పండుగల సీజన్‌లో ‘మారుతీ’ బంపర్‌ ఆఫర్‌  | Suzuki Baleno Model Costs Rs.1 Lakh Reduction | Sakshi
Sakshi News home page

పండుగల సీజన్‌లో ‘మారుతీ’ బంపర్‌ ఆఫర్‌ 

Published Sat, Sep 28 2019 5:11 AM | Last Updated on Sat, Sep 28 2019 5:11 AM

Suzuki Baleno Model Costs Rs.1 Lakh Reduction - Sakshi

న్యూఢిల్లీ: దేశీ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) తాజాగా మరో విడత భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. పండుగల సీజన్‌లో బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది. తాజాగా తన బాలెనో మోడల్‌ కారు ధరను రూ. 1,00,000 తగ్గించినట్లు స్టాక్‌ ఎక్సే్ఛంజీలకు ఇచ్చిన సమాచారంలో పేర్కొంది. ఈనెల 25న (బుధవారం) ఎంపిక చేసిన మోడళ్లపై ధరలను రూ.5,000 వరకూ తగ్గించామని మారుతీ సుజుకీ ప్రకటించిన విషయం తెలిసిందే కాగా, ఇందుకు అదనంగా తాజా తగ్గింపు ఉంటుందని శుక్రవారం ప్రకటించింది. ఆల్టో 800, ఆల్టో కే10, స్విఫ్ట్‌ డీజిల్‌ సెలెరియో, బాలెనో డీజిల్, ఇగ్నిస్, డిజైర్‌ డీజిల్, టూ ర్‌ ఎస్‌ డీజిల్, విటారా బ్రెజా, ఎస్‌–క్రాస్‌ మోడళ్ల ధరలను రూ. 5వేల వరకు ఈ వారంలో తగ్గించిం ది. ఆటో పరిశ్రమ సంక్షోభాన్ని చవిచూస్తోన్న నేపథ్యంలో తమ కంపెనీ అమ్మకాలను పెంచే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement