మారుతీ నుంచి అదిరిపోయే న్యూఏజ్ బాలెనో,రూ.10వేల‌కే బుకింగ్స్ ప్రారంభం! | Bookings Open For New Age Baleno For Rs11000 | Sakshi
Sakshi News home page

మారుతీ నుంచి అదిరిపోయే న్యూఏజ్ బాలెనో,రూ.10వేల‌కే బుకింగ్స్ ప్రారంభం!

Published Mon, Feb 7 2022 1:32 PM | Last Updated on Mon, Feb 7 2022 1:44 PM

Bookings Open For New Age Baleno For Rs11000 - Sakshi

కారు కొనుగోలు దారుల‌కు ప్ర‌ముఖ ఆటోమొబైల్ దిగ్గ‌జం మారుతీ సుజుకి ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. కొత్త హ్యాచ్ బ్యాక్‌ న్యూఏజ్ బాలెనో కార్ల బుకింగ్‌ల‌ను ప్రారంభించిన‌ట్లు తెలిపింది. కొత్త హంగుల‌తో మార్కెట్‌కి ప‌రిచ‌య‌మైన ఈ కారును కేవ‌లం రూ.10వేల‌తో బుకింగ్ చేసుకోవ‌చ్చ‌ని సూచించింది. కొనుగోలుదారులు మారుతి సుజుకి  నెక్సా షోరూమ్లో లేదంటే మారుతి సుజుకి నెక్సా వెబ్‌సైట్‌ను సంద‌ర్శించి బుక్ చేసుకోవ‌చ్చంది.  

ఈ సంద‌ర్భంగా మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్ & సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ మాట్లాడుతూ..ఇప్ప‌టి వ‌ర‌కు 1 మిలియన్ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్‌లు విక్రయించినట్లు తెలిపారు.“క‌స్ట‌మ‌ర్ల అవ‌స‌రాల్ని తీర్చేందుకు డైనమిక్‌గా డిజైన్ చేసిన‌ట్లు చెప్పారు. ఇన్-కార్ టెక్నాలజీ, ఎక్స్‌ప్రెసివ్ డిజైన్, క్లాస్ లీడింగ్ సేఫ్టీ వంటి సౌక‌ర్యాలు ఉన్నాయ‌ని అన్నారు.  

న్యూ ఏజ్ బాలెనో 'ఫస్ట్-ఇన్ సెగ్మెంట్' హెడ్ అప్ డిస్‌ప్లేను కలిగి ఉంది.హెచ్‌యుడితో,డిస్ప్లే స్పీడోమీటర్, క్లైమేట్ కంట్రోల్ నుంచి ఇన్ఫ‌ర్మేష‌న్ ను అందించ‌డంతో పాటు  కొనుగోలు దారుల‌కు అనుగుణంగా ఇంకా మ‌రెన్నో ఫీచ‌ర్లు అందుబాటులో ఉన్నాయ‌ని శ‌శాంక్ శ్రీవాస్త‌వ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement