నోట్లు ఉన్నాయి. ఈ విషయాలన్ని ఆ సంస్థకు చెప్పి, డబ్బు వెనక్కు తీసుకోవాలని సూచించింది. ఆమె నిజాయితీని మెచ్చిన ఆ సంస్థ కస్టమర్ కు ఓ ఏడాది పాటు పిజ్జా ఫ్రీగా అందిస్తామంటూ ప్రకటించింది.
కాలిఫోర్నియాకు చెందిన సెలెనా అవలోస్ ఓ రోజు డోమినోస్ కు ఫోన్ చేసి పిజ్జా ఆర్డర్ చేసింది. అయితే తనకు రావాల్సిన పిజ్జా కాస్త ఆలస్యంగా వచ్చింది. పార్శిల్ ఓపెన్ చూసి చూడగా పిజ్జా బదులుగా ఐదువేల డాలర్ల నగదు ఉన్నట్లు గుర్తించింది. కస్టమర్ సెలెనా వెంటనే డోమినోస్ వారికి ఫోన్ చేసి పిజ్జా రాలేదని, పార్శిలో బాక్స్ లో డబ్బులు ఉన్నాయని చెప్పింది. ఆ కస్టమర్ నిజాయితీని డోమినోస్ వారు అభినందించారు. ఒక ఏడాది పాటు సెలెనాకు పిజ్జా ఫ్రీగా అందిస్తామని ఓ ప్రకటనలో తెలిపారు. ఆమె మేనేజర్ ఈ విషయం తెలుసుకుని వారం రోజుల పాటు ఆమెకు సెలవు ఇచ్చారు.