ముంబై: కారు ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘టాటా హారియర్’ బుధవారం దేశీయ మార్కెట్లోకి ప్రవేశించింది. ల్యాండ్ రోవర్ డీ8 ప్లాట్‌ఫాంపై రూపొందిన ఈ సరికొత్త కాంపాక్ట్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (ఎస్‌యూవీ).. మొత్తం 4 వేరియంట్లలో లభ్యమవుతోంది. 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్, 6–స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, సింగిల్ పవర్‌ట్రెయిన్ ఈ కారు ప్రధాన ఫీచర్లు. ఎక్స్‌ఈ, ఎక్స్‌ఎం, ఎక్స్‌టీ, ఎక్స్‌జెడ్’ మోడళ్లను హారియర్ విభాగంలో కంపెనీ విడుదలచేసింది. వీటి ధరల శ్రేణి రూ.12.69 లక్షల నుంచి రూ.16.25 లక్షల మధ్య ఉన్నట్లు ప్రకటించింది. ఇంపాక్ట్ డిజైన్ 2.0 ఆధారంగా రూపొందించిన తొలి కారు ఇదేనని సంస్థ పేర్కొంది. ‘ల్యాండ్ రోవర్ డీ8 ఒమేగాఆర్కిటెక్చర్‌పై ఈ కారు రూపొందింది. టర్న్‌అరౌండ్ 2.0 ప్రణాళికలో భాగంగానే దీన్నివిడుదలచేశాం’ అని టాటా మోటార్స్ ప్రెసిడెంట్ మయాంక్ పరీఖ్ మాట్లాడుతూ.. వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment