ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి దేశీయ మార్కెట్లో సుమారు 87,599 ఎస్-ప్రెస్సో & ఈకో కార్లకు రీకాల్ ప్రకటించింది. కంపెనీ ఎందుకు రీకాల్ ప్రకటించింది, దీని వెనుక ఉన్న రీజన్ ఏంటి? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం..
నివేదికల ప్రకారం, మారుతి సుజుకి తన ఎస్ ప్రెస్సో అండ్ ఈకో కార్లలో స్టీరింగ్ సమస్య ఉన్నట్లు గుర్తించింది. ఇది వెహికల్ స్టీరబిలిటీ అండ్ హ్యాండ్లింగ్ మీద ప్రభావం చూపే అవకాశం ఉందని సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
2021 జులై 05 నుంచి 2023 ఫిబ్రవరి 15 మధ్య తయారైన ఎస్ ప్రెస్సో & ఈకో కార్లకు మాత్రమే రీకాల్ ప్రకటించడం జరిగింది. కావున కస్టమర్లు ఈ సమస్యను సంబంధిత డీలర్‌షిప్‌లలో చెక్ చేసుకుని తగిన పరిష్కారం పొందవచ్చు. ఈ సర్వీస్ మొత్తం ఉచితంగానే లభిస్తుంది.
(ఇదీ చదవండి: ఫుడ్ సీక్రెట్ చెప్పిన సుధామూర్తి - విదేశాలకు వెళ్లినా..)
మారుతి సుజుకి ఈ సంవత్సరంలో రీకాల్ చేయడం ఇది నాలుగవ సారి కావడం గమనార్హం. ఇందులో భాగంగానే ఇప్పటివరకు 1,23,351 యూనిట్లను రీకాల్ చేసింది. కార్లను రీకాల్ చేయడం మన దేశంలో ఇదే మొదటిసారి కాదు. గతంలో మహీంద్రా అండ్ మహీంద్రా, టయోటా వంటి కంపనీలు కూడా రీకాల్ ప్రకటించాయి.
Comments
Please login to add a commentAdd a comment