Diwali Offer
-
బీఎస్ఎన్ఎల్ దీపావళి బొనాంజా.. అదిరిపోయే ఆఫర్!
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ దీపావళి సందర్భంగా అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించింది. కస్టమర్లకు ప్రస్తుతం ఉన్న రీచార్జ్ ప్లాన్లపై 3జీబీ అదనపు డేటాను అందిస్తున్నట్లు వెల్లడించింది. అదనపు డేటా ఆఫర్ ప్రస్తుతం ఉన్న రూ. 251 రీఛార్జ్ ప్లాన్‌తోపాటు రూ. 400 లోపు ఉన్న ఇతర రీఛార్జ్ ప్లాన్లపైనా వర్తిస్తుంది. బీఎస్ఎన్ఎల్లో రూ. 400 లోపు ప్రస్తుతం మూడు రీఛార్జ్ ప్లాన్లు ఉన్నాయి. అవి రూ. 251, రూ. 299 రూ. 398. దీపావళి బొనాంజాలో భాగంగా బీఎస్ఎన్ఎల్ ప్రత్యేక డేటా ఆఫర్ గురించి ‘ఎక్స్’ (ట్విటర్) ద్వారా పోస్ట్‌ల అధికారికంగా ప్రకటిచింది. అదనపు డేటాను పొందండిలా.. బీఎస్ఎన్ఎల్ అధికారిక పోర్టల్‌తోపాటు సెల్ఫ్-కేర్ యాప్ ద్వారా రీఛార్జ్ చేసుకున్నప్పుడు మాత్రమే అదనపు డేటా ప్రయోజనం పొందవచ్చు. రూ. 251 రీచార్జ్‌పై అదనంగా 3జీబీ డేటాను బీఎస్ఎన్ఎల్ అందిస్తోంది. దీంతోపాటు ప్లాన్‌లో భాగంగా 70జీబీ డేటా లభిస్తుంది. 28 రోజుల పాటు వ్యాలిడిటీ ఉంటుంది. అలాగే రూ. 299 ప్లాన్‌పైనా 3జీబీ ఉచిత డేటాను ప్రకటించింది. ఈ ప్లాన్ ఇప్పటికే రోజుకు 3జీబీ డేటా, 100 ఎస్సెమ్మెస్‌లు, అపరిమిత లోకల్, ఎస్టీడీ వాయిస్ కాలింగ్‌తో వస్తుంది. 30 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. ఇక రూ. 398 రీచార్జ్ ప్లాన్‌కు కూడా 3జీబీ అదనపు డేటా వర్తిస్తుంది. ఈ ప్లాన్‌పై రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు, అపరిమిత ఎస్టీడీ, లోకల్ వాయిస్ కాలింగ్‌తో పాటు 120 జీబీ డేటా వస్తుంది. 30 రోజులు చెల్లుబాటు ఉంటుంది. బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్ యాప్ గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్లలో అందుబాటులో ఉంది. Celebrate Diwali with #BSNLSelfCareApp and get 3GB extra data for voucher ₹299. Enjoy unlimited browsing, streaming, and sharing this #FestiveSeason.#RechargeNow: https://t.co/KUu7rPO1F5 (For NZ, EZ& WZ), https://t.co/5AAj1chxOo (For SZ)#BSNL #BSNLDiwaliBonanza #G20India pic.twitter.com/i0Zda4tbHA — BSNL India (@BSNLCorporate) November 3, 2023 -
ట్రాఫిక్ ఉల్లంఘనలకు నో ఫైన్! వారంపాటు.. ఎక్కడంటే..
దీపావళి సందర్భంగా అక్కడ వారంపాటు ట్రాఫిక్ రూల్స్ ఎత్తేశారు. పండుగ సందర్భంగా ట్రాఫిక్ ఉల్లంఘనలకు గానూ ఎలాంటి ఫైన్ విధించబోమని ప్రకటించింది గుజరాత్ ప్రభుత్వం. అక్టోబర్ 21 నుంచి 27 తేదీల మధ్య ఈ నిర్ణయం అమలులో ఉంటుందని హోం శాఖ మంత్రి హర్ష్ సంఘవీ ప్రకటించారు. దీపావళి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఈ వార్త చెబుతున్నాం. అలాగని ఈ నిర్ణయంతో రూల్స్‌ను అతిక్రమించాలని మాత్రం చూడకండి. ఒకవేళ రూల్స్ బ్రేక్ చేస్తూ పోలీసులు చూస్తూ ఊరుకోరు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే, గుజరాత్ పోలీసులు వెంటనే పూలు ఇచ్చి శిక్షిస్తారు అని ప్రకటించారు. అంతేకాదు.. దీపావళి సందర్భంగా భూపేంద్ర పటేల్ ప్రభుత్వం మరిన్ని ప్రజా సంక్షేమ నిర్ణయాలు ప్రకటించబోతోందని హర్ష్ సంఘవీ తెలిపారు. గుజరాత్లో ఈ ఏడాది చివర్లో ఎన్నికలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక ట్రాఫిక్ ఉల్లంఘనలకు నో జరిమానా నిర్ణయంపై నెట్లో మిశ్రమ స్పందన లభిస్తోంది. ભારતીય સંસ્કૃતિનો સૌથી મોટો ઉજાસ ઉત્સવ એટલે દિવાળી. રંગોળીઓના રંગ, મિષ્ટાનોની ભરમાર અને દીવા તેમજ ફટાકડાનો ઉમંગ લઈને આ તહેવાર આવે છે. આ તહેવાર નિમિત્તે મૃદુ અને મક્કમ ગુજરાત સરકારના મુખ્ય મંત્રી શ્રી @Bhupendrapbjp જી નો વધુ એક પ્રજાલક્ષી નિર્ણય pic.twitter.com/V1omwopeWV — Harsh Sanghavi (@sanghaviharsh) October 21, 2022 -
బాబోయ్ అదిరిపోయే బంపరాఫర్.. పాత ఇళ్లు ఇచ్చి కొత్త ఇళ్లు తీసుకోండయ్యా!
పెళ్లి చేసి చూడు, ఇళ్లు కట్టి చూడు అన్నారు పెద్దలు. ఎందుకంటే ఈ రెండు జీవితంలో చాలా ముఖ్యమైనవి, అలాగే కష్టంతో కూడుకున్నవి కాబట్టి. పెళ్లి టాపిక్ పక్కన్న పెట్టి ఇంటి విషయంలోకి వెళ్దాం. సమాజంలో ప్రతి ఒక్కరూ కనే కల తమకంటూ ఓ సొంతిళ్లు ఉండాలనుకోవడం. ఇందుకోసం కొన్నేళ్లు కష్టపడేవాళ్లు కూడా ఉన్నారు. ఈ క్రమంలో కొందరి కల కలగానే మిగిలిపోతే, మరికొందరు కష్టపడి సాధించుకుంటున్నారు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఇంటిని పండుగ సీజన్లో ఓ బంపరాఫర్ ద్వారా మన సొంతం చేసుకోవచ్చండి. ఎలా అనుకుంటున్నారా! ఈ ఆఫర్ ఎక్కడో తెలుసా! కొత్త అపార్ట్మెంట్ల విక్రయాల జోరును కొనసాగించేందుకు, కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా (CREDAI)- మహారాష్ట్ర చాంబర్ ఆఫ్ హౌసింగ్ ఇండస్ట్రీ (MCHI) ఓ ఆఫర్‌ని ప్రకటించాయి. అయితే, ఈ ఆఫర్ ముంబైలోని వారికి మాత్రమే వర్తిస్తుంది. ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (BKC)లోని ఎంఎంఆర్డీఏ (MMRDA) గ్రౌండ్స్‌లో (CREDAI-MCHI) 30వ ప్రాపర్టీ ఎగ్జిబిషన్ నిర్వహిస్తోంది. ఇందులో 100 మందికి పైగా రియల్టీ డెవలపర్లు పాల్గొంటున్నారు. ఈ ఈవెంట్ అక్టోబర్ 13 నుంచి 16 వరకు జరుగుతుంది. ఈ ఎగ్జిబిషన్ విజయవంతంగా నిర్వహించడం కోసం, ప్రోప్‌టెక్ స్టార్టప్ జాప్కీ (Zapkey) CREDAI-MCHIతో జతకట్టింది. ఆఫర్ ఏంటంటే! జాప్కీ పాత ఇళ్లు అమ్మాలనుకునే వారికి కొంత టోకన్ అమౌంట్ ఇస్తుంది. వారికి 90 రోజుల్లోగా ఆ ఇంటిని కచ్చితంగా అమ్మిపెడుతుంది. ఆసక్తి గల కొనుగోలుదారులు తమ పాత ఇంటికి ఎక్స్చేంజ్గా కొత్త అపార్ట్‌మెంట్‌ని అక్కడే కొనుగోలు చేసుకోవచ్చు. ఈ ఆఫర్‌పై జాప్కీ కో వ్యవస్థాపకుడు మాట్లాడుతూ.. ‘‘మేము టోకెన్ డబ్బులు ఇచ్చి కస్టమర్ల ఇంటిని మార్కెట్ ధరకే అమ్ముతాము. అది కూడా 90 రోజుల్లోనే. ఒకవేళ ఆ ప్రాపర్టీని అమ్మలేకపోతే ఆ ఇంటిని మేమే కొనడం లేదా టోకెన్ అమౌంట్‌ను వదులుకుంటాం. ₹1 కోటి కంటే ఎక్కువ విలువ కలిగిన ఆస్తుల కోసం కస్టమర్లు ₹1 లక్ష, ₹1 కోటి కంటే తక్కువ విలువ కలిగిన ఆస్తులకు ₹50,000 టోకెన్ అమౌంట్‌గా చెల్లిస్తాం. 20 సంవత్సరాల కంటే పాత ఆస్తిని తీసుకోము, కానీ కొన్ని సందర్భాల్లో భవనం మంచి స్థితిలో ఉంటే మార్కెట్లో డిమాండ్ ఉన్నట్లయితే, మేము దానిని తీసుకోవచ్చు. అది కూడా ఆస్తిని భౌతికంగా సందర్శించిన తర్వాత విక్రయిస్తామని," చెప్పారు. అలాగే పాత ప్రాపర్టీని అమ్మి పెడుతున్నందుకు బ్రోకరేజ్ ఛార్జీలుగా 2 శాతాన్ని తాము వసూలు చేయనున్నామని ఈ ప్రాప్‌టెక్ సంస్థ తెలిపింది. చదవండి: ఇది ఊహించలేదు.. యూజర్లకు భారీ షాకిచ్చిన జియో! -
దివాలీ ఆఫర్ : 101 రూపాయలకే స్మార్ట్‌ఫోన్
సాక్షి, ముంబై: పండగ సీజన్‌ను పురస్కరించుకుని మొబైల్ కంపెనీలు డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించడం కామనే. ఈ క్రమంలోనే రానున్న దీపావళి పర్వదినం సందర్భంగా స్మార్ట్‌ఫోన్ తయారీదారు వివో బంపర్ ఆఫర్ ప్రకటించింది. పండుగ సందర్భంగా వీ 20ఎస్, వీ 20, ఎక్స్ 50 సీరిస్ స్మార్ట్ఫోన్లను 101 రూపాయలకే సొంతం చేసుకోవచ్చని తెలిపింది. అలాగే ఐసీఐసీఐ, కోటక్, ఫెడరల్‌బ్యాంకు , బ్యాంక్ ఆఫ్‌బరోడాల కార్డు కొనుగోళ్లపై 10శాతం క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. దీపావళి ఆఫర్లతో కొత్త ఆనందాన్ని వెలిగించండి అంటూ వివో తాజాగా ట్వీట్ చేసింది. కేవలం రూ. 101 చెల్లించి మీ రెంతో ఇష్టపడే వివో ఫోన్‌ను సొంతం చేసుకోండి. దీంతోపాటు అదనపు ప్రయోజనాలను కూడా ఆస్వాదించండని పేర్కొంది. అయితే ఎప్పటినుంచి ఎప్పటివరకు ఈ ఆఫర్ అందుబాటులోఉండనుందీ స్పష్టత ఇవ్వలేదు. ఈ ఆఫర్ ప్రకారం మొదట 101 రూపాయల డౌన్ పేమెంట్ చెల్లించి పైన పేర్కొన్న వాటిలో నచ్చిన స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. అనంతరం ఫోన్ విలువ మొత్తాన్ని ఎంపికచేసిన సులభ ఈఎంఐ వాయిదాలలో చెల్లించాల్సి ఉంటుంది. Light up a new delight with great Diwali offers. Get your hands on the most loved vivo phones by paying just ₹101 and enjoy additional benefits. Click on the link to find the nearest vivo store: https://t.co/GYFTgNDbnQ pic.twitter.com/zzTwxLPhqv — Vivo India (@Vivo_India) November 6, 2020 -
జియో యూజర్స్‌కు గుడ్‌న్యూస్
సాక్షి, ముంబై: ‘జియో ఫోన్ దీపావళి 2019 ఆఫర్`కు అనూహ్య స్పందన వచ్చిందని రిలయన్స్ తెలిపింది. రూ.1500 విలువ చేసే జియో ఫోన్‌ను కేవలం రూ.699కే అందించి మూడు వారాల పాటు కొనసాగించిన ఈ ఆఫర్‌కు ఊహించనంత డిమాండ్ వచ్చిందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఈ ఆఫర్‌ను మరో నెల రోజుల పాటు పొడిగిస్తున్నట్టు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఫీచర్ ఫోన్ వినియోగదారులందరూ దీపావళి ఆఫర్‌ను వినియోగించుకోవాలన్న ఉద్దేశంతో దీన్ని పొడిగించినట్టు పేర్కొంది. 2జీ ఫోన్ వినియోగదారులు ఈ పొడిగింపుతో తమ ఖాతాదారులుగా మారతారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. 4జీ డివైస్ ప్లాట్ఫామ్లో నంబర్‌వన్‌గా రిలయన్స్ జియో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సూపర్ ఆఫర్ ఇలా.. దీపావళి 2019 ఆఫర్లో భాగంగా జియో ఫోన్‌పై రూ. 800 తగ్గింపు, రూ.700 విలువైన డాటా, మొత్తం కలిపి రూ.1500 ప్రయోజనం ప్రతి జియో ఫోన్ వినియోగదారుడికి అందించింది. కొత్తగా కొనుగోలు చేసే జియోఫోన్‌పై రూ.700 విలువ చేసే డాటాను అందిస్తోంది. ఇందులో భాగంగా వినియోగదారుడి చేసుకునే ఒక్కో రీచార్జ్‌కు అదనంగా రూ.99 విలువైన డాటాను జియో అందిస్తుంది. మొదటి ఏడు రీచార్జ్‌లకు రూ.99 విలువైన డాటాను జియో అదనంగా జతచేయనుంది. ఈ డాటాతో ఎంటర్టైన్మెంట్, పేమెంట్స్, ఈకామర్స్, విద్య, శిక్షణ, రైలు, బస్ బుకింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్‌లు మరెన్నో సౌకర్యాలు పొందుతారు. -
దసరా టు దీపావళి జియో బంపర్ ఆఫర్
సాక్షి, ముంబై: భారతీయ టెలికాం రంగంలో 4జీ టెక్నాలజీతో సంచలనాలకు మారు పేరుగా మారిన రిలయన్స్ జియో ఇప్పుడు 2జీ మార్కెట్‌పై కన్నేసింది. 2జీ వినియోగదారులకు స్మార్ట్ఫోన్లను విరివిగా అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా `జియో ఫోన్ దీపావళి 2019 ఆఫర్` పేరుతో కొత్త ఆఫర్‌ను జియో నేడు ప్రకటించింది. జియో ఫోన్‌పై రూ. 800 తగ్గింపు, రూ.700 విలువైన డాటా, మొత్తం కలిపి రూ.1500 భారీ ప్రయోజనం ప్రతి జియో ఫోన్ వినియోగదారుడికి సొంతం అవుతుంది. ఈ దసరా టూ దివాలీ ఆఫర్ రేపు (అక్టోబర్ 8) ఈ నెల 27వరకు మాత్రమే అందుబాటులో వుంటుందని జియో ప్రకటించింది. దసరా, దీపావళి పండుగ సమయంలో, జియో ఫోన్ ప్రస్తుత ధర రూ.1500 కాకుండా ప్రత్యేక ధర కింద కేవలం రూ. 