ఎస్ఆర్ నగర్ ఎస్బీఐలో భారీ అగ్నిప్రమాదం | fire accident at sr nagar atm in hyderabad | Sakshi
Sakshi News home page

ఎస్ఆర్ నగర్ ఎస్బీఐలో భారీ అగ్నిప్రమాదం

Published Mon, Aug 31 2015 3:24 AM | Last Updated on Thu, Sep 13 2018 5:11 PM

ఎస్ఆర్ నగర్ ఎస్బీఐలో భారీ అగ్నిప్రమాదం - Sakshi

ఎస్ఆర్ నగర్ ఎస్బీఐలో భారీ అగ్నిప్రమాదం

ఎస్‌ఆర్ నగర్ ఎస్‌బీఐలో ఘటన
హైదరాబాద్: ఎస్‌ఆర్ నగర్ ఎస్‌బీఐ కస్టమర్ వెయిటింగ్ హాల్‌లో ఆదివారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. బ్యాంక్ నుంచి భారీగా పొగలు రావడంతో పరిసర ప్రాంతాల్లోని ప్రజలు పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. రాత్రి 11.30 గంటల ప్రాంతంలో ఎస్‌బీఐ నుంచి పొగలు రావడాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మూడు ఫైరింజన్లు రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి.

వెంటనే అప్రమత్తం కావడంతో భారీ నష్టం తప్పింది. సంఘటనా స్థలాన్ని డీఐజీ మురళీ కృష్ణ, ఏసీపీ వెంకటేశ్వర్లు సందర్శించారు. ప్రమాదానికి గల కారణాలు, ఆస్తినష్టం వివరాలు ఇప్పుడే చెప్పలేమని వారు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement