rs.1 lakh
-
పండుగల సీజన్లో ‘మారుతీ’ బంపర్ ఆఫర్
న్యూఢిల్లీ: దేశీ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ) తాజాగా మరో విడత భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. పండుగల సీజన్లో బంపర్ ఆఫర్ ఇచ్చింది. తాజాగా తన బాలెనో మోడల్ కారు ధరను రూ. 1,00,000 తగ్గించినట్లు స్టాక్ ఎక్సే్ఛంజీలకు ఇచ్చిన సమాచారంలో పేర్కొంది. ఈనెల 25న (బుధవారం) ఎంపిక చేసిన మోడళ్లపై ధరలను రూ.5,000 వరకూ తగ్గించామని మారుతీ సుజుకీ ప్రకటించిన విషయం తెలిసిందే కాగా, ఇందుకు అదనంగా తాజా తగ్గింపు ఉంటుందని శుక్రవారం ప్రకటించింది. ఆల్టో 800, ఆల్టో కే10, స్విఫ్ట్ డీజిల్ సెలెరియో, బాలెనో డీజిల్, ఇగ్నిస్, డిజైర్ డీజిల్, టూ ర్ ఎస్ డీజిల్, విటారా బ్రెజా, ఎస్–క్రాస్ మోడళ్ల ధరలను రూ. 5వేల వరకు ఈ వారంలో తగ్గించిం ది. ఆటో పరిశ్రమ సంక్షోభాన్ని చవిచూస్తోన్న నేపథ్యంలో తమ కంపెనీ అమ్మకాలను పెంచే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. -
ఇక అరుణ పేరిట అవార్డు
భోపాల్: 42 ఏళ్ల పాటు జీవచ్ఛవంలా బతికి, కన్నుమూసిన అరుణా షాన్ బాగ్‌కు మధ్యప్రదేశ్ ప్రభుత్వం గొప్ప నివాళి అర్పించింది. ఆమె పేరిట గొప్ప అవార్డును ప్రకటించింది. ఇక మహిళలపై దోపిడికి వ్యతిరేకంగా పోరాడే ఏ స్వచ్ఛంద సంస్థకై ప్రతి యేటా అరుణా షాన్ బాగ్ పేరిట రూ.లక్షతో అవార్డు ఇస్తామని చెప్పింది. ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అరుణకు ఘన సంతాపం వ్యక్తం చేశారు. ఆమె జీవితంలో జరిగిన ఘటన అత్యంత బాధాకరమని చెప్పారు. గౌరవానికి అరుణ చిహ్నం అని అభివర్ణించారు. చట్టాల్లో మార్పు తీసుకురావాల్సిన తరుణం వచ్చిందని చెప్పారు. సమాజంలో మహిళలపట్ల ఆలోచన ధోరణి మారాల్సిన అవసరం ఉందన్నారు. ప్రేమించిన డాక్టరు సందీప్‌ను పెళ్లి చేసుకొని పిల్లాపాపలతో హాయిగా ఉండాల్సిన అరుణ, ఓ దుర్మార్గుడి దురాగతంతో అచేతనంగా మారిపోయింది. దాదాపు 42 ఏళ్లపాటు జీవచ్ఛవంలా బతికి చివరకు ప్రాణాలు విడిచింది.