
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ దిగ్గజ వాహన తయారీ కంపెనీ మారుతీ సుజుకీ తాజాగా తన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ 'బాలెనో' లో లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్‌ను లాంచ్ చేసింది. సాంకేతికంగా ఎలాంటి మార్పులు చేయనప్పటికీ కాస్మొటిక్, ఇంటీరియర్ మార్పులు చేసి స్పోర్టీ లుక్‌తో ఈ కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది. అలాగే ధరల వివరాలను అధికారికంగా ప్రకటించలేదు. అయితే స్టాండర్డ్ మోడల్‌తో పోలిస్తే 30 నుంచి 40వేల ప్రీమియం ధర ఉండవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.కాగా ఫెస్టివ్ సీజన్‌లలో లిమిటెడ్ ఎడిషన్ కార్లను కస‍్టమర్లకు అందించడం ఇది మూడవ సారి. గతంలో ఇగ్నిస్, స్విఫ్ట్ మోడల్ కార్లలో స్పెషల్ ఎడిషన్ కార్లను విడుదల చేసింది. బాలెనో వాస్తవ ధరలు రూ. 5.48 లక్షలు, (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) నుంచి ప్రారంభం.
Comments
Please login to add a commentAdd a comment