శ్రీకరన్, అనూష, షన్ను హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సస్పెన్స్ సెంటిమెంటల్ థ్రిల్లర్ మూవీ 'తారకేశ్వరి'. శ్రీ శివ సాయి ఫిలిం బ్యానర్‌లో డైరెక్టర్ వెంకట్ రెడ్డి నంది దర్శకత్వంతో పాటు నిర్మిస్తున్నారు. ఈ సినిమా పోస్టర్, ట్రైలర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్‌లో ఘనంగా జరిగింది. మూవీ పోస్టర్‌ను నటి కరాటే కళ్యాణి లాంచ్ చేయగా, ట్రైలర్‌ను నటుడు ఘర్షణ శ్రీనివాస్ ఆవిష్కరించారు.
ట్రైలర్ బాగుంది
ఈ సందర్భంగా కరాటే కళ్యాణి మాట్లాడుతూ.. 'తారకేశ్వరి' మూవీ ట్రైలర్ చాలా బాగా ఉంది. ఇది మంచికి, చెడుకు జరిగే పోరాటాన్ని చక్కగా చూపిస్తున్నట్టు తెలుస్తోంది. ఇలాంటి సినిమాలను అందరూ ఆదరించాలి. ఇందులో తెలుగు హీరోయిన్లు ఉన్నారు. తెలుగు వారికే డైరెక్టర్ వెంకట్ రెడ్డి గారు అవకాశం ఇవ్వడం అభినందనీయం" అన్నారు.
పాన్ ఇండియా స్థాయిలో..
హీరో శ్రీకర్ మాట్లాడుతూ.. "తెలుగు ఇండస్ట్రీ సినిమాలు ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో ఆదరణ సంపాదిస్తుండటం మనందరికి గర్వకారణం. డైరెక్టర్ వెంకట్ రెడ్డిగారు ఎంతో శ్రమించి అందరికి నచ్చే విధంగా సినిమాను తెరకెక్కించారు. మా సినిమాను అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను" అని తెలిపారు. హీరోయిన్ అనుష మాట్లాడుతూ.. "నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్‌కు కృతజ్ఞతలు. దూరపు కొండలు నునుపు.. దగ్గరికి వెళితే గరుకు.. తెలుగమ్మాయిలకు అవకాశం ఇస్తున్న ఇలాంటి సినిమాలను ఆదరించండి" అని అన్నారు.
ట్రైలర్‌లో కనిపిస్తోంది
నటుడు ఘర్షణ శ్రీనివాస్ మాట్లాడుతూ.. "హీరో శ్రీకర్‌కు మంచి భవిష్యత్తు ఉంది. డైరెక్టర్ వెంకట్ రెడ్డి గారి టాలెంట్ ఈ ట్రైలర్‌లో స్పష్టంగా కనిపించింది" అన్నారు. డైరెక్టర్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. "మా టీమ్ సభ్యులందరి కృషి వల్ల సినిమా చాలా బాగా వచ్చింది. ప్రేక్షకులందరూ దీన్ని ఆదరించాలి. ప్రేక్షకుల నమ్మకాన్ని మేం నిలబెట్టే విధంగా సినిమా తెరకెక్కించాము. త్వరలోనే ఆడియో, ప్రీరిలీజ్ ఫంక్షన్‌ను ఘనంగా నిర్వహించబోతున్నాం" అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment