Karate Kalyani Summoned By Officials Over Child Adoption: సినీ నటి కరాటే కళ్యాణి, యూట్యూబర్ శ్రీకాంత్‌రెడ్డి వివాదం రోజురోజుకు ముదురుతోంది. ప్రాంక్ పేరుతో ఆసభ్యకర వీడియోలు చేస్తున్నాడంటూ శ్రీకాంత్‌పై కరాటే కళ్యాణి దాడి చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో ఇద్దరిపై ఎస్‌ఆర్‌నగర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. ఈ క్రమంలో ఆకస్మాత్తుగా కరాటే కల్యాణి కనిపించకుండ పోవడం కొసమెరుపు. ఆమె ఆజ్ఞాతంలోకి వెళ్లిందా?.. ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారా? అనేది తెలియల్సి ఉంది.
చదవండి: సమంత ‘ఊ అంటావా..’ పాట సింగర్‌కు గోల్డ్ మెడల్!
మరోవైపు కరాటే కల్యాణి ఓ చిన్నారి దత్తత వ్యవహరం చర్చనీయాంశమైంది. ఈ విషయంలో ఆమెకు గతంలో నోటిసులు ఇచ్చినట్లు తాజాగా అధికారులు మీడియాకు వెల్లడించారు. అయితే ఆమె ఆ నోటీసులకు స్పందించలేదని, తన నుంచి ఎలాంటి సమాధానం రాలేదని వారు ఆరోపించారు. ఈ నేపథ్యంలో నేడు సోమవారం(మే 16) ఆమెకు మరోసారి నోటీసులు ఇచ్చామని అధికారులు తెలిపారు. రేపటి వరకు ఆమె ఈ నోటీసులపై స్పందించకపోతే తనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
చదవండి: కరాటే కల్యాణి మిస్సింగ్.. ఏమైపోయింది? ఎక్కడుంది?
పిల్లలను దత్తత తీసుకోవాలంటే కొన్ని రూల్స్ ఉంటాయని, దాని ప్రకారమే దత్తత తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఒకవేళ చట్టానికి విరుద్ధంగా వెళితే మూడేళ్లు జైలు శిక్ష పడుతుందని అధికారులు తెలిపారు. కాగా కరాటే కల్యాణి అక్రమంగా పాపను దత్తత తీసుకుందని పోలీసులకు సమాచారం అందడంతో ఆదివారం చైల్డ్ వెల్ఫేర్ అధికారులు ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఆ చిన్నారి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది వంటి తదితర వివరాలపై ప్రస్తుతం అధికారులు ఆరా తీస్తున్నారు. కాగా రీసెంట్‌గా శ్రీకాంత్ రెడ్డితో గొడవ జరిగినప్పుడు ఆమెతోపాటు ఆ చిన్నారి కూడా ఉన్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment