భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ ఎట్టకేలకు నెక్సాన్, హారియర్, సఫారీ రెడ్ డార్క్ ఎడిషన్‌లను విడుదల చేసింది. ఈ కొత్త ఎడిషన్స్ ఎక్కువ కాస్మెటిక్ అప్డేట్స్ మాత్రమే కాకుండా టెక్నాలజీ, సేఫ్టీ అప్‌గ్రేడ్స్ పొందుతాయి.
నెక్సాన్ రెడ్ డార్క్ ఎడిషన్:
దేశీయ మార్కెట్లో ఎక్కువ అమ్మకాలు పొందుతున్న టాటా నెక్సాన్ ఇప్పుడు రెడ్ డార్క్ ఎడిషన్‌లో కూడా లభిస్తుంది. ఇది నాలుగు వేరియంట్స్‌లో లభిస్తుంది. అవి..
- నెక్సాన్ ఎక్స్‌జెడ్ ప్లస్ రెడ్ డార్క్ పెట్రోల్ మాన్యువల్: రూ. 12.35 లక్షలు
- నెక్సాన్ ఎక్స్‌జెడ్ ప్లస్ రెడ్ డార్క్ డీజిల్ మాన్యువల్: రూ. 13.70 లక్షలు
- నెక్సాన్ ఎక్స్‌జెడ్ఏ ప్లస్ రెడ్ డార్క్ పెట్రోల్ ఆటోమాటిక్: రూ. 13.00 లక్షలు
- నెక్సాన్ ఎక్స్‌జెడ్ఏ ప్లస్ రెడ్ డార్క్ డీజిల్ ఆటోమాటిక్: రూ. 14.35 లక్షలు
నెక్సాన్ రెడ్ డార్క్ ఎడిషన్ ఇప్పుడు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఇన్-బిల్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్, వైర్‌లెస్ ఛార్జర్, క్రూయిజ్ కంట్రోల్, వెంటిలేటెడ్ సీట్లు, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది.
టాటా హారియర్ రెడ్ డార్క్ ఎడిషన్:
టాటా హారియర్ రెడ్ డార్క్ ఎడిషన్ ఇప్పుడు ఎక్స్‌జెడ్ ప్లస్ రెడ్ డార్క్ డీజిల్ మాన్యువల్, నెక్సాన్ ఎక్స్‌జెడ్ ప్లస్ (ఓ) రెడ్ డార్క్ డీజిల్ ఆటోమాటిక్ వేరియంట్స్‌లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వీటి ధరలు వరుసగా రూ. 21.77 లక్షలు, రూ. 24.07 లక్షలు. ఈ కొత్త ఎడిషన్ లో ADAS టెక్నాలజీ కూడా అందుబాటులో ఉంటుంది.
సఫారి రెడ్ డార్క్ ఎడిషన్:
ఈ ఎడిషన్ ఆరు వేరియంట్స్‌లో లభిస్తుంది. వీటి ధరలు రూ. 22.61 లక్షల నుంచి రూ. 25.01 లక్షల మధ్య ఉన్నాయి. సఫారి రెడ్ డార్క్ ఎడిషన్ కూడా ADAS ఫీచర్స్‌తో పాటు వెంటిలేటెడ్ సీట్లు, డోర్ హ్యాండిల్స్ దగ్గర, పనోరమిక్ సన్‌రూఫ్ చుట్టూ రెడ్ యాంబియంట్ లైటింగ్ పొందుతుంది.
టాటా రెడ్ డార్క్ ఎడిషన్‌లలో ఎటువంటి ఇంజిన్ అప్డేట్స్ లేదు, కావున పర్ఫామెన్స్ విషయంలో ఎటువంటి మార్పులు ఉండదు. 2023 ఆటో ఎక్స్‌పో వేదిక మీద సఫారి మరియు హారియర్ రెడ్ డార్క్ ఎడిషన్‌లు మాత్రమే కనిపించాయి, అయితే కంపెనీ ఇప్పుడు నెక్సాన్‌ని కూడా ఈ జాబితాలోకి చేర్చింది. రెడ్ డార్క్ ఎడిషన్ కొనుగోలుపైన 3 సంవత్సరాల/1,00,000కిమీ వారంటీ పొందవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment