యూట్యూబర్ శ్రీకాంత్‌రెడ్డి, నటి కరాటే కల్యాణి మధ్య జరిగిన వాగ్వాదం ఇప్పుడు నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. ప్రాంక్ వీడియోల పేరుతో మహిళలతో అసభ్య వీడియోలు చేయిస్తున్నారంటూ కరాటే కల్యాణి అతడిపై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఒకరిపై ఒకరు పరస్పరం దాడి చేసుకోవడంతో ఈ ఘర్షణ మరింత ముదిరింది.
ఈ క్రమంలో ఇరువురు ఎస్‌ఆర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. తాజాగా ఈ వివాదంపై నటి కరాటే కల్యాణి స్పందించింది. వీడియోల పేరుతో శ్రీకాంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నాడని, గతంలోనూ అమ్మాయిలను వేధించాడని ఆరోపించింది.
'బిగ్‌బాస్‌లో ఛాన్స్ ఇప్పిస్తా, యూట్యూబ్ స్టార్స్‌ని చేస్తా అని అమ్మాయిలను ట్రాప్ చేస్తాడు. ఈ విషయంపై మాట్లాడేందుకు వెళ్తే నాతోనూ అసభ్యంగా ప్రవర్తించాడు. డబ్బులిస్తాను.. నాతో కలిసి అడల్ట్ కంటెంట్ చేస్తావా? అని అడిగాడు. ఆ మాటకి కోపం వచ్చి చెంప పగలకొట్టాను. మహిళలతో ఇంత చీప్‌గా బిహేవ్ చేస్తున్న శ్రీకాంత్ రెడ్డి ఛానెల్‌ను యూట్యూబ్ నుంచి తక్షణమే తొలగించాలి' అని కరాటే కల్యాణి డిమాండ్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment