ఎస్‌ఆర్ నగర్ దాసారంలో బస్తీలో బుధవారం రాత్రి పోలీసులు కార్డన్‌సెర్చ్ నిర్వహించారు.
హైదరాబాద్: ఎస్‌ఆర్ నగర్ దాసారంలో బస్తీలో బుధవారం రాత్రి పోలీసులు కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో 300 మంది పోలీసులతో బస్తీని జల్లెడపట్టారు. ఈ తనిఖీల్లో నలుగురు నిందితులు సహా 76 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 27 బైకులు, రెండు ఆటోలను పోలీసులు సీజ్ చేశారు.