ఫైల్ ఫోటో
సాక్షి, ముంబై: దీపావళి సీజన్‌ని క్యాష్ చేసుకునేందుకు మార్కెట్ లీడర్ మారుతీ సుజుకీ భారీ ఆఫర్లను ప్రకటించింది. ఇన్సూరెన్స్ ప్రీమియం పెంపుతో ఇబ్బందులు పడుతున్న వాహనదారులకు శుభవార్త. స్విఫ్ట్, డిజైర్, బాలెనో మోడళ్ల కార్లపై దివాలీ ఆఫర్‌గా భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ముఖ్యంగా హ్యుందాయ్ నుంచి తీవ్రమైన పోటీ ఉండటంతో డిస్కౌంట్లను పెంచి కస్టమర్స్‌ని అట్రాక్ట్ చేస్తోంది. తాజాగా 23శాతం డిస్కౌంట్ అందిస్తోంది. స్విఫ్ట్, డిజైర్, బాలెనోలపై రూ.18,750 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. గతంలో ఇచ్చిన డిస్కౌంట్ కన్నా ఇది రూ.3,500 ఎక్కువ. ధంతేరస్, దీపావళి సందర్భంగా డిస్కౌంట్ ద్వారా మరిన్ని అమ్మకాలను సాధించనున్నామని సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్ మరియు అమ్మకాలు) ఆర్ ఎస్‌కల్సీ చెప్పారు
పెట్రోల్, డీజిల్ ధరలు, మరోవైపు ఇన్సూరెన్స్ రేట్లు పెరగడం, వడ్డీ రేట్లు అక్టోబర్ నెల రీటైల్ విక్రయాలను ప్రభావితం చేశాయి. మరోవైపు అక్టోబర్ నెల విక్రయాల్లో మారుతి సుజుకి మెరుగైనప్రదర్శన కనబర్చింది. గత సెప్టెంబరు నెలలో తొలిసారి 1.5శాతం క్షీణతతో 1,38,100 యూనిట్స్ అమ్మితే... అక్టోబర్‌లో 1,46,766 యూనిట్స్‌ను విక్రయించింది. అటు రెండవ అతిపెద్ద కార్ల తయారీదారు హ్యుందాయ్ కూడా కార్ల ధరలపై డిస్కౌంట్‌ను ప్రకటించనుందని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment