హైదరాబాద్ : నగరంలోని బోరబండ ప్రాంతంలో పలు కాలనీల్లో పోలీసులు మంగళవారం తెల్లవారుజామున కార్డెన్ సర్చ్ నిర్వహించారు. బోరబండ, భరత్‌నగర్, బంజారానగర్, బాబాసాహెబ్‌నగర్ తదితర ప్రాంతాల్లో 586 ఇళ్లలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఏడుగురు రౌడీషీటర్లను, ముగ్గురు పాత నేరస్తులను అదుపులోకి తీసుకున్నారు.
అలాగే 17 మంది విదేశీయులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలు లేని 51 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. డీసీపీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 400 మంది పోలీసులు నలుగురు ఏసీపీలు, 14 మంది సీఐలు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.