
కరాటే కల్యాణి ఆచూకిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. నిన్న(ఆదివారం)నుంచి కనపించకుండా పోయిన కరాటే కల్యాణి ఇంకా అఙ్ఞాతం వీడలేదు. ఆమె ఫోన్ కూడా ఇంకా స్విచ్ ఆఫ్‌లోనే ఉంది. దీంతో తన కూతురు ఏమైపోయిందో అని కరాటే కల్యాణి తల్లి విజయలక్ష్మీ ఆవేదన వ్యక్తం చేస్తోంది. శ్రీకాంత్ రెడ్డి తన కూతుర్ని కిడ్నాప్ చేసి ఉంటాడని ఆమె అనుమానం వ్యక్తం చేసింది.
ఈ సందర్భంగా సాక్షి మీడియాతో ఆమె మాట్లాడుతూ.. 'కరాటే కల్యాణి ఫేమ్ చూసి బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఆమెపై చేస్తున్న ఆరోపణలన్ని అవాస్తవం. పాప విషయం గురించి నాకేమీ తెలియదు. దత్తత తెచ్చుకుందని తెలుసు. కళ్యాణి మిస్సింగ్‌పై పోలీసులకు పిర్యాదు చేస్తాను తను ఎక్కడున్నా బయటికి రావాలని టీవీ ఛానెల్స్ ద్వారా కోరుతున్నాను' అని పేర్కొంది.
కాగా ప్రభుత్వ అనుమతి లేకుండా చిన్నారులను విక్రయిస్తుందని ఫిర్యాదులు రావడంతో ఆమె ఇంట్లో చైల్డ్ వెల్ఫేర్ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. పాపతో కలెక్టరేట్‌కి రమ్మని చెప్పారు. అయితే సోదాల సమయంలో కరాటే కల్యాణి ఇంట్లో లేదు. అంతేకాకుండా అప్పటి నుంచి ఆమె అజ్ఞాతంలోనే ఉండిపోయింది. దీంతో ఆమె ఎక్కడ ఉందన్నదానిపై అధికారులు విచారిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment