హైదరాబాద్: నగరంలో విషాద సంఘటన వెలుగుచూసింది. కన్నతల్లే తనను రాచిరంపాన పెడుతోందంటూ ఓ బాలిక పోలీసులను ఆశ్రయించింది. నగరంలోని ఎస్సార్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. స్థానికంగా నివాసముంటున్న పదకొండేళ్ల బాలికను కన్నతల్లితోపాటు సవతితండ్రి వేధింపులకు గురిచేస్తున్నారు.
ఇంట్లో నీళ్లు పట్టలేదంటూ ఆమె గ్యాస్ కట్టర్‌తో కొట్టారు. దీంతో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. చదువుకోవాల్సిన వయస్సులో బాలిక వసతిగృహంలో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తోంది. సవతి తండ్రితోపాటు కన్నతల్లి సైతం బాలిక పట్ల అమానుషంగా వ్యవహరిస్తూ.. ఆమెను తీవ్రంగా కొట్టడంతో కంటికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారి పోరును తట్టుకోలేక ఆ చిన్నారి ఎస్సార్‌నగర్ పోలీసులను ఆశ్రయించింది.
ఓ కన్నతల్లి కర్కశత్వం!
Published Sun, Jun 4 2017 3:54 PM | Last Updated on Tue, Sep 5 2017 12:49 PM
Advertisement
Advertisement