మారుతి కొత్త బాలెనో లాంచ్‌..ధర ఎంత? | Maruti Suzuki Baleno top-end automatic variant launched | Sakshi
Sakshi News home page

మారుతి కొత్త బాలెనో లాంచ్‌..ధర ఎంత?

Published Sat, Jul 22 2017 9:57 AM | Last Updated on Tue, Sep 5 2017 4:38 PM

మారుతి కొత్త బాలెనో లాంచ్‌..ధర ఎంత?

మారుతి కొత్త బాలెనో లాంచ్‌..ధర ఎంత?

న్యూఢిల్లీ: మారుతి సుజుకి ప్రీమియం హ్యాచ్‌ బ్యాక్‌ సెగ్మెంట్‌లో సరికొత్త బాలెనోను లాంచ్‌ చేసింది. సీవీటీ  ఆప్షన్‌తో హాచ్‌బ్యాక్‌  టాప్ ఎండ్‌ మోడల్‌  ఆటోమేటిక్‌ వేరియంట్‌గా దీనిని ప్రవేశపెట్టింది. ఈ కొత్త బాలెనోను ధర రూ. 8.34 లక్షలు(ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించింది.

 హై ఎండ్‌ ఫీచర్స్‌తో  ఈ ప్రీమియం వెర్షన్‌ ఆటోమేటిక్‌ బాలెనో కార్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ఈ ప్రయోగంతో, ఆటోమేటిక్ బాలెనో కొనుగోలుకు చూస్తున్న వినియోగదారులకు ఆపిల్ కార్‌ ప్లే,  మిర్రర్‌ లింక్‌తో  పనిచేసే స్మార్ట్‌ ఫోన్‌ లింకేజ్‌ డిస్‌ ప్లే ఆడియోతో సహా హై-ఎండ్ ఫీచర్స్‌ అందుతాయని సంబంధిత కంపెనీ అధికారి తెలిపారు. సీవీటీ  (కంటిన్యూయస్‌లీ వేరియబుల్‌  ట్రాన్స్‌మిషన్‌) ఆప్షన్‌తో డెల్టా, జెటా కార్లను ఇప్పటికే లాంచ్‌ చేసిన విషయం తెలిసిందే.

కాగా, 2015లో  లాంచ్‌ అయిన ఈ బాలెనో  ఒక ఏడాదిలోనే లక్షలకార్ల విక్రయాల మైలురాయిని అధిగమించింది.  అలాగే ఇప్పటికి 2లక్షలకు పైగా కార్లు అమ్ముడయ్యాయి. మారుతి సుజుకి ఇప్పటికే ఈ ఏడాది మార్చిలో  స్పోర్టీ వెర్షన్‌ బాలెనో ఆర్ఎస్ కారును విడుదల చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement