
సాక్షి, హైదరాబాద్ : హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న ఓ వాహనదారుడిని నిలువరించేందుకు ప్రయత్నించిన ట్రాఫిక్ పోలీసులకు అనుకోని షాక్ తగిలింది. ఎస్సార్ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఓ యువకుడు హెల్మెట్ లేకుండా బైక్ నడపటాన్ని గమనించారు. యువకుడిని ఆపడానికి ప్రయత్నించగా, పోలీసులను చూడగానే ఒక్కసారిగా యువకుడికి ఫిట్స్ వచ్చి కింద పడిపోయాడు. దీంతో ట్రాఫిక్ పోలీసులు అతనికి సపర్యలు చేయాల్సి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment