కల్బుర్గి: 14 ఏళ్ల బాలికను పదేళ్ల పాటు రేప్ చేసిన కిరాతకుడికి బీదర్ జిల్లా సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించింది. 5 వేల రూపాయల జరిమానా కూడా చెల్లించాలని ఆదేశించింది. నేరస్తుడి ఆస్తులను జప్తు చేసి బాధితురాలికి రూ.5 లక్షల పరిహారాన్ని ఇవ్వాలని జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసింది. 2002లో ఆరుద్ పట్టణ ప్రైమరీ స్కూల్ చైర్మన్ గా ఉన్న మారుతి అమ్రేప్ప తారే ఎనిమిదో తరగతి చదువుతున్న చిన్నారిని వేధించడం ప్రారంభించాడు. అప్పటికే ఇద్దరు బిడ్డలకు తండ్రయిన మారుతి చిన్నారిని పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులను కోరగా వారు చదువు మాన్పించి, మంగుళూరులో చదువుకోవడానికి పంపేశారు.
మంగుళూరు వెళ్లిన మారుతి ఆమెను అక్కడి నుంచి తీసుకువచ్చి తన ఇంట్లో పెళ్లి చేసుకున్నాడు. ఆయనను కూతురు కూడా ఇష్టపడుతుందేమోనని అనుకున్న తల్లిదండ్రులు ఏం చేయలేకపోయారు. అప్పటి నుంచి బాలిక తొమ్మిది సార్లు గర్భవతి అయిన ఆమెకు ఎనిమిది సార్లు అబార్షన్ చేయించాడు. తొమ్మిదో సారి వారి ఇద్దరికి బిడ్డ జన్మించింది. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని మారుతి బిడ్డను ఉదయగిరిలోని ఆశ్రమంలో వదిలేసి వచ్చాడు. 2012లో ఆమె మరలా గర్భం దాల్చడంతో అబార్షన్ చేయించేందుకు ప్రయత్నించాడు. దాన్ని వ్యతిరేకించిన ఆమెను ఇంట్లో నుంచి బయటకు గెంటేశాడు. దీంతో తల్లిదండ్రులను ఆశ్రయించిన ఆమె ఆరుద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసును విచారించిన జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి సంజీవ్ కుమార్ హంచాటే నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చారు.
ఆ క్రూరుడికి జీవితఖైదు
Published Fri, Jun 3 2016 1:35 PM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM
Advertisement
Advertisement