మారుతి కొత్త బాలెనో లాంచ్..ధర ఎంత?
న్యూఢిల్లీ: మారుతి సుజుకి ప్రీమియం హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్లో సరికొత్త బాలెనోను లాంచ్ చేసింది. సీవీటీ ఆప్షన్‌తో హాచ్బ్యాక్ టాప్ ఎండ్ మోడల్ ఆటోమేటిక్ వేరియంట్‌గా దీనిని ప్రవేశపెట్టింది. ఈ కొత్త బాలెనోను ధర రూ. 8.34 లక్షలు(ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించింది.
హై ఎండ్ ఫీచర్స్‌తో ఈ ప్రీమియం వెర్షన్ ఆటోమేటిక్ బాలెనో కార్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ఈ ప్రయోగంతో, ఆటోమేటిక్ బాలెనో కొనుగోలుకు చూస్తున్న వినియోగదారులకు ఆపిల్ కార్ ప్లే, మిర్రర్ లింక్‌తో పనిచేసే స్మార్ట్ ఫోన్ లింకేజ్ డిస్ ప్లే ఆడియోతో సహా హై-ఎండ్ ఫీచర్స్ అందుతాయని సంబంధిత కంపెనీ అధికారి తెలిపారు. సీవీటీ (కంటిన్యూయస్లీ వేరియబుల్ ట్రాన్స్మిషన్) ఆప్షన్‌తో డెల్టా, జెటా కార్లను ఇప్పటికే లాంచ్ చేసిన విషయం తెలిసిందే.
కాగా, 2015లో లాంచ్ అయిన ఈ బాలెనో ఒక ఏడాదిలోనే లక్షలకార్ల విక్రయాల మైలురాయిని అధిగమించింది. అలాగే ఇప్పటికి 2లక్షలకు పైగా కార్లు అమ్ముడయ్యాయి. మారుతి సుజుకి ఇప్పటికే ఈ ఏడాది మార్చిలో స్పోర్టీ వెర్షన్ బాలెనో ఆర్ఎస్ కారును విడుదల చేసిన సంగతి తెలిసిందే.