699కే జియో ఫోన్ అందుబాటులో ఉంచుతున్న సంగతి తెలిసిందే. మరో ప్రత్యేకత ఏంటంటే ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న 2జీ ఫీచర్ ఫోన్ల కంటే కూడా ఈ ధర ఎంతో తక్కువ కావడం విశేషం. అంతేకాదు పాత ఫోన్ ఎక్సేంజ్ చేసుకోవడం వంటి ప్రత్యేకమైన షరతులు ఏవీ కూడా విధించకపోవడం దీనియొక్క మరో ప్రత్యేకత. తద్వారా, ఫీచర్ ఫోన్ వినియోగదారులు శక్తివంతమైన 4జీ సేవలను అందించనుంది. రూ.700కు సంబంధించి, జియో ఫోన్ వినియోగదారులు ఆ మొత్తంతో జియో ఫోన్ కొనుగోలు చేసి 2జీ నుంచి 4జీ డాటా ప్రపంచంలోకి మారిపోవచ్చు. రూ.700 విలువైన డాటా ప్రయోజనాలను అందిస్తోంది. వినియోగదారుడు చేసుకున్న మొదటి ఏడు రీచార్జ్‌లకు రూ.99 విలువైన డాటాను జియో అధనంగా జతచేయనుంది. జియోఫోన్ వినియోగదారులకు అధనంగా అందే ఈ రూ.700 డాటాతో జియో వినియోగదారులు ఎంటర్టైన్మెంట్, పేమెంట్స్, ఈకామర్స్, విద్య, శిక్షణ, రైలు, బస్ బుకింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్‌లు మరెన్నో అంశాలకు సంబంధించిన మునుపెన్నడూ లేని అనుభూతులను సొంతం చేసుకోవచ్చని జియో తెలిపింది. డిజిటల్ ఇండియా కల సాకారం చేసుకోవడంలో భాగంగా జియో అందిస్తున్న దీపావళి కానుక. ఈ పండుగ మాసంలో జియో ద్వారా అందించే ఒక్కసారి మాత్రమే లభ్యమయ్యే ఈ ఆఫర్ సద్వినియోగం చేసుకోవాలని, భారతదేశంలో 2జీ సేవలను వినియోగిస్తున్న వారు దాని నుంచి అప్‌గ్రేడ్ అయి జియో ఫోన్ ప్లాట్‌ఫాంకు చేరువ కావాలని జియో ప్రకటించింది. -
దివాలీ ఆఫర్: మారుతి కార్లపై భారీ తగ్గింపు
సాక్షి, ముంబై: దీపావళి సీజన్‌ని క్యాష్ చేసుకునేందుకు మార్కెట్ లీడర్ మారుతీ సుజుకీ భారీ ఆఫర్లను ప్రకటించింది. ఇన్సూరెన్స్ ప్రీమియం పెంపుతో ఇబ్బందులు పడుతున్న వాహనదారులకు శుభవార్త. స్విఫ్ట్, డిజైర్, బాలెనో మోడళ్ల కార్లపై దివాలీ ఆఫర్‌గా భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ముఖ్యంగా హ్యుందాయ్ నుంచి తీవ్రమైన పోటీ ఉండటంతో డిస్కౌంట్లను పెంచి కస్టమర్స్‌ని అట్రాక్ట్ చేస్తోంది. తాజాగా 23శాతం డిస్కౌంట్ అందిస్తోంది. స్విఫ్ట్, డిజైర్, బాలెనోలపై రూ.18,750 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. గతంలో ఇచ్చిన డిస్కౌంట్ కన్నా ఇది రూ.3,500 ఎక్కువ. ధంతేరస్, దీపావళి సందర్భంగా డిస్కౌంట్ ద్వారా మరిన్ని అమ్మకాలను సాధించనున్నామని సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్ మరియు అమ్మకాలు) ఆర్ ఎస్‌కల్సీ చెప్పారు పెట్రోల్, డీజిల్ ధరలు, మరోవైపు ఇన్సూరెన్స్ రేట్లు పెరగడం, వడ్డీ రేట్లు అక్టోబర్ నెల రీటైల్ విక్రయాలను ప్రభావితం చేశాయి. మరోవైపు అక్టోబర్ నెల విక్రయాల్లో మారుతి సుజుకి మెరుగైనప్రదర్శన కనబర్చింది. గత సెప్టెంబరు నెలలో తొలిసారి 1.5శాతం క్షీణతతో 1,38,100 యూనిట్స్ అమ్మితే... అక్టోబర్‌లో 1,46,766 యూనిట్స్‌ను విక్రయించింది. అటు రెండవ అతిపెద్ద కార్ల తయారీదారు హ్యుందాయ్ కూడా కార్ల ధరలపై డిస్కౌంట్‌ను ప్రకటించనుందని తెలుస్తోంది. -
బీఎస్ఎన్ఎల్ దివాలీ స్వీట్
సాక్షి, ముంబై: ఫెస్టివ్ సీజన్లో దేశీయ ప్రధాన టెలికం కంపెనీలు కస్టమర్లను ఆకట్టుకునేందుకు వివిధ ఆఫర్లతో ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే జియో దీపావళి బొనాంజా ప్రకటించగా ఇదే బాటలో ఇతర కంపెనీలు కూడా పయనిస్తున్నాయి. తాజాగా ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ దివాలీ ఆఫర్ ప్రకటించింది. దీపావళి పండుగ సందర్భంగా 8.8శాతం టాక్ టైంను అదనంగా అందిస్తున్నట్టు బుధవారం ప్రకటించింది. వివిధ టాప్‌అప్‌లపై ఈ అదనపు టాక్ టైంను ఆఫర్ చేస్తోంది. ఆ ఆఫర్ 25 అక్టోబర్ నుంచి నవంబరు 15 దాకా మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలిపింది. కాగా జియో వార్షికప్లాన్కు పోటీగా బీఎస్ఎన్ఎల్ కూడా వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. Enjoy this Diwali with #BSNL. Get extra talk value upto 8.8% on top up plans. pic.twitter.com/qnDIwni3T8 — BSNL India (@BSNLCorporate) October 24, 2018 -
జెట్ ఎయిర్వేస్ దీపావళి ఆఫర్
ముంబై: దీపావళి పండుగ సందర్భంగా విమానయాన సంస్థల దీపావళి బొనాంజా కొనసాగుతోంది. తాజాగా జెట్ ఎయిర్ వేస్ కొత్త తగ్గింపు ధరలను ప్రకటించింది. రూ. 921 (అన్నీ చార్జీలు కలుపుకొని) నుంచి ప్రారంభమయ్యే విమాన టికెట్ ధరలను బుధవారం ప్రకటించింది. ఈ ఆఫర్ నిర్దిష్ట మార్గాలలో ఆరు రోజుల పాటు అమలుచేయనున్నట్టు తెలిపింది. అక్టోబర్ 25 నుండి 30 వరకు అమలు చేయనున్న ఈ సిక్స్ డేస్ సేల్ ఒకవైపు ధరలకు, డైరెక్ట్ విమానాలకు అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ఈ బుకింగ్ తరువాత 15 రోజుల్లోపు జెట్ ఎయిర్వేస్ యొక్క నెట్వర్క్ లో నిర్దిష్ట దేశీయ రూట్లలో ప్రయాణించాల్సి ఉంటుందని ఒక ప్రకటనలో నేడు తెలియచేసింది. దీపావళి నేపథ్యంలోఈ ఆఫర్ ప్రకటించామని, బుకింగ్ తర్వాత మాత్రమే 15 రోజుల్లో నవంబర్ 9 న గానీ, లేదా తర్వాత గానీ ప్రయా ప్రయాణం చేయొచ్చని జెట్ ఎయిర్ వేస్ చీఫ్ కమర్షియల్స్ ఆఫీసర్ జయరాజ్ షణ్ముగం తెలిపారు. దీంతోపాటు మొబైల్ యాప్ ద్వారా బుక్ చేసుకుంటే మరో రూ. 200 డిస్కౌంట్ కూడా ఇస్తున్నట్టు ప్రకటించారు. 117 విమానాలతో సేవలు అందిస్తున్న జెట్ ఎయిర్ వేస్ సంస్థ ఫస్ట్ కం ఫస్ట్ సర్వ్ పద్ధతిలోఈఆఫర్ అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. -
స్పైస్‌జెట్ దీపావళి ఆఫర్
న్యూఢిల్లీ: చౌక చార్జీల విమానయాన సంస్థ స్పైస్‌జెట్ మంగళవారం దీపావళి సేల్ ధమాకా పేరిట పరిమిత కాల ఆఫర్ ప్రకటించింది. దీని కింద దేశీ రూట్లలో ప్రయాణాలకు బేస్ చార్జీలు రూ. 749 నుంచి ప్రారంభమవుతాయి (పన్నులు అదనం). అలాగే విదేశీ ప్రయాణాలకు సంబంధించి చార్జీలు రూ. 3,999 నుంచి ప్రారంభమవుతాయి. అక్టోబర్ 29 దాకా ఈ ఆఫర్ కింద టికెట్లు బుక్ చేసుకోవచ్చు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి అక్టోబర్ 29 దాకా చేసే ప్రయాణాలకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు ఇది ఉపయోగపడగలదని స్పైస్‌జెట్ వర్గాలు పేర్కొన్నాయి.