cruel mother
-
హైదరాబాద్‌లో ఓ కన్నతల్లి కర్కశత్వం!
-
ఓ కన్నతల్లి కర్కశత్వం!
హైదరాబాద్: నగరంలో విషాద సంఘటన వెలుగుచూసింది. కన్నతల్లే తనను రాచిరంపాన పెడుతోందంటూ ఓ బాలిక పోలీసులను ఆశ్రయించింది. నగరంలోని ఎస్సార్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. స్థానికంగా నివాసముంటున్న పదకొండేళ్ల బాలికను కన్నతల్లితోపాటు సవతితండ్రి వేధింపులకు గురిచేస్తున్నారు. ఇంట్లో నీళ్లు పట్టలేదంటూ ఆమె గ్యాస్ కట్టర్‌తో కొట్టారు. దీంతో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. చదువుకోవాల్సిన వయస్సులో బాలిక వసతిగృహంలో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తోంది. సవతి తండ్రితోపాటు కన్నతల్లి సైతం బాలిక పట్ల అమానుషంగా వ్యవహరిస్తూ.. ఆమెను తీవ్రంగా కొట్టడంతో కంటికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారి పోరును తట్టుకోలేక ఆ చిన్నారి ఎస్సార్‌నగర్ పోలీసులను ఆశ్రయించింది. -
రూ. 5 చోరీ.. కొడుకును తగలబెట్టేసిన తల్లి
ఆరేళ్ల వయసున్న కొడుకు.. చిరుతిండి కొనుక్కోడానికి 5 రూపాయలు దొంగిలించాడన్న కోపంతో.. అతడి తల్లి అతడిని తగలబెట్టేసింది. ఈ ఘటన రాజస్థాన్‌లోని బికనీర్ ప్రాంతంలో జరిగింది. తీవ్రంగా కాలిన గాయాలైన ఆ బాలుడు ప్రస్తుతం పీబీఎం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పెట్టె లోంచి తనకు తెలియకుండా 5 రూపాయలను తన కొడుకు తీస్తుండగా రుక్సానా అనే మహిళ చూసింది. దీంతో తీవ్రంగా కోపం వచ్చిన ఆమె.. అతడికి నిప్పంటించింది. ఇతర కుటుంబ సభ్యులు అదిచూసి వెంటనే అతడిని కాపాడి, ఆస్పత్రికి తరలించారు. ఆ మహిళపై నయా శహర్ పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. అయితే ఇంతవరకు ఈ కేసులో ఎవరినీ అరెస్టు చేయలేదు.