భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన 'మారుతి సుజుకి' (Maruti Suzuki) యొక్క 'బ్రెజ్జా' (Brezza) విక్రయాల పరంగా ఓ సరికొత్త రికార్డుని కైవసం చేసుకుంది. దేశీయ విఫణిలో అడుగుపెట్టినప్పటిన ఏడు సంవత్సరాల ఎనిమిది నెలలు కాలంలో ఈ రికార్డుని సొంతం చేసుకుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
నివేదికల ప్రకారం 2016 మార్చి నుంచి ఇప్పటికి 10 లక్షలు లేదా 1 మిలియన్ కార్లను విక్రయించినట్లు మారుతి సుజుకి వెల్లడించింది. కంపెనీ 9 లక్షల యూనిట్లను విక్రయించిన తరువాత కేవలం ఎనిమిది నెలల్లో మరో లక్ష యూనిట్లను విక్రయించినట్లు సమాచారం.
దేశీయ మార్కెట్లో విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు సగటు నెలవారీ అమ్మకాలు 13,921 యూనిట్లు లేదా వారానికి 3480 లేదా ప్రతిరోజూ 497 యూనిట్లు అని తెలుస్తోంది.
ఇదీ చదవండి: ఆర్‌బీఐ గవర్నర్‌గా 'రఘురామ్ రాజన్' జీతం ఎంతంటే?
ఈ ఏడాది మార్చిలో CNG వేరియంట్‌ని ప్రవేశపెట్టిన తరువాత అమ్మకాలు మరింత వేగవంతమయ్యాయి. అంతకు ముందు బ్రెజ్జా ప్రత్యర్థి నెక్సాన్ వల్ల అమ్మకాలు కొంత మందగించాయి. కానీ 2022 - 23 ఆర్ధిక అసంవత్సరంలో బ్రెజ్జా అత్యధికంగా అమ్ముడైన కారుగా రికార్డ్ క్రియేట్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment