2022 Maruti Baleno Facelift: భారతీయ మార్కెట్లో త్వరలోనే కొత్త 2022 మారుతి బాలెనో ఫేస్‌లిఫ్ట్ (2022 Maruti Baleno Facelift) విడుదల కానుంది. ఈ కొత్త బాలెనో ఫేస్‌లిఫ్ట్ కి సంబంధించిన చాలా విషయాలను కంపెనీ ఇదివరకే చాలా టీజర్ వీడియోల ద్వారా పంచుకుంది. అయితే ఇప్పుడు కొత్తగా ఈ కారుకు సంబంధించిన పిక్స్ ఇంటర్నెట్లో వైరల్ గా మారాయి.
డిజైన్లో సరికొత్త హంగులతో...
2022 మారుతి సుజుకి బాలెనో ప్రొఫైల్ ప్రస్తుత మోడల్‌కు కొంతవరకు సమానంగా ఉంటుంది. ఇది కొన్ని ముఖ్యమైన డిజైన్ మార్పులను పొందుతుంది. విండో లైన్ వెంట క్రోమ్ తో రానుంది. , ఇది వెనుక క్వార్టర్ గ్లాస్ వరకు విస్తరించి ఉంది. డోర్ హ్యాండిల్స్‌పై కూడా క్రోమ్ లుక్స్ కనిపిస్తుంది. బాలెనో కొత్తగా రూపొందించిన 16-అంగుళాల 10-స్పోక్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ తో రానుంది.
2022 మారుతి సుజుకి బాలెనో రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ లుక్‌తో రానుంది. ఫేస్ లిఫ్ట్ మోడల్ కోసం గ్రిల్ వెడల్పుగా వస్తోంది. ఇది LED హెడ్‌లైట్‌లు,DRL లు కొత్త సెట్‌తో రానుంది. ఫాగ్‌ల్యాంప్ కేసింగ్ పరిమాణాన్ని పెంచడానికి బంపర్ కూడా ట్వీక్ చేశారు.. బానెట్‌కు మరింత ఫ్లాట్‌గా కనిపించేలా రీడిజైన్ చేయబడింది. ఈ వివరాలు కంపనీ ప్రీమియమ్ డీలర్‌షిప్ అవుట్‌లెట్ నెక్సా వెబ్‌సైట్ ద్వారా లీకయ్యాయి.
భద్రతలో సరికొత్తగా...
న్యూ ఫేస్ లీఫ్ట్ బాలెనోలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు వంటి అనేక భద్రతా ఫీచర్లు ఉన్నాయి. 2022 మారుతి సుజుకి బాలెనో వెనుక భాగం కూడా రీడిజైన్ చేయబడింది. ఇది ఇప్పుడు LED ర్యాప్‌రౌండ్ టైల్‌లైట్ సరికొత్తగా వెనుక బంపర్‌తో అందించబడుతుంది. మారుతి హ్యాచ్‌బ్యాక్ డైమెన్షన్‌ను మార్చనందున బూట్ స్పేస్ మారదు. 2022 మారుతి సుజుకి బాలెనో ఇంటీరియర్ రీడిజైన్ చేయబడిన డ్యాష్‌బోర్డ్‌తో రిఫ్రెష్ లుక్‌ను అందిస్తుంది. ఇది ఇప్పుడు డ్యాష్‌బోర్డ్ వెడల్పులో క్రోమ్ యాక్సెంట్‌లతో డ్యూయల్-టోన్ యూనిట్. ఫ్లోటింగ్ 9-ఇచ్ డిజిటల్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ సరౌండ్ సెన్స్‌తో స్మార్ట్‌ప్లే ప్రో+ని అందిస్తుంది. ఈ కారులో స్టీరింగ్ వీల్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, క్లైమేట్ కంట్రోల్ ప్యానెల్‌లోని స్విచ్ గేర్లు కూడా మార్చబడ్డాయి.
ఇంజిన్ విషయానికీ వస్తే...
మారుతి బాలెనో భారతదేశంలో ఒకే ఇంజన్ ఆప్సన్ అందుబాటులోకి వచ్చింది. కంపెనీ ఈ బాలెనో ఇంజిన్‌ను మార్చలేదు. కావున మొదటిది 1.2-లీటర్ ఇంజన్, ఇది 83 బిహెచ్‌పి పవర్, 113 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తోంది. ఈ ఇంజన్ 5 స్పీడ్ మ్యాన్యువల్, AMT గేర్‌బాక్స్‌తో అందుబాటులో ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment